Brahmamudi Serial Today Episode: ఇంట్లోంచి వెళ్లిపోయిన స్వాతి, మదన్‌ అద్దె ఇంటి కోసం వెతుకుతుంటే ఎవ్వరూ ఇల్లు అద్దెకు ఇవ్వరు. మరోవైపు సిరికి స్పృహ రావడంతో రాజు హాస్పిటల్‌కు వెళ్లి సిరిని ఇంటికి తీసుకెళ్తుంటాడు. ఇంకా బ్రహ్ముముడి సీరియల్‌ ఇవాళ్టీ ఏపిసోడ్‌లో ఏం జరిగిందో టీవీలో కన్నా ముందు మనం తెలుసుకుందాం.

లైఫ్‌ ప్లాన్‌ చేసుకున్న స్వాతి, మదన్‌

ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిన మదన్‌, స్వాతి ఎక్కడుండాలో తెలియక రోడ్డు పక్కన కూర్చుని ఉంటారు. ఏదైనా హోటల్‌లో రూం తీసుకుని ఉందామని మదన్‌ చెబితే.. ఉన్న డబ్బులు అయిపోయాక ఏం చేద్దాం అందుకే మనకు జాబ్స్‌ వచ్చే వరకు ఏదైనా చిన్న ఇంట్లో అద్దెకు ఉందాం అని చెప్తుంది. మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలి అని మదన్‌ అడిగితే.. ఏముంది చిన్న హోటల్‌లో రూం తీసుకుందాం పద అంటూ చెప్పగానే.. సరే అంటూ ఇద్దరూ వెళ్లి ఒక హోటల్‌ లో రూం తీసుకుంటారు.

సిరి స్పృహలోకి వచ్చిందని రాజుకు చెప్పిన డాక్టర్‌

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

డాక్టర్‌, రాజుకు ఫోన్‌ చేసి సిరి స్పృహలోకి వచ్చిందని చెప్తాడు. రాజు పరుగెత్తుకుంటూ హాస్పిటల్‌కు వెళ్తాడు. డాక్టర్‌ను కలవగానే.. సిరికి స్పృహ వచ్చిందని తీసుకెళ్లి సిరిని చూపిస్తాడు. సిరి చిన్నపిల్లలతో గొడవ పడుతుంది. ఎందుకలా ప్రవర్తిస్తుది అని రాజు అడిగితే.. తనకు గతం గుర్తుకు రాలేదని ఆరేళ్ల చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది.. మా ట్రీట్‌మెంట్‌ మేము ఇస్తున్నాను ఎప్పుడైనా గతం గుర్తుకు రావొచ్చు ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్లండి అని డాక్టర్‌ చెప్పగానే.. రాజు సరే అంటాడు. సిరిని తీసుకుని వెళ్లిపోతాడు.

రాజు, ఇందుల గురించి వెటకారంగా మాట్లాడిన భ్రమరాంబ

రాజు కోసం రూంలోకి కాఫీ తీసుకెళ్లిన ఇందు షాక్‌ అవుతుంది. రాజు ఎక్కడికి వెళ్లాడు అని కిందకు వెళ్తుంది. కింద అపర్ణతో భ్రమరాంబ రాజు, ఇందుల గురించి వెటకారంగా మాట్లాడుతూ పెద్దవాళ్లు మీరున్నా ఏమీ పట్టించుకోరా అంటూ చెప్పి వెళ్లిపోతుంది. అపర్ణ బాధపడుతుంటే.. ఇందు వచ్చి ఆమె గురించి మీకు తెలియదా..? ఆమె మాటలు అసలు పట్టించుకోకు.. అంతా మంచే జరుగుతుంది. నిజం తెలియాల్సిన రోజు తెలుస్తుంది అంటూ చెప్పి పక్కకు వెళ్లి రాజుకు ఫోన్‌ చేస్తుంది. ఎక్కడున్నావు అని అడగ్గానే.. హాస్పిటల్‌లో ఉన్నానని చెప్తాడు. సిరి గురించి ఇందు అడగ్గానే.. నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతానని కాల్ కట్‌ చేస్తాడు.

మదన్‌ తో త్వరగా పెళ్లి చేసుకుందామన్న స్వాతి

మదన్, స్వాతి అద్దె ఇంటి కోసం వెతుకుతుంటారు. ఒక దగ్గర టూలెట్‌ బోర్డు కనిపిస్తే వెళ్లి డీటెయిల్స్‌ అడుగుతారు. ఎవరెవరు ఉంటారు అని ఓనరు అడిగితే తామిద్దరం ఉంటామని చెప్తారు. మీకు పెళ్లి కానట్టు ఉంది అని అతను అడిగితే మదన్‌ కాలేదని చెప్తాడు. అయితే మీకు రెంట్‌కు ఇవ్వడం కుదరదు అని చెప్తాడు. ఎక్కడికి వెళ్లినా మీలాంటి పెళ్లి కాని వాళ్లకు ఇల్లు ఇవ్వమని చెప్తుంటారు. మదన్‌ కోపంగా అందరినీ తిడుతుంటాడు. స్వాతి ఓదారుస్తుంది. ముందు మనకు పెళ్లి అయితేనే అందరూ మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అని చెప్పగానే.. మదన్‌, స్వాతికి సారీ చెప్తాడు. అప్పుడే ఇందు ఫోన్‌ చేసి ఎక్కడున్నారని అడుగుతుంది.

స్వాతి ఇంటి కోసం వెతుకుతున్నామని చెప్తుంది. ఏ అవసరం వచ్చినా తనకు చెప్పమని ఇందు చెప్తుంటే.. స్వాతి సరే అంటుంది. అప్పుడే భ్రమరాంబ, శేషు వస్తారు. భ్రమరాంబ.. ఇందు చేతిలో ఫోన్‌ లాక్కుని మాట్లాడుతుంది. స్వాతి తన మాట వినడం లేదని శపిస్తుంది. కోపంతో కాల్ కట్‌ చేస్తుంది. ఇందు కోపంగా కన్నకూతురినే శపిస్తావా..? నువ్వు అసలు తల్లివేనా..? అంటూ తిడుతుంటే.. నీ వల్లే నా కూతరు ఇవాళ నాకు దూరం అయింది అంటూ భ్రమరాంబ కోపంగా ఇందును తిట్టి వెళ్లిపోతుంది. శేషు మాత్రం స్వాతి గురించి ఇందుతో చెప్పి ఎమోషనల్‌ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త