Lalu family is in turmoil: బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్త ఆసక్తి నెలకొంది. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి, బీజేపీ, జేడీయూ కూటమి అధికారం కోసం పోటీ పడనున్నాయి. చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ఈ సారి గెలిచి తీరాలని అనుకుంటోంది. అయితే లాలూ కుమారులు, కుమార్తె మధ్య ఏర్పడిన పంచాయతీ కొత్త సమస్యలు సృష్టిస్తోంది.

లూలూ ప్రసాద్ ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన తేజ్ ప్రతాప్ ను ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు లాలూ కుమార్తె రోహిణి ఆచార్య చుట్టూ వివాదాలు ప్రారంభమయ్యాయి. లాలూ అనారోగ్యానికి గురై దీర్ఘకాల మూత్రపిండ వ్యాధితో బాధపడుతూ, అవినీతి కేసుల్లో న్యాయపోరాటం సాగిస్తున్న లాలూ, అప్పటికి 74 ఏళ్ల వయసులో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన కుమార్తె రోహిణి ఆచార్యనే కిడ్నీ ఇచ్చారు.

लालू यादव की बेटी रोहिणी आचार्य का एक और बयान,मामला लगातार बढ़ता जा रहा है,रोहिणी की लड़ाई किससे ?#Bihar #RohiniAcharya pic.twitter.com/utAMLhDFje

— SOURAV RAJ (@souravreporter2) September 24, 2025

తర్వాత రోహిణి ఆచార్య రాజకీయాల్లోకి వచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె లాలూ స్థానమైన సారన్ నుంచి RJD టికెట్‌పై పోటీ చేసినప్పటికీ, BJP నేత రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కుటుంబ వివాదాల కారణంగా అసలు ఆమె లాలూకు కిడ్నీ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారు. దీనిపై రోహిణి ఆచార్య మండిలడ్డారు. సింగపూర్ ఆస్పత్రి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సవాలు విసిరారు. తానుకిడ్నీ ఇవ్వలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు.

लालू परिवार में संकट गहराता जा रहा है,तेजप्रताप यादव के बाद रोहिणी आचार्य ?#RohiniAcharya pic.twitter.com/1tZWu1oyAF

— SOURAV RAJ (@souravreporter2) September 19, 2025

47 ఏళ్ల రోహిణి పార్టీలో సోదరుడు తేజస్వీ ఆధిపత్యాన్నిఅంగీకరించడం లేదు. తేజస్వీ యాదవ్ తానే సీఎం అభ్యర్థినని ప్రకటించుకుంటున్నారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా ఆయన రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 2012లో SP అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పూర్తిగా తేజస్వి రాజకీయ కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. ఆయన అనుమతి లేనిదే తేజస్వీ ఏమీ మాట్లాడరని చెబుతారు. అందుకే రోహిణి ఆచార్య ఆగ్రహంతో ఉన్నారు. "లాలూ, తేజస్వీ తప్ప ఎవరినీ 'వ్యూహకర్త, రక్షకుడు'గా చూసే సన్నిహితులను సహించలేం" అని ఆమె స్పష్టం చేస్తున్నారు.

సంజయ్ యాదవ్ ను గతంలో లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ "జైచంద్" (ద్రోహి) అని పిలిచారు. సెప్టెంబర్ 21 నాటికి, రోహిణి లాలూ, తేజస్వీ, RJD అధికారిక హ్యాండిల్, ఇతర బంధువులను Xలో అన్‌ఫాలో చేశారు. ఈ డ్రామా యాదవ్ తోబుట్టువుల మధ్య మరింత చీలికను సృష్టించింది. రోహిణికి తేజ్ ప్రతాప్ మద్దతుగా నిలిచారు. "నా సోదరిని ఎవరైనా అవమానిస్తే, నేను సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తా," అని హెచ్చరించారు.

रोहिणी आचार्य जी कल रात तक 164 लोगों को फॉलो करती थी,लेकिन अब सिर्फ 61 को।
प्रोफाइल भी प्रोटेक्ट कर लिया। कंस्टीट्यूशन क्लब चुनाव में बड़ी बहन के द्वारा विरोधी को वोट करना भारी पड़ गया।

रहा कसर भाई ने पूरा कर दिया - विधानसभा टिकट नकार दिया। सुनने में आया है, सिंगापुर लौट गई है,… pic.twitter.com/UTvhfF2Nly

— Anil Singh Sikarwar (@9312Anil) September 20, 2025

78 ఏళ్ల లాలూ, ఆరోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ రాజకీయంగా చురుకుగా ఉంటున్నారు. కానీ కుటుంబంలో రేగిన ఈ వివాదంపై నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, ఈ వివాదాన్ని "వ్యక్తిగత సమస్య"గా తేల్చివేసి, ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. కానీ రోహిణి ఆచార్య సమస్యను పరిష్కరించకపోతే.. అది ఎన్నికల్లో విజయంపై ప్రభావం చూపిస్తుందని అక్కడి రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.