Brahmamudi Serial Today Episode: చలపతి, లక్ష్మీ, వెంకీలను రాజు బర్తుడే సెలబ్రేషన్‌ కోసం ఇంటికి రమ్మని పిలుస్తుంది ఇందు. తర్వాత భూషణ్‌ దగ్గరకు వెళ్లి తనను క్షమించమని.. తప్పు చేశానని కానీ నువ్వంటే ఇష్టమని ప్రాధేయపడుతుంది రేఖ. ఇంటికి వచ్చిన చలపతి, లక్ష్మీలను భ్రమరాంబ తన మాటలతో అవమానిస్తుంది. ఇంకా బ్రహ్మముడి సీరియల్‌ ఇవాళ్టీ ఏపిసోడ్‌లో ఏం జరిగిందో టీవీలో కన్నా ముందు మనం తెలుసుకుందాం.

రాజు బర్తుడే సెలబ్రేషన్‌ కోసం వస్తానన్న చలపతి

ఇందు, చలపతికి ఫోన్‌ చేసి రాజు పుట్టిన రోజు వేడుకలకు ఇంటికి రమ్మని చెప్తుంది. మొదటి వద్దని వారించిన చలపతి, ఇందు కన్వీన్స్‌ చేయడంతో వస్తామని చెప్తాడు. అయితే వెంకీని కూడా తీసుకురమ్మని చెప్తుంది ఇందు. సరే అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు చలపతి.

రేఖను క్షమించిన భూషణ్‌

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

మందు తాగుతున్న భూషణ్‌ దగ్గరకు వెళ్తుంది రేఖ. నాతో మాట్లాడటం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు కానీ నేను ఏదీ కావాలని చేయలేదు అనుకోకుండా జరిగిపోయింది. కానీ మదన్‌ వదిలి వెళ్లిపోయాడు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థం అవుతుంది. కానీ ఆరోజు ఆ పసిబిడ్డను వదిలేసిన రోజు నేను ఇదంతా అనుకోలేదు. మన పెళ్లికి ముందు నేను ఒకతన్ని ఇష్టపడ్డాను. కానీ అతనికి నాకు సెట్‌ అవ్వలేదు. అప్పటికే నా కడుపులో పెరుగుతున్న బిడ్డను ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవ్వరికీ తెలియకుండా పుట్టగానే.. దూరం చేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో పరిస్థితులు వల్ల నాకు నీ సాయం అవసరం ఉండి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం భూషణ్‌. తప్పు నాదే.. పాతికేళ్ల కిందట నేను చేసిన ఒక తప్పు ఈరోజు నా ఫ్యామిలీని నాకు కాకుండా చేస్తుంది. నాకు నువ్వు కావాలి భూషణ్‌ నన్ను క్షమించు భూషణ్‌ అంటూ రేఖ బాధపడుతుంటే..

భూషణ్‌ కోపంగా క్షమించు అంటూ ఇంతలా ప్రాధేయపడాల్సిన అవసరం లేదు రేఖ. అయినా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావని నేను నిన్ను అడిగానా..? కానీ నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు నిజం చెప్పి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ విషయం నాకు కానీ మదన్‌కు కానీ ఎలా తెలుస్తుందోనని భయపడి నువ్వు రాజు ఆడించినట్టు ఉండిపోయేదానివి కాదు అంటూ చెప్పగానే.. అంటే నీకు నా మీద కోపం లేదా అని రేఖ అడిగితే ఉండేది నిజం తెలిసినప్పుడు ఇప్పుడు కాదు అంటూ భూషణ్‌ చెప్పగానే.. రేఖ రిలీఫ్‌ అవుతుంది. ఈ విషయం తెలిస్తే నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావోనని భయంతో ఉండిపోయాను. ఇన్నాళ్లు నా క్యారెక్టర్‌ ను చంపుకున్నాను. ఎదుటి వాళ్లకు భయం పుట్టించే నాకే భయం పుట్టించాడు ఆ రాజు. ఇన్నాళ్లు క్షణం క్షణం నరకం చూపించాడు. మళ్లీ ఈ రేఖ ఏంటో ఈ కుటుంబానికి చూపిస్తాను. మళ్లీ ఈ రేఖ ఏంటో చూపిస్తాను అంటూ కోపంతో రగిలిపోతుంది.

రాజుకు బర్తుడే పార్టీ గురించి చెప్పిన ఇందు

<a title=" ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

హాస్పిటల్‌ లో ఉన్న అమ్మాయి గురించి ఆలోచిస్తుంటాడు రాజు. ఇందు వెళ్లి రేపు నీ పుట్టిన రోజు ఇంట్లోనే సెలబ్రేట్‌ చేస్తున్నాను అని చెప్పగానే.. రాజు ఏయ్‌ నువ్వు నా బర్తుడే సెలబ్రేషన్‌ చేయడం ఏంటి..? అంటూ తిడుతుంటే.. ఇందు అదేంటి బావ నువ్వు నాకోసం ఏదేదో చేస్తున్నావు కానీ నేను నీకోసం బర్తుడే పార్టీ చేయకూడదా..? అంటూ మెలికలు తిరిగిపోతుంటే.. రాజు ఏయ్‌ ఆగు ముందు దూరంగా ఉండి.. బావ అనడం ఆపేయ్‌.. నేను నీకు అద్దె మొగుడినే కానీ నిజం మొగుడిని కాదు అంటాడు. రాజు మాత్రం అయినా రేపు నా బర్తుడే అని ఎవరు చెప్పారు అంటూ అడిగితే.. ఇంకెవరు చెప్తారు.. మా అంకుల్‌ చెప్పారు అంటే.. ఎవరు భూషణ్‌ బాబాయ్‌ చెప్పాడా..? అంటే ఆయనెందకు చెప్తాడు. చలపతి అంకుల్‌ చెప్పారు అంటుంది. వెంటనే రాజు చలపతికి ఫోన్‌ చేసి బర్తుడే గురించి అడగాలనుకుంటే.. మేము రేపు నీ పుట్టిన రోజుకు అక్కడకు వస్తున్నాము కదా మాట్లాడుకుందాం అనగానే.. అదేంటి సర్టిఫికెట్‌లో నా బర్తుడే వేరే ఉంది కదా అని అడిగితే తిథుల ప్రకారం రేపే బర్తుడే అంటూ చెప్తాడు చలపతి.

చలపతి, లక్ష్మీని అవమానించిన భ్రమరాంబ

మరుసటి రోజు అందరికీ స్వీట్లు పంచుతుంది అపర్ణ. ఏంటి విషయం అని భ్రమరాంబ అడిగితే.. ఇవాళ రాజు పుట్టిన రోజు అని చెప్తుంది. అప్పుడే చలపతి, లక్ష్మీ వస్తారు. వాళ్లను భ్రమరాంబ అవమానిస్తుంది. అప్పనంగా ఆస్థికి కొడుకును వారసుడిగా పంపారు అంటూ తిడుతుంటే.. అపర్ణ కల్పించుకుని భ్రమరాంబను తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త