Brahmamudi Serial Today Episode: వర్క్‌ చేసుకుంటున్న రేఖ దగ్గరకు వెళ్లిన లక్కీ వాళ్ల అమ్మ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. లక్కీ మాటలకు రేఖ కోపంతో రగిలిపోతూ.. మౌనంగా ఉంటుంది. మరోవైపు రాజు చేత ఇందు మెడలో శాస్ర్తోక్తంగా తాళి కట్టించేందుకు అపర్ణ, సుభాష్‌ ప్లాన్‌ చేస్తారు. అందుకోసం ఇందుతో కలిసి ఒక నాటకం మొదలుపెడతారు. వాళ్ల నాటకం ఎలా సాగింది అనేది ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్‌ ఏపిసోడ్‌లో తెలుసుకుందాం.

వెంకీతో బైక్‌ మీద వెళ్లిన నందు

<a title=" ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

వెంకీకి నందు ఫోన్‌ చేస్తుంది వెంకీ అసలు లిఫ్ట్ చేయడు. మనసులో సారీ నందు నేను నీ కాల్‌ లిఫ్ట్ చేయలేను అనుకుంటాడు. నందు అలాగే కాల్‌ చేస్తూనే ఉంటుంది. వెంకీ లిఫ్ట్‌ చేయకుండా బయటకు వెళ్లి బైక్‌ స్టార్ట్‌ చేసి వెళ్లబోతుంటే.. నందు ఎదురుగా ఉంటుంది. నందును చూసి వెంకీ షాక్‌ అవుతాడు. నందు కోపంగా దగ్గరకు వచ్చి ఎందుకు నా కాల్‌ లిఫ్ట్‌ చేయడం లేదు.... ఎందుకు నన్ను అవైడ్‌ చేస్తున్నావు.. ఎందుకు కారణం చెప్పు.. నేను ఏదైనా తప్పు చేశానా..? అంటూ వెంకీని ప్రశ్నిస్తుంది. అయితే ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు.. బాగుండదు.. అయినా నేను నిన్ను అవైడ్‌ చేయలేదు.. బిజీగా ఉన్నాను అందుకే టైం ఇవ్వలేకపోతున్నాను.. నా కోచింగ్‌కు టైం అవుతుంది. పక్కకు జరిగితే నేను వెళ్తాను అంటాడు వెంకీ. అయితే సరే నేను వస్తాను పదా అంటూ నందు బైక్‌ ఎక్కుతుంది. ఎక్కడికి వెళ్తావు అంటూ వెంకీ అడిగితే.. మాట్లాడుకుందాం పదా అంటుంది నందు. సరే అంటూ వెంకీ వెళ్తాడు.

తన తల్లి గురించి రేఖను అడిగిన లక్కీ

రేఖ దగ్గరకు వెళ్లిన లక్కీ తన తల్లి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. రేఖ మౌనంగా ఉంటుంది. లక్కీ ఎమోషనల్‌ అవుతూ చిన్నప్పటి నుంచి తాను తల్లి కోసం ఎంత బాధపడ్డడో చెప్తుంటాడు. రేఖకు కోపం వస్తుంది కానీ బయటకు సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడే రాజు వచ్చి నువ్వు రిక్వెస్ట్ చేయడం ఏంట్రా రేఖ పిన్ని కచ్చితంగా మీ అమ్మను వెతికి పెడుతుంది. నువ్వేం టెన్షన్‌ పడకు.. కన్నకొడుకు దూరం అయితే ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో రేఖ పిన్నికి తెలుసు అంటాడు. రేఖ కోపంగా రాజు ఏం మాట్లాడుతున్నావు అంటే. అదే పిన్ని నీకు ఒక కొడుకు ఉన్నాడు కదా..? వాడు దూరమైతే నీకు ఎలాంటి బాధ ఉంటుందో నీకు అర్థం అవుతుంది కదా..? అని చెప్తున్నాను అంటాడు. రేఖ పిన్ని ఒక్కసారి మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చుకుంటుందని ఇక మనం వెళ్దాం పద అంటూ లక్కీని తీసుకుని వెళ్లిపోతాడు.

ఇందు మెడలో తాళి వేయమన్న అపర్ణ – షాక్‌లో రాజు

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

ఇందు మెడలో రాజు చేత శాస్త్రోక్తంగా తాళి కట్టించాలని అపర్ణ, సుభాష్‌, ఇందు అనుకుంటారు. అందుకోసం నాటకం ఆడాలని డిసైడ్‌ అవుతారు. రాజు రావడం చూసి ఇందు చెబితే అపర్ణ నాటకం మొదలు పెడుతుంది. రాజుకు వినిబడేలా గట్టిగా మీరు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను నాన్నమ్మ అంటుంది ఇందు. ఆ మాటలు విన్న రాజు దగ్గరకు వెళ్లి పెద్దవాళ్లు ఏం చెప్పినా వినాలని ఇందుకు చెప్తాడు రాజు. అయితే అసలు మ్యాటర్‌ తెలియకుండా మాట్లాడొద్దని తర్వాత నువ్వే చిక్కుల్లో పడతావని ఇందు చెప్పినా వినకుండా.. ఎన్ని సమస్యలు వచ్చినా మనమే చూసుకోవాలి కానీ పెద్దవాళ్లను బాధపెట్టకూడదని రాజు చెప్పి ఏంటో చెప్పండి అమ్మమ్మ నేను చేస్తాను అంటాడు. తప్పకుండా చేస్తావా బాబు అని అపర్ణ మాట తీసుకుంటుంది. రాజు తప్పకుండా చేస్తానని మాట ఇస్తాడు. వెంటనే అపర్ణ ఇందు మెడలో నువ్వు తాళి కట్టినప్పుడు మేము ఎవ్వరం చూడలేదు.. పైగా ఇప్పటి వరకు ఇందు తాళిబొట్టుకు నల్లపూసలు వేయలేదు.. కాబట్టి పంతులుగారిని పిలిపించి అమ్మ వారి సాక్షిగా నల్లపూసలు ఎక్కించిన తాళిని నీ చేతులలో మళ్లీ ఇందు మెడలో వేయాలి అని చెప్తుంది. రాజు షాక్‌ అవుతాడు. ఇంకా ఇక్కడే ఉంటే డైరెక్టుగా తాళి కట్టించేలా ఉన్నారు అని మనసులో అనుకుని తమ దూరపు బంధువులు ఎవరో చనిపోయారని మైల ఉందని ఇప్పుడు అవన్నీ వద్దని చెప్పి తప్పించుకుని పోతాడు రాజు. నీ చేత ఇందు మెడలో తాళి వేయించే తీరుతానని అపర్ణ అనుకుంటుంది.

నందుకు వార్నింగ్‌ ఇచ్చిన వెంకీ – ఐశ్వర్య కోసం ఇంటికి వచ్చి అప్పులోడు

రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన నందుకు వెంకీ వార్నింగ్ ఇస్తాడు. నందు వల్ల తన టైం వేస్ట్‌ అవుతుందని తనన ప్రశాంతంగా ఉండనీయమని.. నీ టైం కూడా వేస్టు చేసుకోకని వెంకీ చెప్తాడు. నందు వల్లే తన కోచింగ్ డిస్టర్బ్‌ అవుతుందని ఇక తనకు ఫోన్‌ కానీ మెసేజ్‌ కానీ చేయోద్దని చెప్పి వెంకీ వెళ్లిపోతాడు. నందు ఏడుస్తూ ఉండిపోతుంది. మరోవైపు ఐశ్వర్య తన దగ్గర మూడు లక్షలు అప్పు చేసిందని ఒక వ్యక్తి దుగ్గిరాల ఇంట్లోకి వచ్చి హల్ చల్‌ చేస్తుంటాడు. ఐశ్వర్య వచ్చి ఆ వ్యక్తిని తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త