Brahmamudi Serial Today Episode: అందరూ చనిపోయారని ఆనందంతో కొండ మీద నుంచి కిందకు వస్తుంది రుద్రాణి. రుద్రాణి కిందకు వచ్చేలోపే రాజ్‌, రాహుల్‌ను చంపేస్తాడు. అది చూసిన రుద్రాణి కర్ర తీసుకుని రాజ్‌ను వెనక నుంచి కొడుతుంది. రాజ్ కింద పడిపోతాడు. రుద్రాణి గన్‌ తీసుకుని పిల్లలను చంపేస్తానని ఎయిమ్‌ చేస్తుంది.

రుద్రాణి: నా కొడుకునే చంపేశావు కదరా..? నిన్ను బతకనివ్వను.. నా వారసుణ్నే నువ్వు చంపావు కదా ఇప్పుడు నీ వారసురాలిని నేను చంపేస్తాను

రాజ్‌: కళావతి మన పిల్లలను కాపాడలేకపోయాను. కానీ వాళ్లను కాపాడాలి కళావతి. నీ కడుపులో పెరుగుతున్న కూతురు కోసం నీ ప్రాణాలు అయినా ఇవ్వాలి అనుకున్నావు కదా..? ఇప్పుడు ఆ కూతురే ప్రమాదంలో ఉంది. ఆ బిడ్డను కాపాడాలి. మన ప్రేమ ఎప్పుడు చెరిగిపోదు అన్నావు కదా..? ఇప్పుడు ఆ ప్రేమే ప్రమాదంలో ఉంది లే కళావతి వెళ్లి కాపాడు

అపర్ణ: వద్దు రుద్రాణి పిల్లలను ఏమీ చేయోద్దు

రుద్రాణి: ఒకప్పుడు నేను కూడా నిన్ను ఇలాగే బతిమాలాను.. కానీ నన్ను అవమానించి ఇంట్లోంచి గెంటేశావు కదా..? అప్పుడు జాలి అనిపించలేదా నీకు..

అపర్ణ: రుద్రాణి పిల్లలు.. పసిపిల్లలు రుద్రాణి

రుద్రాణి: వదలను ఎవ్వరినీ వదలను

అపర్ణ: నీ కాళ్లు మొక్కుతాను రుద్రాణి పిల్లలను వదిలేయ్‌

రుద్రాణి గన్‌ ట్రిగర్‌ నొక్కబోతుండగా.. కళావతి లేస్తుంది.

అపర్ణ: అమ్మా కావ్య

కావ్య: ఏవండి నా ప్రాణాలు అడ్డుగా పెట్టైనా పిల్లలను కాపాడతానండి

రుద్రాణి: ఏంటే పిల్లలను కాపాడేస్తావా..? నేను ఉండగా అది జరగనివ్వను.. నా కొడుకును దూరం చేసిన నీ కుటుంబంలో ఒక్కరు కూడా బతకడానికి వీల్లేదు.

కావ్య: నువ్వు నీ కొడుకు ఏమైనా దానధర్మాలు చేశారా..? వందేళ్లు బతకడానికి నా కుటుంబాన్ని చంపాలనుకున్నారు.. వాడికి మా ఆయన చేతిలో సరైన గతే పట్టింది. ఇంక మిగిలింది నువ్వే రోడ్డు పాలు కావాల్సిన నీ జీవితాని తీసుకొచ్చి అందలం మీద కూర్చోబెట్టింది ఈ కుటుంబం.. అడుక్కు తినాల్సిన నీ కొడుకును మహరాజులా చూసుకుందే ఈ కుటుంబం తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీకు బతికే అర్హత లేదు

రుద్రాణి: ఏయ్‌ నువ్వేమైనా మీర్జాపూర్‌ యువరాణి అనుకున్నావా..? కుండలకు రంగులేసుకుని బతికేదానివి.. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా.?

కావ్య: అవునే నేను కుండలు అమ్ముకునేదాన్నే.. కానీ నీలా దిగజారిపోయి బతకలేదు..

రుద్రాణి: మారవే నువ్వు మారవు.. ఈ నీతి మాటలు చెప్పే ఈ ఇంటికి మహారాణివై కూర్చున్నావు.. నువ్వు వచ్చినప్పటి నుంచే నేను అనుకున్నది ఏదీ జరగలేదు.. నువ్వు అడ్డు పడకపోయి ఉంటే ఈ పాటికి నా కొడుకును మహరాజును చేసి ఉండేదాన్ని

కావ్య: కళ్లముందే శవమై పడి ఉన్నాడుగా తీసుకెళ్లు.. తీసుకెళ్లి పాడె మీద పెట్టి నువ్వు అనుకున్నట్టుగానే.. మహారాజులా ఊరేగించు

రుద్రాణి: నా కొడుకు నిజంగానే మహారాజు.. రాచ పీనుగ ఎప్పుడు ఒంటరిగా వెళ్లదు.. తన వెంట పది మందిని తీసుకునే వెళ్తుంది. మీ అందరినీ చంపి వాడికి తోడుగా పంపిస్తాను నువ్వు చూస్తూ ఉండు (అంటూ కావ్య గొంతు పిసుకుతుంది. కావ్య తప్పించుకుని దూరంగా పడుతుంది.) నీ కళ్ల ముందే నీ కూతురును చంపేస్తాను నువ్వు చూస్తూ ఉండు

అని పిల్లలను చంపబోతుంటే కావ్య త్రిశూలం తీసుకుని వచ్చి రుద్రాణిని చంపేస్తుంది. తర్వాత తాను కూడా చనిపోతుంది. కట్‌ చేస్తే అపర్ణ హాస్పిటల్‌ లో ఉంటుంది. సుభాష్ కు ఐసీయూలో ఆపరేషన్ జరుగుతుంటుంది. అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title=" ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!