ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో సోషల్ మీడియాలో రసమలై ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (X)లో రసమలై ట్రెండ్ చేస్తున్నారు. తమిళనాడు బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అన్నామలై, ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాకరేల మధ్య ఎన్నికల ప్రచారంలో జరిగిన వాగ్వాదం కారణంగా ఈ ట్రెండ్ మొదలైందని తెలిసిందే. దీనిపై బీజేపీ ఎంపీ పీసీ మోహన్, తేజస్వి సూర్యలు రాజ్ థాకరేపై సెటైర్లు వేశారు. హర్యానా ఎన్నికల సమయంలో ఇలాంటి చర్చ జలేబీ గురించి జరగగా, మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో అన్నామలై రసమలై అనే పదాలు ట్రెండ్ అయ్యాయి.

సోషల్ మీడియాలో 'రసమలై' ఎందుకు ట్రెండ్ అవుతోంది?

ముంబైలో బీఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ, ఈ నగరం కేవలం మహారాష్ట్రకు మాత్రమే పరిమితం కాదని, ఇది ఒక అంతర్జాతీయ నగరం అన్నారు. దీనిపై రాజ్ థాకరే తీవ్రంగా స్పందిస్తూ.. మాజీ ఐపీఎస్ అన్నామలైని 'రసమలై' అని ఎద్దేవా చేశారు. ఎంఎన్‌ఎస్ చీఫ్ మాట్లాడుతూ.. 'తమిళనాడు నుంచి ఒక రసమలై ముంబైకి వచ్చింది. ఇక్కడ నీకేం పని, సంబంధం ఉంది? లుంగీ తీసేయండి, పుంగి వాయించండి' అని అన్నారు. దీనికి అన్నామలై స్పందిస్తూ.. ఇది తమిళులకు జరిగిన అవమానమని అన్నారు. నేను ముంబైకి వస్తాను, నా కాళ్లు నరికేందుకు చూడండి అంటూ సవాల్ విసిరారు.

కే. కామరాజ్ వంటి నాయకులను పొగడటం వల్ల వారి తమిళుల గుర్తింపు తగ్గదు. అదేవిధంగా ముంబైని ప్రపంచ స్థాయి నగరం అనడం వల్ల మహారాష్ట్ర ప్రజల పాత్రను కాదనలేమని అన్నారు. శివసేన నాయకులు లుంగీ, ధోతీ వంటి సాంప్రదాయ దుస్తులను అవమానించారని, తమిళులను అవమానించారని అన్నామలై ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పార్టీలతో డీఎంకే రాజకీయ వేదికను పంచుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

Ordered some rasmalai. #BMCResults pic.twitter.com/YXxi9J5XH7

— P C Mohan (@PCMohanMP) January 16, 2026

రాజ్ థాకరేపై బీజేపీ ఎంపీ వ్యంగ్యాస్త్రాలు

బెంగళూరు సెంట్రల్ బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ఎక్స్‌లో రసమలై చిత్రాలను షేర్ చేశారు. 'కొన్ని రసమలైలను ఆర్డర్ చేశాను. #BMCResults' అని రాసుకొచ్చారు. బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ముంబై కోసం ఒక తీపి రసమలై విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు.

A sweet 'Rasmalai' victory for @BJP4Mumbai in the Brihanmumbai Municipal Corporation Election.

Congratulations to CM Shri @Dev_Fadnavis Ji and all dedicated karyakartas for their tireless efforts in this victory.

The Triple Engine Sarkar, under the leadership of PM Shri… pic.twitter.com/20XvXoTEGd

— Tejasvi Surya (@Tejasvi_Surya) January 16, 2026

మహారాష్ట్రలో బీఎంసీతో సహా 29 మున్సిపాలిటీల ఎన్నికల్లో బీజేపీ- శివసేన కూటమి అద్భుతంగా రాణించి సత్తా చాటింది. బీజేపీ కూటమి ఎన్నికల్లో ప్రతిపక్షాలను పూర్తిగా డామినేట్ చేసింది. రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 23 స్థానాల్లో ముందంజలో కాషాయ కూటమి ఉంది. ముంబైని 25 ఏళ్లుగా ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ పాలించగా, నేడు ఇక్కడ బీజేపీ కాషాయ జెండా ఎగరవేసి, అధికారాన్ని ఛేజిక్కించుకుంది.