Brahmamudi Serial Today Episode: ఎలాగైనా డిగ్రీ పాస్‌ అవ్వాలని తన ఫ్రెండ్స్‌కు కాల్స్‌ చేస్తుంది ఐశ్వర్య. అందరూ ఐషును ఎద్దేవా చేస్తూ.. నువ్వు ఎంత కష్టపడి చదివినా ఒక్క సబ్జెక్ట్‌ కూడా పాస్‌ కాలేవని చెప్తారు.. ఫుల్లు టెన్షన్‌లో ఉన్న ఐశ్వర్యకు పుల్లుగా మందు తాగిస్తాడు లక్కీ. నందు పోలీస్‌ ట్రైనింగ్‌కు సెలెక్ట్‌ అవుతుంది. ఇంకా బ్రహ్మముడి సీరియల్‌ ఇవాళ్టీ ఏపిసోడ్‌లో ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందు తెలివిని మెచ్చుకున్న రాజు

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

అసలు ఐశ్వర్య డిగ్రీ పాస్‌ అవుతుందా..? తనకు డౌటేనని రాజు అడిగితే.. తప్పకుండా పాస్‌ అవుతుందని ఇందు చెప్తుంది. ఐషుకు తన మీద పీకల దాకా కోపం ఉందని తన ఎదుగుదల చూసి ఐషు తట్టుకోలేకపోతుందని అందుకే తప్పకుండా డిగ్రీ పాస్‌ అయి తనతో సమానంగా సొంత కంపెనీలో బాస్‌ హోదాలో కూర్చోవాలని కసితో ఉందని ఇందు చెప్తుంది. అయితే ఐషు పాస్‌ అయితే నిజంగానే కంపెనీ పెట్టిస్తావా..? అని రాజు అడిగితే.. తప్పకుండా పెట్టిస్తానని మా అక్క బాగుండటం కోసం ఏమైనా చేస్తానని చెప్తుంది. కంపెనీ పెట్టించాక ఐషు ఇలాగే బిహేవ్‌ చేస్తే అని రాజు అనుమానిస్తే.. ఎంత చెడ్డ వ్యక్తి అయినా కష్టపడి బతకడం అలవాటు చేసుకున్నాక చెడు వ్యవసనాలు మర్చిపోతారని ఐషు కూడా కష్టపడి చదివి డిగ్రీ పాస్‌ అయితే.. ఆ విలువ ఐషు గుర్తిస్తుందని చెప్తుంది. దీంతో రాజు నువ్వు నిజంగా గ్రేట్‌ ఇందు.. అసలు నాకు కూడా అర్థం కాకుండా ఐషును బలే ట్రాప్‌లో వేశావు అంటాడు రాజు.

ఐషుకు ఫుల్లుగా మందు తాగించిన లక్కీ

ఐశ్వర్య ఎలాగైనా తాను కష్టపడి చదివి డిగ్రీ కంప్లీట్‌ చేయాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం తన ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఫోన్‌ చేసి డిగ్రీ పాస్‌ కావాలంటే ఏం చేయాలో చెప్పమని అడుగుతుంది. అందరూ ఐషును చదవలేవని ఎంత కష్టపడినా ఒక్క సబ్జెక్టు కూడా పాస్‌ కాలేవని డిస్సపాయింట్‌ చేస్తుంటారు. ఒక్క ఫ్రెండ్‌ మాత్రం డబ్బులు ఉంటే పాస్‌ అయిపోవచ్చని.. ఒక్కో సబ్జెక్ట్‌ ఒక్కో రేటు ఉంటుందని చెప్పగానే.. ఐశ్వర్య కోపంగా తిడుతూ.. నేను కష్టపడి చదివి నిజాయితీ పాస్‌ కావాలని చెప్తుంది. అయితే నువ్వు జన్మలో పాస్‌ కాలేవని ఆ ఫ్రెండ్‌ కాల్‌ కట్‌ చేస్తుంది. ఐషు కోపంగా ఒక్కరు కూడా నన్ను నమ్మడం లేదేంటి..? అని బాధపడతుంటే.. నేను నమ్ముతున్నాను ఐషు అనుకుంటూ వస్తాడు. నిన్ను డిగ్రీ పాస్‌ చేయించే బాధ్యత నాది అంటాడు. అందుకు ఐషు కోపంగా రేయ్‌ ఏం మాట్లాడుతున్నావు.. అసలు నువ్వే చదివావురా..? అంటూ అడగ్గానే.. లక్కీ ఆరోక్లాస్‌ చదివానని చెప్తాడు. ఐషు కోపంగా ఆరు చదివిన నువ్వు నన్ను డిగ్రీ పాస్‌ చేయిస్తావా..? అంటూ తిడుతుంటే.. లక్కీ ఆగు ఐషు చూడు నేను చెప్పుది పూర్తిగా విను ఇప్పుడే వస్తాను.. అంటూ ఇంట్లోకి వెళ్లి మందు తీసుకొచ్చి లక్కీకి ఫుల్లుగా మందు తాగిస్తాడు. తాగిన మైకంలో ఐషు, లక్కీని ఇందు అనుకుని కొడుతుంది. లక్కీ అక్కడి నుంచి పారిపోతాడు.

పోలీస్‌ ట్రైనింగ్‌కు సెలెక్ట్‌ అయిన నందు – ఏదో ఒకటి చేయాలనుకున్న రేఖ

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

నందు పోలీస్‌ ట్రైనింగ్‌కు సెలెక్ట్‌ అయినట్టు కాల్‌ లెటర్‌ వస్తుంది. అది చూసి నందు హ్యాపీగా అందరికీ చెప్తుంది. ఇందు సంతోషంగా స్వీట్స్‌ తీసుకొచ్చి అందరికీ పంచుతుంది. అప్పుడే భ్రమరాంబ, రేఖ, సుభాష్‌ వస్తారు. శేషు ఏంటి విషయం అని అడిగితే నందు పోలీస్‌ ట్రైనింగ్‌కు సెలెక్ట్‌ అయిందని చెప్తారు. ఆ మాటలకు భ్రమరాంబ భయంతో వణికిపోతుంది. అపర్ణ మాత్రం నందును పొగుడుతూ ఇన్‌డైరెక్ట్‌ గా ఐశ్వర్యను తిడుతుంది. రేఖ మాత్రం మనసులో రగిలిపోతూ.. వీళ్ల ఆనందం చూడలేకపోతున్నాను ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది.

వెంకీని చివరి సారి చూస్తానన్న నందు

వెంకీ రూంలో కూర్చుని బాధపడుతుంటే.. లక్ష్మీ వెళ్లి ఓదారుస్తుంది. అప్పుడే నందు వెళ్తుంది. నందును చూసిన వెంకీ ఎందుకొచ్చావని అడుగుతాడు. నందు బాధపడుతుంది. తాను పోలీస్‌ ట్రైనింగ్‌కు సెలెక్ట్‌ అయ్యానని చెప్తుంది. అప్పుడే చలపతి వస్తాడు. ఎప్పుడొచ్చావని నందును అడిగితే.. ఇప్పుడే వచ్చాను అంకుల్‌ అంటూ తాను పోలీస్‌ ట్రైనింగ్‌కు సెలెక్ట్‌ అయినట్టు రేపే వరంగల్‌ లో ట్రైనింగ్‌కు వెళ్తున్నట్టు ఆఖరి సారి వెంకీని చూడటానికి వచ్చానని చెప్తుంది. అ మాటలకు చలపతి షాక్‌ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త