Brahmamudi Serial Today Episode: రాజు, ఇందు ఇద్దరు వెళ్లి మదన్‌ ను కలిసి రేఖను క్షమించి ఇంటికి వచ్చేయమని రిక్వెస్ట్‌ చేస్తారు. వస్తానని మదన్‌ చెప్తాడు. పార్టీలో లక్కీని తమ పెద్దకొడుకుగా అందరికీ పరిచయం చేస్తారు రేఖ, భూషణ్‌. ఇంకా ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మదన్‌ను కలిసిన రాజు, ఇందు

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

రాజు, ఇందు ఇద్దరూ మదన్‌ను రేఖతో మళ్లీ కలపాలని రేపే మదన్‌ దగ్గరకు వెళ్లి మాట్లాడాలని అనుకుంటారు. అనుకున్నట్టుగానే.. ఇద్దరూ మదన్‌ దగ్గరకు వెళ్తారు. మదన్‌ ఫుల్లుగా తాగుతుంటాడు. ఏం చేస్తున్నావు మదన్‌ అంటూ అడిగితే.. నాలోని బాధను కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నాను.. ఒకవేళ మీరు నా తల్లి గురించి మాట్లాడటానికి వచ్చి ఉంటే వెళ్లిపోండి అంటాడు. కానీ ఇందు తన మాటలతో తల్లి గొప్పదనం గురించి చెప్తుంది. తల్లి తప్పు చేసిందని బాధపడుతున్నావు. కానీ ఒక్కసారి మీ మమ్మీ గురించి ఆలోచించు సరిగ్గా నీ వయసులో తెలిసితెలియక తప్పు చేసింది. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి తప్పు మీద తప్పు చేసింది.. కానీ తను తన తప్పును ఒప్పుకుంది తను మనిషిగా మారడానికి రెడీగా ఉంది. అని చెప్పగానే.. రాజు అవును ఈరోజు రాత్రికి ఇంట్లో పార్టీ అరైంజ్‌ చేశారు. ఆ పార్టీలో మీ అమ్మ లక్కీని తన పెద్దకొడుకుగా అనౌన్స్‌ చేయబోతుంది.. పైగా మీ డాడీ కూడా మీ అమ్మను క్షమించాడు లక్కీకి తండ్రిగా ఉండేందుకు ఒప్పుకున్నాడు అని చెప్పగానే.. మదన్‌ మా డాడీ క్షమించాడు కదా..? నేను కూడా క్షమించాను ఇక మీరు వెళ్లండి అంటూ చెప్తాడు మదన్‌.

రేఖను మారిపోమ్మని చెప్పిన రాజు

రాజు, రేఖ దగ్గరకు వెళ్లగానే రేఖ కోపంగా చూస్తూ వెళ్లిపోతుంది. కానీ రాజు ఆపి ఇదంతా నీవు తప్పు చేయడం వల్లే జరిగింది. కానీ నావల్ల కూడా తప్పు జరిగింది అందుకే నా తప్పు సరిదిద్దుకోవడానికి నేను మదన్‌ను కలిశాను అంటూ రాజు చెప్పగానే.. రేఖ కోపంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడగ్గానే.. నిజం పిన్ని నేను మదన్‌ను కలిశాను. మదన్‌ నిన్ను క్షమించి ఎప్పటిలాగే నీతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నాడు. మనం మనుషులం పిన్ని ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు ఈ మాత్రం దానికి ఇన్ని పగలు ఎందుకు..? అంటూ రాజు మాట్లాడుతుంటే.. రేఖ ఎమోషనల్ అవుతుంది. రాజు వెళ్లిపోతాడు.

స్వాతిని ఆట పట్టించిన రాజు, ఇందు

మరుసటి రోజు పార్టీకి అందరూ వస్తుంటే.. రాజు, ఇందు గేటు దగ్గర నిలబడి అందరికీ స్వాగతం పలుకుతుంటారు. అప్పుడే స్వాతి బాగా రెడీ అయి వస్తుంది. ఏంటి స్వాతి చాలా బాగా రెడీ అయ్యావు మదన్‌ కోసమా అంటూ రాజు ఆట పట్టిస్తాడు. ఎందుకైనా మంచిది నీ చేతిలో కొన్ని నీళ్లు పట్టుకుని ఉండు నిన్ను చూసి మదన్‌ ప్లాట్‌ అయి పడిపోగానే మదన్‌ ముఖం మీద కొన్ని నీళ్లు చల్లి లేపోచ్చు అంటాడు. స్వాతి సిగ్గుపడుతూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఏంటి మదన్‌ ఇంకా రావడం లేదు అని ఇందు అంటే.. మదన్‌ సంగతి తర్వాత కానీ ఈ పార్టీకి సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ అయిన లక్కీ గాడు ఎక్కడున్నాడు అంటాడు.

తమ నటనతో లక్కీని ప్లాట్‌ చేసిన రేఖ, భూషణ్‌

ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

లక్కీ రూంలో రెడీ అవుతుంటే రేఖ వెళ్లి చాలా బాగా ఉన్నావు మహరాజులా మెరిసిపోతున్నావు అంటూ మెచ్చుకుంటుంది. లక్కీ ఎమోషనల్‌ అవుతూ నా తల్లి నన్ను దగ్గరకు తీసుకుంటుందా..? అని బాధపడుతుంటే..నాకు తల్లితో పాటు తండ్రిని కూడా ఇచ్చావు అంటూ ఏడుస్తుంటాడు. రేఖ కూడా ఎమోషనల్‌ అవుతూ లక్కీ పుట్టినప్పుడు జరిగిన విషయాలు మొత్తం రివీల్‌ చేసుకుంటూ ఏడుస్తుంది. భూషణ్‌ కూడా ఏడుస్తుంటాడు. లక్కీ ఏడుస్తూ ఇక నా జీవితం మొత్తం నీకోసమేనమ్మా నువ్వేం చెప్పినా చేస్తాను అంటాడు. రేఖ మాత్రం మనసులో హ్యాపీగా పీలవుతూ నాకు కావాల్సింది కూడా ఇదేరా అందుకే ఇలా నటిస్తున్నాను అంటుంది. భూషణ్‌ కూడా మనసులో సక్సెస్‌ అనుకుంటాడు.

లక్కీని తమ కొడుకుగా పరిచయం చేసిన రేఖ, భూషణ్‌

తర్వాత లక్కీని స్వయంగా పార్టీ దగ్గరకు తీసుకెళ్తారు రేఖ, భూషణ్‌. అందరి ముందు లక్కీ తన కన్నకొడుకని పెద్ద కొడుకని పరిచయం చేస్తుంది. అందరు తప్పులు చేస్తుంటారు. ఒక్కోక్కరు ఒక్కో తప్పు చేశారు. అలాగే తెలిసీ తెలియని వయసులో తాను తప్పు చేశానని చెప్తుంది రేఖ. అప్పుడే మదన్‌ అక్కడకు వస్తాడు. రేఖ మాటలకు చప్పట్లు కొడుతూ నవ్వుతూ వస్తుంటాడు. లక్కీని చూసిన రేఖ ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త