Brahmamudi Serial Today Episode: రాజ్‌, కావ్యల దగ్గర ఉన్న రెండు కోట్లు కొట్టేయడానికి కిరాయి రౌడీని తీసుకుని వెళ్తాడు రాహుల్‌. అనుకున్నట్టుగానే.. రాజ్‌ వాళ్లు కారులో వెళ్తుంటే రౌడీ ఆ కారును ఫాలో అవుతుంటాడు. కారులో వెళ్తున్న రాజ్‌కు వెక్కిళ్లు వస్తాయి. కారులో నీళ్లు లేకపోవడంతో కావ్య, రాజ్‌కు కిస్‌ ఇస్తుంది. ఆ షాక్‌లో రాజ్‌కు వెక్కిళ్లు ఆగిపోయాయని కావ్య అంటుంది. మళ్లీ వెక్కిళ్లు వస్తాయి.

రాజ్‌: ఇదేమైనా సినిమా అనుకున్నావా..? ముద్దు పెట్టగానే వెక్కిళ్లు ఆగిపోవడానికి..

కారు ఆపి వాటర్‌ బాటిల్‌ కోసం షాపులోకి వెళ్తాడు. రౌడీ వెనక నుంచి వచ్చి డబ్బు కొట్టేస్తాడు. కావ్య గట్టిగా అరుస్తుంది. రాజ్‌ పరుగెత్తుకు వస్తాడు. కావ్య, రాజ్‌ కలిసి రౌడీని ఫాలో అవుతారు. ఆ రౌడీ బ్యాగ్‌ రాహుల్‌ కు ఇచ్చి పారిపోతాడు. కొద్దిదూరం వెళ్లాక రౌడీని పట్టుకుంటారు రాజ్‌, కావ్య.

కావ్య: ఏవండి ఆగండి.. ముందు మనీ ఉన్న బ్యాగ్ ఎక్కడో అడగండి. ఏవండి ఒక్క నిమిషం ఆగండి.

రాజ్‌: ఎందుకు ఏమైంది

కావ్య: ఇందాక మీరే అన్నారుగా మన దగ్గర డబ్బు ఉన్న విషయం మనకు తప్పా వేరే ఎవరికీ తెలియదని.. మరి మనం ఇలా డబ్బు తీసుకొస్తున్న విషయం వీడికెలా తెలుసు..? ఇది వీడి పని కాదండి వీడి వెనకే ఎవరో ఉండి చేయించారు. వాడికి మన గురించి బాగా తెలిసి ఉండాలి.

రాజ్‌: ( కొడుతూ) రేయ్‌ నీచేత ఈ పని ఎవరు చేయించారో చెప్పు నిన్ను ఇక్కడే వదిలేస్తా.. లేకపోతే నిన్ను కూడా వాడితో పాటు జైలుకు పంపిస్తా. చెప్పరా..? రేయ ఆలోచించుకోవడానకి నీ దగ్గర టైం లేదు.. చెప్తావా..? పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లమంటావా..?

రౌడీ: చెప్తాను సార్‌ చెప్తాను

కావ్య: ఆ అనామిక చేయించిందా..?

రౌడీ: కాదు మేడం మీ ఇంట్లో మనిషే రాహుల్‌ చేయించాడు. 20లక్షలు ఇస్తానంటే ఈ పని చేశాను సార్‌. చెప్తే వదిలేస్తానన్నారు కదా సార్‌ ఫ్లీజ్‌ వదిలేయండి.

రాజ్‌: పోరా..

కావ్య: ఏవండి ఎందుకు వాణ్ని వదిలేశారు

రాజ్‌: రాహుల్‌ ఈ పని చేశాడని తెలిశాక ఇంక వీడితో ఏం పని ఉంది పద.

కావ్య: మీరు వెళ్లండి నాకు ఒక చిన్న పని ఉంది. రాహుల్‌ ఈ పని చేశాడని తెలియగానే నాకు విషయం మొత్తం అర్థం అయింది. మీరు ఇంటికి వెళ్లి రాహుల్ ను నిలదీసేలోపు నేను చేయాల్సిన పని పూర్తి చేసుకుని వస్తాను.

అంటూ కావ్య వెళ్లిపోతుంది. రాజ్‌ ఇంటికి వస్తాడు. రాజ్‌ ఇంటికి వెళ్లి కోపంగా రాహుల్‌ను కొడతాడు. అందరూ వచ్చి ఏమైందని అడుగుతారు. నా దగ్గర ఉన్న రెండు కోట్లు కొట్టేశాడు అని చెప్తాడు రాజ్‌. అందరూ షాక్‌ అవుతారు.

రుద్రాణి: రాజ్‌ చంపేస్తావా వాణ్ని.. నా కొడుకు నీ దగ్గర రెండు కోట్లు కొట్టేశాడా..? ఇంతకు ముందే తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని చెప్పాడు. ఇప్పుడేమో రెండు కోట్లు ఉన్నాయి నా కొడుకు కొట్టేశాడు అంటున్నాడు. ఇది నమ్మే విషయమేనా రాజ్‌.. నాకు అప్పు ఇచ్చిన వాళ్లు నన్ను చంపేస్తామన్నా.. చిల్లిగవ్వ లేదని చెప్పారు. ఒకవేళ వాళ్లు నన్ను చంపేసినా పట్టించుకునేవారు కాదుకదా..

ఇంతలో కావ్య ఆ ఇద్దరు వ్యక్తులను తీసుకుని వస్తుంది.

కావ్య: వీళ్లేనా రుద్రాణి గారు మీకు అప్పు ఇచ్చింది.

రుద్రాణి: సార్‌ మీకు పేమెంట్‌ రేపు ఇస్తాను అన్నాను కదా..

కావ్య: అక్కర్లేదు నేను ఇచ్చాను వాళ్లకు పేమెంట్‌ 500.

అపర్ణ: ఐదు వందలా..?

కావ్య: అవును వాళ్ల డైలీ పేమెంట్‌ ఐదు వందలే.. వాళ్లు అప్పు ఇచ్చేవాళ్లు కాదు. సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్టులు..

అంటూ కావ్య నిజం చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. ఆ వ్యక్తులు కూడా నిజమే అని చెప్పి దీంతో మాకేం సంబంధం లేదని మేడం చెప్పినట్టు నటించామని వెళ్లిపోతారు. అందరూ రుద్రాణిని తిడుతుంటే రుద్రాణి ఇదంతా నేను కావాలనే చేశాను. రాజ్‌, కావ్యల నిజస్వరూపం బయటపెట్టేందుకే ఇలా చేశానని చెప్తుంది. ఇంట్లో వాళ్లకు చిల్లిగవ్వ ఇవ్వరు వీళ్లు మాత్రం కోట్లతో ఎంజాయ్‌ చేస్తున్నారు అని నిలదీస్తుంది. దీంతో నేను మూడు నెలల్లో అంతా చెప్తాను అని చెప్పాను. మూడు నెలల తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని రాజ్‌, కావ్య వెళ్లిపోతారు. ఇంతటితో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!