Brahmamudi Serial Today Episode: రాత్రి రేఖ, భ్రమరాంబ నుంచి బలే ఎస్కేప్‌ అయ్యారని ఇందు, స్వాతి నవ్వుకుంటారు. స్వాతి యాక్టింగ్‌ సూపర్‌ గా చేసిందని ఇందు మెచ్చుకుంటుంది. దొరికిపోయాము అనుకున్నప్పుడే బలే సేవ్‌ చేశావు అంటుంది ఇందు.
స్వాతి: ఆ టైంలో ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు అక్కా అందుకే అలా కొంచెం ఓవర్‌ యాక్టింగ్‌ చేశాను.. కానీ లోపల మాత్రం ఎక్కడ దొరికిపోతామో అని భయంగా ఉన్నది అక్కా
ఇందు: కానీ నీ ఫర్మామెన్స్‌ చూసి మీ అమ్మ కన్నీళ్లు కూడా పెట్టుకుంది అంత బాగా నమ్మించావు..
స్వాతి: అక్కా అది సరే కానీ ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఏమైంది అది చెప్పలేదు ఏంటి…?
ఇందు: ఆల్‌మోస్ట్‌ సెలెక్ట్‌ అయ్యేదాన్ని స్వాతి కానీ చివరలో ఆ వెధవ వచ్చి మొత్తం చెడగొట్టేశాడు
స్వాతి: ఎవరతను అక్కా..?
పబ్బులో రాజుతో రాఖీ గొడవ పెట్టుకున్న విషయం మొత్తం చెప్తుంది ఇందు. స్వాతి: నీకున్న ఒక్క అవకాశం కూడా పోయింది అక్కా… ఇప్పుడెలా
ఇందు: నీ లాప్‌టాప్‌ ఇస్తే అందులో జాబ్స్‌ సర్చ్‌ చేద్దాం..
అని ఇందు చెప్పగానే.. సరే అంటూ స్వాతి లాప్‌టాప్‌ తీసుకొస్తుంది. ఇద్దరూ కలిసి జాబ్‌ సెర్చ్‌ చేస్తుంటారు. ఇక రాజు నిద్రపోతుంటే వాళ్ల నాన్న నిద్ర లేపేతాడు.
రాజు వాళ్ల నాన్న: అరేయ్‌ బైక్‌ ఎక్కడ ఉందిరా
రాజు: కాసేపు పడుకోనివ్వు నాన్న
అప్పుడే అక్కడికి లక్కీ వస్తాడు.
రాజు వాళ్ల నాన్న: అరేయ్‌ బైక్‌ ఏం చేశావు
లక్కీ: అమ్మ బాబోయ్‌ రాంగ్‌ టైంలో వచ్చాను అనుకుంటా…? ఇప్పుడు కనక నా వల్లే బైక్‌ పోలీస్‌ స్టేసన్‌లో ఉందని తెలిస్తే గుమ్మడి కాయను గుమ్మానికి వేలాడదీసినట్టు నన్ను కూడా వేలాడదీస్తాడు ఇక్కడే ఉండటం బెటర్‌
రాజు వాళ్ల నాన్న: నిన్నే అడిగేది బైక్‌ ఏం చేశావు.. తాకట్టు పెట్టేశావా..? లేక అమ్మేశావా..? ఏయ్‌ నిన్నేరా అడిగేది
రాజు: ఆ విషయం నన్ను కాదు అడిగేది నీ చిన్న కొడుకును
రాజు వాళ్ల నాన్న: బైక్‌ నీ దగ్గర ఉంటే వాడికి ఎలా తెలుసురా..?
రాజు: రాత్రి వాడే వాళ్ల ఫ్రెండ్ కు బైక్‌ అవసరం ఉంటే ఇప్పించాడు..
రాజు వాళ్ల నాన్న: ఏరా వెంకీ వీడు చెప్పేది నిజమేనా..? బైక్‌ మీ ఫ్రెండ్‌కు ఇప్పించావా..?
వెంకీ తడబడుతుంటాడు. రాజు ఫోన్‌ చూపిస్తుంటాడు.
రాజు: నాన్న అడుగున్నాడు కదరా చెప్పు.. రాత్రి నీ ఫ్రెండ్‌కు పనుందని బయటకు వెళ్లాలంటే పాపం అన్నయ్య నా ఫ్రెండ్‌కు బైక్‌ అవసరం అని చెప్పి బతిమిలాడి మరీ ఇప్పించావు కదా..
లక్కీ: రాత్రి సెల్పీ తీసుకున్నాడు కదా ఇప్పుడు ఇరికించాడు
వెంకీ అవును నాన్నా అంటూ లోపలికి వెళ్లిపోతాడు. రాజు దుప్పటి మూసుకుని నిద్రపోతాడు. లక్కీ వచ్చి నిద్రలేపి అర్జెంట్‌గా వెళ్లాలి రెడీ అవ్వమని చెప్తాడు. సరే అంటాడు రాజు. ఇక కిచెన్‌లో వంట చేస్తున్న ఇందుకు ఒక కంపెనీ నుంచి ఫోన్‌ వస్తుంది. ఇంటర్వ్యూకు రమ్మని చెప్తారు. ఫోన్‌ మాట్లాడుతుంటే వెనక నుంచి అపర్ణ వచ్చి ఇందు భుజం మీద చేయి వేస్తుంది. ఇందు భయపడుతుంది. తిరిగి చూసి కూల్‌ అవుతుంది.
ఇందు: అమ్మ అపర్ణాదేవి పిలుస్తూ రాలేవా..?
అపర్ణ: ఏమైంది ఇందు ఎందుకు అంత కంగారు పడ్డావు..?

ఇందు: నిన్న ఒక కంపెనీకి జాబ్‌ కోసం అప్లయ్ చేశాను ఇవాళ ఇంటర్వ్యూకు రమ్మని ఫోన్‌ చేశారు..
అపర్ణ: మళ్లీ ఇంటర్వ్యూనా..?
ఇందు: కంగారు పడకు ఈసారి పబ్బులో కాదు ఆఫీసులో
అపర్ణ: ఏమిటోనే.. నీ జీవితం నిమిషానికో గండం క్షణానికో నరకం అన్నట్టు తయారయ్యింది
ఇందు: అబ్బా అపర్ణాదేవి శుభమాని ఇంటర్వ్వూకు వెళ్తుంటే నీ సెంటిమెంట్‌ డైలాగ్స్ ఏంటి..? సెలెక్ట్‌ అవ్వాలని హ్యాపీగా ఆశీర్వదించు..
అపర్ణ: అది నువ్వు అడగాల్సిన పని లేదే..? నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది
ఇందు: సరే తాతయ్యకు టాబ్‌లెట్‌ ఇచ్చావా..?
అపర్ణ: లేదు.. ఇవ్వలేదు
ఇందు: అబ్బా టైంకు టాబ్లెట్‌ ఇవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి.. అన్ని నేనే చూసుకోవాలి.. ఇంట్లో పెద్దవాళ్లు మీరో నేనో అర్థం కావడం లేదు
అంటూ వెళ్లిపోతుంది. తర్వాత ఐశ్వర్య, స్వాతి గొడవ పడతారు. ఐశ్వర్య, స్వాతిని కొట్టబోతుంటే.. ఇందు అడ్డం వెళ్తుంది. ఐశ్వర్య ఇందును తిడుతుంది. అంతా పై నుంచి రేఖ గమనిస్తుంది. అపర్ణ వచ్చి ఐశ్వర్యను తిడుతుంటే రేఖ, భ్రమరాంబ వచ్చి అపర్ణ తిట్టి ఇందును టిఫిన్‌ రెడీ చేయమని పంపిస్తుంది. స్వాతిని కాలేజీకి రెడీ అవ్వమని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.