Brahmamudi Serial Today Episode: ఇంటికి వచ్చిన రాజు, ఇందులను చూసిన చలపతి, లక్ష్మీ, వెంకట్‌ షాక్‌ అవుతారు. చలపతి షాక్ లోంచి బయటకు రావడానికి వెంకట్‌ గట్టిగా నాన్న అని పిలుస్తాడు. ఆ అరుపునకు చలపతి షాక్‌లోంచి బయటకు వస్తాడు.

చలపతి: ఏమేయ్‌ రాత్రి వీడికోసం ఒక అమ్మాయి వచ్చింది ఇప్పుడు పెద్దొడు ఇంకొకమ్మాయిని తీసుకొచ్చాడు అసలేం జరుగుతుందే మన ఇంట్లో

లక్ష్మీ: నోరు మూయండి ఈగలు దూరతాయి

చలపతి: అరేయ్‌ ఇన్నాళ్లు నువ్వు ఆ లక్కీ గాడిలా వెధవ అనుకున్నాను. కానీ నీక్కూడా అమ్మాయి ఫ్రెండ్‌ ఉందా.. ఏమ్మా బయట మంచి కుర్రోళ్లు, చదువుకున్న కుర్రోళ్లు చాలా మంది ఉన్నారు కదమ్మా..?

రాజు: నాన్న

చలపతి: ఎందుకమ్మా ఇలాంటి వెధవను ప్రేమించి జీవితాన్ని నాశనం చేసుకున్నావు

రాజు: నాన్న కొంచెం ఓవర్‌ అయింది. తను నా గర్ల్‌ ఫ్రెండ్‌ కాదు

చలపతి: మరి ఎవరు… ఈ అమ్మాయి..?

రాజు: చెప్తాను ఉండు.. ఈవిడ మా అమ్మ

ఇందు: ఓహో నువ్వు రెండు ముద్దులు తక్కువ తింటే బాధపడేది ఈవిడేనా హలో ఆంటీ

రాజు: (మనసులో) ఇదేంటి ఇందాక దీని మాటలు విని రాత్రి చెప్పిందంతా మర్చిపోయింది అనుకున్నాను అంతా గుర్తు ఉన్నట్టుంది.

అనుకుంటూ అందరినీ పరిచయం చేస్తాడు రాజు.

చలపతి: అరేయ్‌ రాజు ఏంట్రా ఇంటి గుట్టు మొత్తం చెప్పేశావా..? అయినా అందరి గురించి మంచి చెప్పి నా గురించి బ్యాడ్ గా చెప్తావా..? అసలు ఈ అమ్మాయి ఎవరు..?

రాజు: ఈ రోజు పెళ్లి..

చలపతి: అయితే ఈరోజు పెళ్లి చేసుకుని వచ్చారా..?

రాజు: నాన్న నేను చెప్పేది పూర్తిగా విను.. ఈ అమ్మాయి ఇందు ఈవెంట్‌ మేనేజర్‌. ఈరోజు మీ 25వ పెళ్లి రోజును గ్రాండ్‌గా చేద్దామని వచ్చింది

చలపతి: ఫంక్షన్‌ చేయడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడివి

రాజు: ఈవిడ జీరో బడ్జెట్‌ లో మొత్తం ఫంక్షన్‌ గ్రాండ్‌గా ఈవెంట్‌ చేస్తుందట

చలపతి: రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేస్తావమ్మా

ఇందు: అంటే మనకి ఉన్నంతలో ఆ కొబ్బరికొమ్మలతో ఒక చిన్న పందిరి వేసి అంగరంగవైభవంగా మీ 25 సంవత్సరాల పెళ్లి సంభరాలు అంబరం అంటేలా చేస్తాను. మీరు నన్ను నమ్మండి.. ఆంటీ అంకుల్‌ మీరు లోపలికి వెళ్లి రెడీ అవ్వండి.. మీరు పెళ్లి రోజు వేసుకున్న బట్టలు వేసుకోండి

అంటూ ఇందు చెప్పగానే.. సరే అంటూ లోపలికి వెళ్తారు లక్ష్మీ, చలపతి. ఇక అప్పుడే నిద్ర లేచిన డల్లాస్‌, నిద్రపోతున్న లక్కీ మీద నీళ్లు పోసి నిద్ర లేపి రాత్రి తనను ఎందుకు కొట్టావని అడుగుతాడు. దీంతో లక్కీ చీర కట్టుకున్న నన్ను మీరు రేప్‌ చేయబోయారు అంటూ చెప్పగానే.. డల్లాస్ భయంగా ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు నా పరువు పోతుంది ఇక నేను వెళ్లిపోతాను అంటూ లగేజీ తీసుకుని వెళ్లిపోతాడు. లక్కీ వెంటనే రాజుకు ఫోన్‌ చేస్తే రాజు తాను ఇందుతో కలిసి వాళ్ల ఇంటికి వెళ్లామని రెండు కిలోల చికెన్‌ తీసుకుని ఇంటికి రమ్మని చెప్తాడు. లక్కీ సరే అంటాడు. వెంకట్‌ కోసం చలపతి ఇంటికి వెళ్తుంది నందు. అక్కడ ఇందును చూసి ఆశ్చర్యపోతుంది.

నందు: అక్కా నువ్వేంటి ఇక్కడున్నావు…? ఇక్కడేం చేస్తున్నావు..?

రాజు: ఈమె ఈవెంట్‌ ప్లానర్‌ లేండి

ఇందు: ఏయ్‌ నువ్వేంటి ఇలా వచ్చావు..?

నందు: వెంకట్‌ నా ఫ్రెండ్‌ కలుద్దామని వచ్చాను.

వెంకట్‌ కొబ్బరి చెట్టు మీద కూర్చుని భయంగా చూస్తూ ఉంటాడు.

ఇందు: చెట్టు ఎక్కడం వచ్చి దిగడం రాదని తెలిస్తే ముందే చెప్పాలి కదా

నందు: వాడికి మొహమాటం అక్కా ఏదీ బయటకు చెప్పుకోలేడు. ఎంత బాధ ఉన్నా మనసులోనే బాధపడతాడు

ఇందు: ఇదిగో ఇలా మొహమాట పడితే ప్రాణాలు పోతాయి

వెంకట్‌: ఇక్కడ నిజంగానే ప్రాణాలు పోయేలా ఉన్నాయి.. ఒరేయ్‌ అన్నయ్య నీకు దండం పెడతారా..? నన్ను కిందకు దించేయ్‌

అనగానే రాజు ఏం చేయాలో ఆలోచిస్తుంటే.. నందు వెళ్లి నిచ్చెన తీసుకొస్తుంది. వెంకట్‌ కిందకు వస్తాడు. అందరూ కలిసి ఫంక్షన్‌ ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title=" ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!