Brahmamudi Serial Today Episode: నందు ఎస్సైగా చార్జ్‌ తీసుకున్న మొదటి రోజే మొదటి కేసే రేఖ పంపించిన వ్యక్తిది అది కూడా రాజు తీసుకొచ్చిన సిరి తన మరదలని రాజు సిరి వాళ్ల కుటుంబాన్ని చంపేసి సిరిని పెళ్లి చేసుకున్నాడని ఆస్థి కోసం దుగ్గిరాల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అందుకే ఆ రాజు మీద కేసు పెట్టడానికి వచ్చానని చెప్తాడు. అతడి మాటలకు నందు షాక్ అవుతుంది. మీరు చెప్తున్న వివరాలు కరెక్టేనా..? కరెక్టుగా తెలుసుకుని చెప్తున్నారా..? అని అడిగితే.. నేను చెప్తున్న వివరాలు నూటికి నూరు శాతం కరెక్టేనండి.. ఉండండి మీకు ఫోటో చూపిస్తాను అంటూ తన ఫోన్‌లో ఉన్న రాజు ఫోటో చూపిస్తాడు ఆ వ్యక్తి. ఆ ఫోటో చూసి నందు షాక్‌ అవుతుంది.

తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చి రేఖకు ఫోన్‌ చేసి మీరు చెప్పినట్టే చెప్పాను మేడం అంటే పోలీసులు నమ్మారా..? అని రేఖ అడిగితే.. ఇమ్మీడియెట్‌గా యాక్షన్‌ కూడా తీసుకుంటామన్నారు అని చెప్తాడు ఆ వ్యక్తి. నెక్ట్‌ ఏం చెయాలో చెప్తాను. టచ్‌లో ఉండు అంటూ కాల్‌ కట్‌ చేసి రాజు ఇక నీ కథ ఆరంభం అనుకుంటుంది రేఖ. అదే విషయం వెళ్లి భూషణ్‌కు చెప్తుంది. భూషణ్‌తో రేఖ మాట్లాడుతుంటే.. సిరి ఆడుకుంటూ వెళ్లి డిస్టర్బ్‌ చేస్తుంది. సిరిని భూషణ్‌ తిడతాడు. కోప్పడతాడు. అటు వెళ్లు అంటే నువ్వే వెళ్లు అంటుంది సిరి. భూషణ్‌ కోపంగా సిరిని బయటకు గెంటేస్తాడు. అది అపర్ణ చూస్తుంది. సిరి వెళ్లి కింద పడిపోతుంది. తలకు గాయం కావడంతో స్పృహ కోల్పోతుంది. రాజు, ఇందు వచ్చి సిరిని హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. డాక్టర్‌ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ చేస్తుంటాడు. బయట అందరూ వెయిట్‌ చేస్తుంటారు. రాజు సిరికి ఏం కాదు అంటూ ఇందు చెబితే.. నీ భార్యకు ఏం కాదులే రాజు అంటుంది భ్రమరాంబ.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

అయితే ఏమవుతుంది ఇంకొద్ది రోజులు కోమాలోకి వెళ్తుంది అంటూ రేఖ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో అపర్ణ కోపంగా అందరినీ తిడుతుంది. చేతనైన మంచి చేయండి అంతే సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు అంటూ తిడుతుంది. అందరి మధ్య గొడవ జరుగుతుంది. రేఖ, భూషణ్‌, భ్రమరాంబ, ఐశ్వర్య ఒకవైపు అపర్ణ, రాజు, ఇందు ఒకవైపు కూడి ఒకరినొకరు నిందించుకుంటారు. అప్పుడే నందు ఎస్సైగా డైరెక్టుగా హాస్పిటల్ కు వెళ్తుంది. రాజు మీద కేసు పెట్టిన విషయం చెప్తుంది నందు. నందు మాటలకు రాజు, ఇందు, అపర్ణ షాక్‌ అవుతారు. అప్పుడే కంప్లైంట్‌ ఇచ్చిన ఆదిత్య వస్తాడు. రాజు మోసం చేసి సిరిని పెళ్లి చేసుకున్నాడని ఈ నీచుడు మీ కళ్లు కప్పి పారిపోయేలోపు అరెస్ట్‌ చేసి లోపల వేసేయండి మేడం నా సిరి ఎక్కడ..? అంటూ ఏడుస్తూ.. యాక్టింగ్‌ చేస్తుంటాడు. భూషణ్‌ మెల్లగా రేఖతో ఎవరితను భలే యాక్టింగ్‌ చేస్తున్నాడు అని అడిగితే.. స్టేజీ ఆర్టిస్టు తన నటనతో అందరినీ తన వైపే తిప్పుకుంటాడు.. అని రేఖ చెబితే..

ఒవర్‌ యాక్టింగ్‌ చేయకుండా ఉంటే చాలు అంటాడు భూషణ్‌. ఇంతలో నందు రాజును అరెస్ట్‌ చేసి తీసుకెళ్లబోతుంటే.. ఇందు అడ్డుపడుతుంది. ఒక్కసారి ఆలోచించమని చెప్తుంది. నందు మాత్రం రాజుకు బేడీలు వేసి తీసుకెళ్తుంది. అప్పుడే సిరి బయటకు వస్తుంది. ఆగండి అంటూ పిలవగానే.. అందరూ తిరిగి చూస్తారు. సిరి దగ్గరకు వెళ్లి రాజును ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారు.. అని అడుగుతుంది. అందరూ షాక్‌ అవుతారు. రాజు సిరి నువ్వు అనగానే.. అవును రాజు నాకు గతం గుర్తుకు వచ్చింది అని చెప్తుంది. రాజు, ఇందు రిలాక్స్‌ అవుతారు. రాజును ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారు.. అని అడిగితే.. మీకు యాక్సిడెంట్‌ చేసి మీ నాన్నకు కారణం రాజు కదా అందుకే అరెస్ట్‌ చేస్తున్నారు అంటూ భ్రమరాంబ చెప్పగానే.. సిరి మొత్తం చెప్పేస్తుంది. రాజు తప్పు లేదు రాంగ్‌ రూట్‌లో వెళ్లింది మేము అంటూ చెప్పగానే.. మరి ఆదిత్య ఎవరు..? అని నందు అడిగితే.. ఆదిత్య ఎవరో తనకు తెలియదని చెప్తుంటే.. ఆదిత్య పారిపోతాడు. నందు రాజుకు సారీ చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత సిరి, రాజుకు సారీ చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త