Brahmamudi Serial Today Episode: కావ్య గోరింటాకు తీసుకుని వచ్చి స్వప్నకు పెడుతూ ఇంకెవరికైనా పెట్టించుకోవాలని ఉంటే రండి అని పిలుస్తుంది. నాకు పెట్టించుకోవాలని ఉంది కానీ అది ఆరే వరకు ఉండాలంటేనే ఇరిటేషన్‌ వస్తుంది అని చెప్తుంది. దీంతో ఇందిరాదేవి కోపంగా రుద్రాణిని తిడుతుంది.

ఇందిర: వెనకటికి నీలాంటిదే పిల్లలు అంటే ఇష్టం కానీ 9 నెలలు మోయాలంటే చాలా కష్టం అందట

రుద్రాణి: నేనంటే ఇంట్లో వాళ్లకు ఎందుకమ్మా అంత ప్రేమ.. నేను నోరు తెరవడం ఆలస్యం అందరూ నా మీద సెటైర్లు వేయడానికి రెడీ ఉంటారు

సుభాష్‌: నీ జాతకం అలాంటిది.. అలాంటి ఘడియల్లో పుట్టావు మరి

అపర్ణ: ధాన్యలక్ష్మీ నీకు గోరింటాకు అంటే ఇష్టం కదా..? వెళ్లి పెట్టించుకోవచ్చు కదా..?

ధాన్యలక్ష్మీ: నేను అడిగింది నాకు ఇస్తే చాలు ఈ గోరింటాకులు, గట్రా నాకు ఏం అక్కర్లేదు

స్వప్న: కావ్య ప్రేమగా అడిగింది. కావాల్సిన వాళ్లు రండి వద్దనుకున్న వాళ్లు సైలెంట్‌గా ఉండండి

ఇందిరాదేవి: ఏంటి నువ్వు పెట్టుకోవా..? గోరింటాకు

అప్పు: నాకు అలవాటు లేదు అమ్మమ్మ

రుద్రాణి: మగరాయుడిలా పెరిగింది కదా తనకు గోరింటాకుతో పనేముంది.

ఇందిర: నువ్వు నోరు మూస్తావా రుద్రాణి..? అప్పు నువ్వు పోలీస్‌ అయితే గోరింటాకు పెట్టుకోకూడదా..? ఎంత కాదనుకున్నా నువ్వు ఒక ఆడపిల్లవు.. గోరింటాకు పెట్టుకుంటే చేతులు చాలా బాగుంటాయి

అని ఇందిరాదేవి చెప్పగానే అప్పు వెళ్లి గోరింటాకు పెట్టించుకుంటుంది. స్వప్న, అప్పుకు కావ్య గోరింటాకు పెడితే ఇందిరాదేవి కావ్యకు పెడుతుంది.

ఇందిరాదేవి: మీ అక్క స్వప్న ఒక పాపను కని తన బాధ్యత నెరవేర్చింది. ఇక మీ ఇద్దరు ఎప్పుడు పిల్లలను కంటారో చెప్పండి.. ఎప్పుడూ పని పని అని కాకుండా కాస్త పిల్లలను కనే పని మీద దృష్టి పెట్టండి. మీ ముగ్గురు ఓకే ఇంటి నుంచి రావడం చాలా మంచిదైంది. మీరు తోడి కోడళ్ల లాగా కాకుండా ఇక్కడ కూడా అక్కా చెల్లెలులాగా చాలా ఆనందంగా ఉన్నారు.

రుద్రాణి: అవును వాళ్లు మాత్రమే సంతోషంగా ఉంటే చాలు. మిగతా వాళ్లు ఏమై పోయినా పర్వాలేదు.. అంతేగా..

ఇందిరాదేవి: ఏంటి రుద్రాణి నువ్వు ఎదుటి వాళ్లను కాసేపు కూడా సంతోషంగా ఉండనివ్వవా..?

అని తిట్టగానే.. రుద్రాణి కోపంగా వెళ్లిపోతుంది. అందరూ ఒక్కోక్కరుగా వెళ్లిపోతుంటే.. ఇందిరాదేవి అలాగే చూస్తుండిపోతుంది. అపర్ణ ఏంటి అత్తయ్యా అలా చూస్తున్నారు అని అడిగితే.. ఈ కుటుంబం ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆశగా ఉంది అంటుంది. అందరూ ఎప్పటికీ ఇలాగే ఉంటారులే అత్తయ్యా అంటుంది అపర్ణ. రూంలో వర్క్‌ చేసుకుంటూ ఉన్న రాజ్‌, కావ్య రాగానే వాటర్‌ బాటిల్‌ ఇవ్వమని అడుగుతాడు. చేతులకు గోరింటాకు ఉండటంతో కావ్య ఇబ్బంది పడుతుంది. రాజ్‌ వెళ్లి వాటర్‌ తీసుకుంటూ కావ్యను చూస్తాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి రొమాంటిక్‌ సీన్‌ నడుస్తుంది. మరోవైపు కళ్యాన్‌ రూంలోకి వెళ్లిన అప్పు రూం మొత్తం పరిశీలిస్తుంది.

కళ్యాణ్‌: ఏంటి పొట్టి మర్డర్‌ జరిగిన ప్లేస్‌లో ఇన్వెస్టిగేషన్‌ చేసే పోలీస్‌ ఆఫీసర్‌ లా అలా చూస్తున్నావు.

అప్పు: చీచీ అదేం పోలికరా బై అలా అంటావు. నువ్వు పుట్టి పెరిగింది ఇక్కడే కదా..? నీ మెమెరీస్‌ అన్ని ఇక్కడే ఉంటాయి. అవన్నీ చూస్తూ ప్రతి సీన్‌ను రిక్రియేట్‌ చేసుకుంటున్నాను.

కళ్యా్‌ణ్‌: పోలీస్‌వు అనిపించుకున్నావు పొట్టి..

అప్పు: నువ్వు ఇక్కడ గడిపిన క్షణాలన్నీ నీకు గుర్తు రావడం లేదా..?

కళ్యాణ్‌: ఎందుకు గుర్తుకు రావు. ఆ రోజుల వేరు.. మనకు పెళ్లి అయ్యాక ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని బయటకు వెళ్లిపోయాం. కానీ మనం ఈ రూమ్‌లోనే ఉండేవాళ్లం. ఇక్కడ ప్రతి క్షణాన్ని ఆస్వాదించే వాళ్లం. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.

అప్పు: ఒక్కసారి ఇంట్లో వాళ్లు చెప్పింది ఆలోచించు కూచి. నావల్ల నువ్వు ఇవన్నీ దూరం అవ్వడం నాకు మంచిగా అనిపించడం లేదు. వాళ్లు అడిగినట్టుగా మనం ఇక్కడే ఉండిపోదామా..?

కళ్యాణ్‌: లేదు పొట్టి అమ్మ మనసు నాకు బాగా తెలుసు ఈమధ్య అమ్మ చాలా మారిపోయింది. ఇంట్లో వాళ్లు మమ్మల్ని మోసం చేస్తున్నారని అంటుంది. ఆస్థి కోసమే రోజు గొడవలు జరగుతున్నాయి. ఆస్థి గురించి అడగాలని నన్ను చాలాసార్లు అడిగింది కూడా.. అందరం కలిసి ఉండాలనేదే తాతయ్య, నాన్నమ్మ ఆశ వాళ్లను బాధపెట్టే పని నేనే ఏదీ చేయను.

అంటూ తాము అక్కడే ఉంటే ఇంకా ప్యూచర్‌ లో జరిగే గొడవల గురించి చెప్తాడు కళ్యాణ్‌. దీంతో అప్పు సరే అయితే నీ ఇష్టం అంటుంది. రుద్రాణి, అనామికకు ఫోన్‌ చేసి నిన్ను నమ్ముకుంటే నా చేతికి చిప్ప ఇచ్చేలా ఉన్నావు. వాన కోసం ఎదురుచూసే రైతులాగా ఆస్థి కోసం నేను ఎదురుచూస్తున్నాను. నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. నేను అది చూడలేకపోతున్నాను అంటుంది. కాస్త ఓపిక పట్టండి ఆంటీ నేను ఉన్నాను కదా అని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!