Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10 మొదటి రోజు మొదటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి ఎలాంటి టాస్క్‌లు ఇచ్చారో బిగ్‌బాస్ హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

స్పెషల్ కీస్ ఆ ఇద్దరికే..

బిగ్‌బాస్ స్పెషల్ పవర్‌ ఉన్న తాళాలు గెలుచుకున్న ఎనిమిది మందికి మరో ఇద్దరికి కూడా తాళాలు ఇచ్చే అవకాశం ఉందని ఆ ఇద్దరు ఎవరో మీరే చెప్పండి అని చెప్పడంతో.. త్రిగుణ్, రాం ప్రసాద్, వర్షిణి, ముఖేశ్, షాలిని, ఝాన్సీ, నరేశ్, సృష్టి ఎనిమిది మంది కలిసి వంశీ, కృష్ణుడులకు ఇవ్వాలని నిర్ణయించుకొని అందరి ముందు తమ తమ కారణాలు చెప్పి వాళ్లిద్దరికీ రెండు తాళాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్తారు. తాళాలు మాకు ఎందుకు ఇవ్వలేదు అని అమన్, రోహిత్ ప్రశ్నిస్తారు. ఇక బిగ్‌ బాస్ అందరికీ మహా పరీక్షకి రెడీగా ఉండమని చెప్తారు.

కామెడీ షురూ..

ఉదయం అందరూ కలిసి బిగ్‌ బాస్ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తారు. కాఫీలు టీలు చేసుకొని తాగుతూ చిల్ అవుతారు. అందరూ పొద్దున్నే రెడీ అయిపోయారు మనకే ఇంకా రెడీ అవ్వలేదు అని దేబ్‌జానీ రాం ప్రసాద్‌తో మీటింగ్ పెడుతుంది. ఇప్పుడే లేచా కదా ఏం చేయాలి రామన్నా అని అడుగుతుంది. రామన్న నిన్ను బాగా అర్థం చేసుకున్నాడు కదా నేను మంచోడిని అని బిగ్‌బాస్‌కి చెప్పు అని రాం ప్రసాద్ సెటైర్లు వేస్తాడు. దేబ్‌జానీ కెమెరాతో మాట్లాడుతుంది. రాం ప్రసాద్, నరేశ్ కలిసి పంటలు వేసుకొని నామినేషన్ల గురించి మాట్లాడుకుంటారు. ఇక సృష్టి దగ్గరకు సుధీర్ వెళ్లి ఎస్ అనే ట్యాటూ వేసుకున్నావ్ నా పేరు కూడా వస్తుంది అని ఫ్లర్టింగ్ మొదలు పెడతాడు.

తాళాలు వాటి పవర్లు..

బిగ్ బాస్ కీస్ దక్కించుకున్న 10 మందిని బాక్స్‌లు ఓపెన్ చేయమని అందులో ఏం ఉందో మీరు చదివి కెమెరాకి చూపించండి ఇంట్లో ఎవరికీ తెలీకూడదు అని చెప్తారు. త్రిగుణ్‌కి టేక్‌ ఓవర్ పవర్ వస్తుంది. దీని అర్థం వేరే వాళ్ల పవర్‌ని త్రిగుణ్‌ తీసుకోవచ్చు.. ఝాన్సీకి ఎవిక్షన్ ఫ్రీ పవర్ వస్తుంది. దీని ద్వారా ఎలిమినేషన్ భయం ఉంటే ఆ వారం సేవ్ అవ్వడానికి వాడుకోవచ్చు. తర్వాత ముఖేశ్‌కి ఆల్రెడీ వాడిన పవర్‌ని రివైజ్ చేసే పవర్ వస్తుంది. వర్షిణికి ఎవరైనా టాస్క్‌లో విన్ అయితే ఆ పవర్ తీసుకునే పవర్ వర్ణిణికి వచ్చింది. కృష్ణుడికి హౌస్‌లో ఉన్న ఎవరి ప్లేస్‌ని అయినా తన ప్లేస్‌తో స్వాప్ చేయొచ్చనే పవర్ వస్తుంది. షాలినికి ఏ ప్లేయర్‌కి అయినా నచ్చిన డ్యూటీ ఇచ్చే పవర్ వస్తుంది. సృష్టికి డైరెక్ట్ నామినేషన్ పవర్.. రాం ప్రసాద్‌కి నామినేషన్‌లో తనని అయినా నచ్చిన వారినైనా సేవ్ చేసే పవర్ రాం ప్రసాద్‌కి ఇచ్చారు. వంశీకి ఏ ప్లేయర్‌ని అయినా రెండు వారాలు కెప్టెన్ కాకుండా చేసే పవర్ వస్తుంది. ఇక నరేశ్‌కి డబుల్ ఓట్ పవర్ వస్తుంది.

మహా పరీక్ష..

బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి మహా పరీక్ష పెడతారు. ఈవారం నామినేషన్ ప్రక్రియ లేనప్పటికీ ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేష్ ఉందని చెప్తారు. ఇద్దరినీ నాయకుల పేర్లు చెప్పమని అడుగుతారు. అందరూ వాళ్ల వాళ్ల పేర్లు చెప్పుకొని తర్వాత వేరే పేరు చెప్తారు. రోహిత్‌ ఎక్కువ ఓట్లతో లీడర్ అవ్వడంతో రాం ప్రసాద్, త్రిగుణ్‌కి టై రావడంతో త్రిగుణ్ గివ్‌ అప్ ఇచ్చేసి రాం ప్రసాద్‌కి లీడర్‌గా ఉండమని అంటాడు. రోహిత్‌కి అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ మాత్రమే ఓట్లు వేశారు.. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు చేసేశారని అందుకే తను త్యాగం చేసేసి నట్లు త్రిగుణ్ అంటాడు. త్రిగుణ్ మాటలకు అగ్రిపరీక్ష నుంచి వచ్చిన ఆరుగురు అలా ఎలా అంటారు అని గొడవ పడతారు. చివరగా రోహిత్, రాం ప్రసాద్‌లో లీడర్స్ అవుతారు. రోహిత్‌కి రెడ్, రాం ప్రసాద్‌కి నీలం రంగు రుమాలు ఇస్తారు. ఒకరు బ్లూ టీమ్, మరొకరు రెడ్ టీమ్‌కి నాయకులు అని చెప్తారు. దీంతో ఎపిసోడ్ పూర్తయిపోతుంది.