Brahmamudi Serial Today Episode: రాజు, రేఖకు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయడంతో స్వాతి పక్కకు వెళ్లి బంటికి ఫోన్‌ చేస్తుంది. ఇందు ఎక్కడుందని అడుగుతుంది. మిమ్మల్ని కిడ్నాప్‌ మాత్రమే చేయమన్నామని డబ్బులు ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారని నిలదీస్తుంది.

బంటి: అడ్వాన్స్‌ కూడా తీసుకోకుండా కిడ్నాప్‌ చేయడానికి ఒప్పుకున్నామంటే ఇంకా మా నిజాయితీ మీకు అర్తం కాలేదా..?

స్వాతి: అంటే మా అక్కను మీరు కిడ్నాప్‌ చేయలేదా..?

బంటి: లేదు.. మేము కిడ్నాప్‌ చేయాలనుకునేలోపే పొగ పెట్టి ఎవడో ఎత్తుకెళ్లాడు

స్వాతి: ( ఫోన్‌ కట్‌ చేసి) అక్కను వీళ్లు కిడ్నాప్‌ చేయలేదంటే.. మరెవరు చేసినట్టు

అనుకుంటూ వెనక్కి తిరిగ్గానే.. వెనక అపర్న అంతా వింటుంది. స్వాతి షాక్‌ అవుతుంది. అపర్ణ కోపంగా స్వాతిని కొడుతుంది. మరోవైపు రాజుకు వాళ్ల నాన్న ఫోన్‌ చేస్తాడు.

రాజు డాడీ: ఆ సాహు గాడి చేత మళ్లీ చేపలు ఎందుకు పంపించావురా..? పైగా ఒక లెటర్‌ పంపించాడు..

రాజు: లెటర్‌ పంపించాడా..? ఏముంది నాన్న అందులో..

రాజు డాడీ: ఏముంటుంది. మనందరం బాగుండాలని దేవుడికి పూజ చేయించాడట. నీ తమ్ముడిని రోడ్డు మీద ఏ బండి గుద్దకూడదని అర్చన చేయించాడట.

రాజు: అవి తీసుకుని సాహు వచ్చాడా నాన్న..?

రాజు డాడీ: ఆ ఎధవే వచ్చి ఉంటే తిట్లతో కాదు వాతలతో పంపించేవాణ్ని అసిస్టెంట్‌ తో పంపించాడు. అసలు ఇవన్నీ వాడితో ఎందుకు చేయిస్తున్నావురా

రాజు: ఇవేమీ నువ్వు పట్టించుకోవద్దు నాన్న నేను చూసుకుంటాను

కాల్‌ కట్‌ చేస్తాడు రాజు.

లక్కీ: అరేయ్‌ ఏంట్రా ఇదంతా ఆ సాహు గాడు మళ్లీ చేపలు పంపించడం ఏంటి.? గుడిలో పూజలు చేయడం ఏంటి..?

రాజు: నీకు ఇంకా అర్తం కాలేదా..? వాడి పని వీలైనంత త్వరగా చేయకపోతే నీ ఫ్యామిలీ జోలికి మళ్లీ వస్తానని ఇన్‌డైరెక్టుగా వార్నింగ్‌ ఇస్తున్నాడు

లక్కీ: చూడటానికి రోడ్డు మీద పేపర్లు ఏరుకునే ముష్టివాడులా ఉంటాడు వాడికి ఇన్ని తెలివితేటలా

రాజు: రేయ్‌ ఈ కిడ్నాప్‌ డ్రామాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. డబ్బులు తీసుకుని ఆ అమ్మాయిన పంపించేయాలి

లక్కీ: ఆ ఇందు మనల్ని చూసింది. ఇప్పుడు డబ్బులు తీసుకుని మనల్ని వెళ్లనిస్తుందా..? నిన్ను చూస్తేనే తొకతొక్కిన పాములా బుస కొడుతుంది

రాజు: అదే ఇప్పుడు రివర్స్‌ రూట్‌లో వెళ్దాం లోపలికి పద చెప్తాను

ఇద్దరూ లోపలికి వెళ్లి ఇందు కట్లు విప్పి వెళ్లిపోమ్మని చెప్తారు.

రాజు: చూడండి మా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. నువ్వు ఇంకా బాధపడటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెల్లిపోవచ్చు. కానీ నువ్వు వెళ్లిపోయే ముందు ఇదంతా నేను ఎందుకు చేశానో చెప్పుకోనివ్వు ఇప్పటి వరకు నేను ఒక స్వార్థ పరుడిలాగే నీకు తెలుసు. మోసం చేసి డబ్బులు గుంజే వాడిలాగే తెలుసు. ఇప్పుడు డబ్బుల కోసం కిడ్నాప్‌ చేసే తప్పుడు మనిషిగానే తెలుసు. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా..?

ఇందు: ఎందుకు చేస్తున్నావు..?

రాజు: నా కుటుంబం కోసం నా వాళ్ల కోసం ఇదంతా చేస్తున్నాను

ఇందు: వాళ్ల కోసం ఇలా చేయడం ఏంటి.?

రాజు: అడ్డదారిలోనే సంపాదించాలా అని నువ్వు అనుకోవచ్చు కానీ ఏం చేయమంటావు.. లేచిపోయిన చెల్లెలు.. పారిపోయిన తమ్ముడు.. ఊరి నిండా అప్పులు, రోగిష్టి తల్లి.. పాపిస్టి తండ్రి వీళ్లందరి కష్టాలను తీర్చాలంటే నేను చేసే ఉద్యోగం కానీ శాలరీ కానీ అసలు సరిపోవు

ఇందు: ఇన్ని రోజులు నిన్ను వెధవ అనుకున్నాను కానీ ఈరోజే అర్థం అయింది.

రాజు: ఏమని అర్థం అయింది

ఇందు: నువ్వు వెధవవి కాదు వెధవన్నర వెధవవి అని

అంటూ చీపురు తీసుకుని ఇద్దరిని కొడుతుంది. ఇద్దరూ డోర్ క్లోజ్‌ చేసుకుని బయటకు వెళ్లిపోతారు. మరోవైపు అపర్ణకు స్వాతి కిడ్నాప్‌ డ్రామా గురించి చెప్తుంటే నందు వింటుంది. దగ్గరకు వెళ్లి అన్ని విషయాలు తెలుసుకుని అక్కను నేను సేఫ్‌గా తీసుకొస్తాను మీరు భయపడకండి అంటూ అపర్ణకు ధైర్యం చెప్తుంది. తర్వాత రాజు, రేఖకు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తుంటే.. నందు ఆ కాల్‌ ను ట్రేస్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title=" ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!