Brahmamudi Serial Today Episode: రాజును ఇంట్లోంచి పంపించి ఇందును పిచ్చిదాన్ని చేసి ఆస్థిని చేజిక్కించుకోవాలని రేఖ కొత్త ప్లాన్‌ చేస్తుంది. అందుకు అనుగుణంగానే.. లక్కీని టార్గెట్‌ చేస్తుంది రేఖ. ఇంకా బ్రహ్మముడి సీరియల్‌ ఇవాళ్టీ ఏపిసోడ్‌లో ఏం జరిగిందనేది టీవీలో కన్నా ముందు మనం తెలుసుకుందాం.

రేఖ కొత్త ప్లాన్‌ రెడీ

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

భూషణ్‌, రేఖ, భ్రమరాంబ కోపంగా చూసుకుంటూ ఆలోచిస్తుంటారు. శేషు వచ్చి వెర్రోల్లు ఏదో చేద్దానుకుని ఇందు ఇచ్చిన షాక్‌కు కుదేలైపోయారు అని మనసులో అనుకుంటూ భ్రమరాంబను ఏమైందని అడుగుతాడు. భ్రమరాంబ కోపంగా శేషును తిడుతూ రేఖను తిడుతుంది. అసలు నువ్వు ఇంత చెత్త ప్లాన్‌ వేస్తావు అనుకోలేదు అంటుంది. భూషణ్‌ కూడా రేఖ ఈ మధ్య ఏమైంది నీకు నువ్వు ఏం చేసినా ఫెయిల్‌ అవుతున్నావు అని అడగ్గానే.. ఒకప్పుడు ఈ ఇంటికి మగదిక్కు లేదు కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుంది. అసలు అల్లుడు ఉండగా మీకు ఈ ఆస్థి రాదు అంటాడు శేషు. శేషు మాటలకు కోపంగా రేఖ తిడుతూ.. ఇందు నాటకం ఆడుతుందని నాకు అనుమానంగా ఉంది మొత్తం నిజమేంటో తెలుసుకుంటాను. రాజుకు సిరికి ఉన్న సంబంధం తెలుసుకుని రాజును గెంటేసే వరకు నిద్రపోను అంటూ మాట్లాడుతుంది.

రాజును తిట్టి ఇంట్లోంచి వెళ్లిపోయిన చలపతి

ఇంట్లో అందరూ సీరియస్‌గా ఉంటే అప్పుడే ఇందు వెళ్తుంది. చలపతి కోపంగా రాజు ఎక్కడని రేఖ ముందు మేము ఏమన్నా బాగుండదని నోరు ఎత్తలేదు అంటూ తిడుతుంటాడు. వెంకీ కూడా రాజును తిడితే.. ఇందు అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఆయన ఏ తప్పు చేయలేదు నేను చెప్తున్నాను కదా నమ్మండి అంటూ రాజును వెనకేసుకొస్తుంది. లక్ష్మీ కూడా కోపంగా రాజును తిడుతుంది. అసలు రాజు ఇలా చేస్తాడని మేము కలలో కూడా అనుకోలేదమ్మా మా తల తీసేసినట్టు ఉంది అనగానే.. ఇందు అంకుల్‌ మళ్లీ చెప్తున్నాను తను ఏ తప్పు చేయలేదు.. కానీ మనం తనను అర్థం చేసుకుని వెయిట్‌ చేద్దాం ఏదో ఒకరోజు తనే నిజం చెప్తాడు అంటే నీ అంత మంచితనం మాకు లేదమ్మా అంటూ చలపతి లక్ష్మీని వెంకీని తీసుకుని వెళ్లిపోతాడు. నందు కోపంగా రాజు ఏంటి అక్కా ఇలా చేశాడు అంటూ వెళ్లిపోతుంది. అపర్ణ, సుభాష్‌ కూడా రాజు గురించి బాధపడుతుంటే.. ఇందు వాళ్లను ఓదార్చి మీకు అర్థం అయ్యే వరకు కాస్త ఓపిక పట్టండి అంటూ చెప్పగానే.. అపర్ణ సరే అంటుంది.

కొత్త గేమ్‌ స్టార్ట్‌ చేసిన రేఖ

ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

లక్కీ ఆకలిగా ఉందని కిందకు వస్తాడు. ఎదురుగా స్వాతి రాగానే.. టిఫిన్‌ పెట్టమని అడిగితే తనకు తెలియదని కాస్త ఆగితే ఇందు అక్క వస్తుంది అని చెప్తుండగానే.. రేఖ వస్తుంది. స్వాతి తిట్టి ఆకలిగా ఉందంటే ఎందుకు ఆగమంటున్నావు అంటూ లక్కీని తీసుకెళ్లి డైనింగ్‌ టేబుల్‌ మీద కూర్చోబెట్టి ఇడ్లీ వడ్డిస్తుంది. ఏ చట్నీ వేయాలి అని అడుగుతుంది. లక్కీ ఎమోషనల్‌ అవుతుంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. లక్కీ ఏడుస్తూ కూర్చుని ఉంటే ఏమైంది ఆకలిగా ఉందన్నావు కదా తిను నేను తినిపించనా..? అనగానే.. లక్కీ ఎమోషనల్‌గా మేడం అంటూ పిలుస్తే.. మేడం కాదు అమ్మా… నేను నిన్ను కొడుకుగా ఒప్పుకుంటున్నాను ఒక్కసారి నువ్వు అమ్మా అని పిలిస్తే వినాలని ఉంది అంటూ ఎమోషనల్‌ అయినట్టు నటిస్తుంది.

లక్కీ అమ్మా అని పిలవగానే.. చాలు లక్కీ ఈ జన్మకు ఇది చాలు చిన్నప్పుడు ఈ అమ్మ నీకు గోరు ముద్దలు తినిపించలేదు కదా అంటూ ఇడ్లీ తినిపిస్తుంది రేఖ. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. రాజు అనుమానంగా ఇందు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడగ్గానే.. ఇందు ఏమో రాజు అంటుంది. రేఖ మాత్రం ఎందుకు అందరూ అలా చూస్తున్నారు.. లక్కీ చిన్నప్పటి నుంచి ఏమేం మిస్‌ అయ్యారో అన్ని నేను ఇస్తాను. తనకు తల్లితో పాటు తండ్రిని కూడా ఇస్తాను అంటూ భూషణ్‌ను పిలిచి లక్కీ పక్కన కూర్చోబెడుతుంది. లక్కీ ఆశ్చర్యంగా ఎమోషనల్ అవుతూనే ఉంటాడు.

మదన్‌, రేఖను కలపాలనుకున్న రాజు, ఇందు

తర్వాత రాజు, ఇందు కలిసి రేఖ మళ్లీ ఏదో ప్లాన్‌ చేస్తుందేమోనని అనుమానిస్తారు. ఏ ప్లాన్‌ చేసినా లక్కీకి తల్లి ప్రేమ దొరికిందని అనుకుంటారు. అలాగే మదన్‌ను కూడా రేఖకు దగ్గర చేస్తే బాగుంటుందని అందుకోసం ఇద్దరూ కలిసి మదన్‌ను కలవాలని డిసైడ్‌ అవుతారు రాజు, ఇందు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త