Gas and Bloating After Meals : ఈ మధ్యకాలంలో చాలామందికి జీర్ణ సమస్యలు పెరిగిపోయాయి. భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా అసౌకర్యం అనేవి చాలా కామన్ సమస్యలుగా మారిపోయాయి. దీని అర్థం మీరు తినే విధానంలోనే కొన్ని తప్పులే కావచ్చు. వేగంగా తినడం నుంచి తిన్న వెంటనే పడుకోవడం వరకు.. తెలియకుండా చేసే కొన్ని అలవాట్లు గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యను పెంచుతాయి. ఆ తప్పులు ఏంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.

సరిగ్గా నమలకపోతే..

చాలామంది ఆహారాన్ని వేగంగా తింటారు. ఆహారాన్ని ఫాస్ట్గా మింగడం అంటే సరిగ్గా నమలకపోవడమే. ఆహారాన్ని పూర్తిగా నమలడం అనేది జీర్ణక్రియలో మొదటి, అత్యంత ముఖ్యమైన దశ. ఎందుకంటే నోటిలోని లాలాజలం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా నమలకుండా కడుపులోకి వెళ్తే దానిని జీర్ణం చేయడానికి కడుపు మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల గ్యాస్, బరువుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి.

Also Read : తిన్న వెంటనే కడుపు మంట, ఉబ్బరం వస్తుందా? అయితే ఈ ఫుడ్స్ తినకపోవడమే మంచిది

నీళ్లు తాగడం..

అలాగే చాలా మందికి భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే ఎక్కువగా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల కడుపులోని జీర్ణరసాలు పలుచబడి.. సరైన జీర్ణక్రియ జరగదు. ఫలితంగా గ్యాస్, అజీర్ణం కలుగుతాయి. జీర్ణక్రియ సరిగ్గా జరగాలంటే భోజనానికి సుమారు అరగంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాత నీళ్లు తాగడం మంచిది.

తిన్నవెంటనే పడుకోవడం

తిన్న వెంటనే మంచం మీద పడుకోవడం లేదా నిద్రపోవడం కూడా గ్యాస్ ఏర్పడటానికి ఒక ప్రధాన కారణమే కావచ్చు. పడుకోవడం వల్ల కడుపులోని ఆహారం, ఎసిడిటీ పైకి వచ్చి.. కడుపు ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంటకు కారణమవుతాయి. తిన్న తర్వాత కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు నిటారుగా కూర్చోవడం లేదా కాస్త నడవడం జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

Also Read : జీర్ణ సమస్యలను దూరం చేసే 9 హెల్తీ ఫుడ్స్.. కడుపు ఉబ్బరం నుంచి మలబద్ధకం వరకు

డీప్ ఫ్రై చేసిన ఫుడ్

అతిగా వేయించిన, మసాలా లేదా నూనెతో కూడిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి కడుపుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఆహారాలను అధిక పరిమాణంలో తినడం వల్ల గ్యాస్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా.. కిడ్నీ బీన్స్, శనగలు, క్యాబేజీ వంటి కొన్ని కూరగాయలు, పప్పుధాన్యాలు కూడా సహజంగా గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి వాటిని సరైన పరిమాణంలో, సరిగ్గా వండిన తర్వాత తింటే మంచిది.

తింటూ మాట్లాడటం..

తింటూ ఎక్కువగా మాట్లాడితే.. శ్వాసను వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. స్ట్రాతో తాగడం వంటివి కూడా కడుపులోకి గాలి చేరడానికి కారణమవుతాయి. ఈ విధంగా మింగిన గాలి కడుపు ఉబ్బరానికి, గ్యాస్‌కు కూడా కారణం కావచ్చు. అందుకే సైలెంట్గా, తక్కువ సంభాషణతో తినడం మంచిది.

ఈ అలవాట్లు మార్చుకుంటే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే సమస్య మళ్లీ మళ్లీ వస్తుంటే లేదా మరింత తీవ్రంగా మారితే.. దానిని నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ లక్షణాలు ఇంకేదైనా అంతర్లీన సమస్యకు సంకేతం కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Also Read : కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య ఉంటే.. ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.