Brahmamudi Serial Today Episode: ఆస్థి కోసం లాయరు దగ్గరకు వెళ్లిన రేఖ, భూషణ్‌కు షాక్‌ ఇస్తాడు లాయరు. రాజ్‌, కావ్య రాసిన వీలునామా ప్రకారం ఆస్థి మీ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ కాదని చెప్తాడు. దీంతో రేఖ, భూషణ్‌ షాక్‌ అవుతారు.

రేఖ: అదేంటి లాయరు గారు ఇందు వేలిముద్ర వేసింది కదా..?

లాయరు: వీలునామా ప్రకారం ఇందు పెళ్లి చేసుకోవాలి. వాళ్లిద్దరూ సంతోషంగా ఉండాలి. వాళ్లే కంపెనీ వ్యవహారాలు చూసుకోవాలి. ఆ తర్వాతే ఆస్థి మీద పూర్తి అధికారం వస్తుంది. అప్పుడే వాళ్లు ఎవరికైనా ఆస్థిని ట్రాన్స్‌ఫర్‌ చేసే హక్కు వస్తుంది

రేఖ: నో అలా జరగడానికి వీల్లేదు..

భూషణ్‌: అయినా వీలునామా రాసిన వాళ్లు చనిపోయారు. ఈ వీలునామాది ఏముంది..? ఆస్థి ట్రాన్స్‌ఫర్‌ చేయించండి

లాయరు: ఏం మాట్లాడుతున్నారండి ఒక్కసారి వీలునామా రాస్తే చేంజ్‌ చేయాలంటే రాయించిన వాళ్లకు మాత్రమే సాధ్యం అవుతుంది.

భూషణ్‌: కానీ వాళ్లు ఇప్పుడు లేరు కదా..?

లాయరు: చెప్పాను కదా ఇందు పెళ్లి చేసుకుని తన భర్తతో కంపెనీ వ్యవహారాలు చూసుకుంటేనే తనకు హక్కు వస్తుంది. అప్పటి వరకు తను సంతకం చేసిన ఈ పేపర్స్‌ చిత్తు కాగితాలు

అని ఆ పేపర్స్‌ చించేస్తాడు లాయరు. రేఖ, భూషణ్‌ షాక్‌ అవుతారు. అపర్ణ, సుభాష్‌ లకు నిజం చెప్తుంది ఇందు.

ఇందు: నాకు పెళ్లి అయ్యేంత వరకు నాకు ఈ ఆస్థి మీద ఎటువంటి అధికారం లేదు. నేను వేసిన వేలి ముద్ర దేనికీ పనికిరాదు

స్వాతి: అంటే ఈ విషయం నీకు ముందే తెలిసి వాళ్లను పిచ్చి వాళ్లను చేశావా..? అక్కా..

ఇందు: అవును లేకపోతే అంత ఈజీగా నేను వేలిముద్ర వేస్తానా..? నాన్నమ్మ నేను మీ గురించి భయపడింది నిజమే వాళ్లు మిమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తారో అని టెన్షన్‌ పడిపోయాను. నాకు ఆస్థికన్నా మీరే ముఖ్యం అనుకున్న కానీ ఎప్పుడైతే మీరు మా అమ్మ జీవితం చదువు అని ఆ పుస్తకం ఇచ్చారో ఆ పుస్తకం చదివాకే నాకు ధైర్యం వచ్చింది. నాకు మీరు ఆస్థి రెండు కావాలి అనిపించింది. ఏ ఒక్కటి వదులుకున్నా నా జీవితానికి అర్థం ఉండదనిపించింది. అందుకే మిమ్మల్ని ఆస్థిని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాను.. అదీకాక మా అమ్మానాన్నలు ముందు చూపుతోనే ఆ వీలునామా రాశారు. మా అమ్మానాన్న కోరుకున్నట్టుగానే ఎలాంటి సిచ్యుయేషన్‌ ఎదురైనా నేను ధైర్యంగా పోరాడతాను. అంతే కానీ ఆస్థిలో చిల్లిగవ్వ కూడా ఆ రేఖ ఆంటీకి దక్కనివ్వును

సుభాష్‌: సూపర్‌ అమ్మా నువ్వు నిజంగా నిన్ను చూస్తుంటే.. మీ అమ్మను చూసినట్టే ఉంది

అపర్ణ: మీ అమ్మానాన్న ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది. పిల్లాపాపలతో అంతా బాగుంది అనుకున్నప్పుడే ఆ యాక్సిడెంట్‌ జరిగి మనం మన ఇంట్లోనే ఒక మూలన పడాల్సి వచ్చింది

ఇందు: నాన్నమ్మ వాళ్లు ఇక ఏమీ చేయలేరు.. మీరు ధైర్యంగా ఉండండి

స్వాతి: అవునక్కా నీకు పెళ్లి అయ్యే వరకు ఆస్థి మీద హక్కు లేదని నీకెలా తెలిసింది.

ఇందు: నిన్న రాత్రి లాయరు సత్యదేవ్‌ గారు నాకు ఫోన్‌ చేశారు.

అని లాయరు చెప్పిందంతా చెప్తుంది ఇందు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. బయట హాల్లో వచ్చి కూర్చున్న రేఖ, భూషణ్‌ లను శేషు వెటకారంగా మాట్లాడుతుంటాడు. ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అంటే ఇదేనేమో అంటాడు.. అప్పుడు రేఖ కోపంగా ఈ ఆస్థిని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ వెళ్లిపోతుంది. మరోవైపు చలపతి, లక్ష్మీని పిలిచి రాజు గురించి ఎమోషనల్‌ అవుతాడు. రాజు దుగ్గిరాల ఇంటి వారసుడు అన్న నిజం ఎప్పటికీ చెప్పకూడదని నిర్ణయించుకుంటారు. ఎందుకని లక్ష్మీ అడిగితే ఆ రేఖ చాలా దుర్మార్గురాలట. రాజును ఏమైనా చేస్తుంది అంటూ చలపతి భయపడతాడు. తర్వాత రేఖ తన కొడుకు మదన్‌ ఇండియాకు పిలిపిస్తుంది. ఎలాగైనా ఇందుకు మదన్‌కు పెళ్లి చేయాలని డిసైడ్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title=" ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!