Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
2 months ago 6
ARTICLE AD
Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు
Medchal District Latest News: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధి సర్వే నంబర్ 49/6లో ఉన్న సుమారు 5 ఎకరాల భూమిలో సోమవారం రెవెన్యూ అధికారులు భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి, అధికారులకు భద్రత కల్పించారు. సమాచారం ప్రకారం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. జేసీబీల సహాయంతో అక్కడ ఉన్న గుడిసెలు, తాత్కాలిక షెడ్లు, గదులు తదితర నిర్మాణాలను అధికారులు తొలగించారు. కూల్చివేతల సమయంలో కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ భూమి ప్రభుత్వ భూమిగా గుర్తించి ఆక్రమణలను తొలగిస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అధికారుల నుంచి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కూల్చివేతల నేపథ్యంలో సర్వే నంబర్ 49/6 పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Read Entire Article