Budget 2025 MSME and Startups: ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌‌లకు అదిరిపోయే న్యూస్ - ఏకంగా రూ.20 కోట్ల వరకు రుణాలు

10 months ago 8
ARTICLE AD
<p>Budget 2025 Live Updates: దేశంలో పెట్టుబడులతో పాటు స్టార్టప్ లకు కేంద్రం ఊతమిచ్చింది.&nbsp; ఈసారి చిన్న తరహా, స్టార్టప్&zwnj;లపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి బడ్జెట్ లో వరాలు ప్రకటించింది. వారి కోసం ప్రత్యేక ఫండ్&zwnj; ఇవ్వనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఎంఎస్&zwnj;ఈలు, స్టార్టప్&zwnj;లు 20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వారికి ప్రత్యేక క్రెడిట్ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.</p> <p>చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఎంఎస్&zwnj;ఎంఈ రుణం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు కేంద్రం రుణాలు ఇస్తామని తెలిపింది. వీటితో పాటు డెయిరీ, ఫిషరీకి రూ.5 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. మరోవైపు అస్సాంలోని నామ్&zwnj;రూప్&zwnj;లో యూరియా ప్లాంట్&zwnj; ఏర్పాటుకు కేంద్రం నిర్నయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించి, వారి కాళ్ల మీద నిలబడేలా ప్రోత్సహించేందుకు స్టార్టప్&zwnj;లకు రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించింది.&nbsp;</p> <p>తోలు పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి&nbsp; లభించనుంది. భారతదేశాన్ని టాయ్ హబ్&zwnj;గా మారుస్తామని కేంద్ర మంత్రి నిర్మలమ్మ చెప్పారు. &nbsp;బొమ్మల తయారీ కోసం జాతీయ ప్రణాళిక రూపకల్పన చేస్తామన్నారు.&nbsp;అతి పెద్ద లాజిస్టిక్&zwnj; వ్యవస్థ పోస్టల్ శాఖ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖను మార్చడానికి తాము సిద్ధమని చెప్పారు. దానిని దేశంలోనే అతి పెద్ద లాజిస్టిక్&zwnj; వ్యవస్థ తీర్చిదిద్దేందుకు బడ్జెట్&zwnj;లో ప్రతిపాదించింది.&nbsp;</p>
Read Entire Article