Budget Allocations To AP In Union Budger 2025 - 26: కేంద్ర బడ్జెట్ 2025 - 26ను (Union Budger 2025) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మధ్య తరగతి, వేతన జీవులకు ఊరట కల్పించడం సహా రైతులు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. భారీ ఆదాయాన్ని వదులుకొని రూ.12 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు కల్పించింది. అటు, ఏపీకి సైతం వరాల జల్లు కురిపించింది. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు సహా విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులు కేటాయించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన వివరాలు ఓసారి పరిశీలిస్తే..

పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయింపు. ప్రాజెక్టు నిర్మాణం వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.30,436.95 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వకు ఆమోదం తెలిపింది.

పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు

విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు

రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు

లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆపరేషన్‌కు మద్దతుగా రూ.375 కోట్లు

రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు

రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు

అలాగే, ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు రూ.242.50 కోట్లు కేటాయిస్తున్నట్లు విత్త మంత్రి ప్రకటించారు.

Also Read: Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?