Bigg Boss Telugu 9 Latest Promo on Captaincy Tasks : బిగ్‌బాస్ సీజన్ 9లో గేమ్స్ ఈ వారమే స్టార్ట్ అయ్యాయని చెప్పాలి. వరుసగా గేమ్స్ నిర్వహిస్తూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లలోని నిజమైన ఫైర్ బయటకు తీసుకువస్తున్నాడు. నామినేషన్స్ నుంచి ప్రారంభమైన ఈ టాస్క్‌లు.. తర్వాత ఇమ్యూనిటీకోసం.. ప్రస్తుతం కెప్టెన్సీ కోసం జరుగుతున్నాయి. వీటిలో దాదాపు అందరూ సత్తా చాటుకుంటున్నారు. వీరు కూడా గేమ్ ఆడగలరా అనేవారు అంతా.. టాస్క్‌ల్లో ఇరగదీస్తున్నారు. ఈరోజు దానికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేశారు. రెండు.. ముడూ ప్రోమోల్లో సంజన గేమ్ ఛేంజర్‌గా కనిపిస్తుంది. మరి ప్రోమో విశేషాలేంటో చూసేద్దాం.

బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోలు..

బిగ్‌బాస్ సెకండ్ ప్రోమోను ఫన్నీగా స్టార్ట్ చేసి.. గేమ్ వైపు తీసుకెళ్లాడు. టాస్కుల్లో భాగంగా ఎవరో నా నడుము మీద గిల్లేశారు అంటూ ఇమ్మూ కామెడీ చేశాడు. నా నడుము ఎంత బాగుంటే మాత్రం.. పర్సనల్ ఫీలింగ్ తీసుకొచ్చి.. గేమ్‌లో చూపించడం సరికాదని.. నాగార్జున గారు నా నడుము ఎవరు గిల్లారో కచ్చితంగా చూపించాలంటూ కామెడీ చేశాడు. తనూజ నేను నిన్ను గిల్లుతానా అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చేంది.

భరణి ఫెయిల్ అయ్యాడా?

ముందు ప్రోమోలో తనూజ అన్‌ఫైర్ అంటూ గట్టిగా అరవడంతో భరణి తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తుంది. బెనిఫిట్ ఆఫ్ అవుట్ కింద తన నిర్ణయాన్ని మార్చుకుంటూ తనూజ టీమ్‌కి పాయింట్ ఇచ్చాడు. దీంతో ఇమ్మూ సీరియస్ అయ్యాడు. 75 శాతం నా చేతిలో ఉన్నదానికి.. అక్కడకి వచ్చి చేయి పట్టుకున్న వారికి ఎలా పాయింట్ ఇస్తారంటూ ప్రశ్నించాడు. ఇది నా ఫైనల్ కాల్ అంటూ భరణి రిప్లై ఇచ్చాడు. రీతూ సంజన ఆమె గేమ్ ఆమె ఆడదు అంటూ రీతూ కామెంట్ చేస్తే.. లేదురా మా గేమ్ స్ట్రాటజీలు మాకుంటాయి కదా అని సంజన రిప్లై ఇచ్చింది. దీంతో రీతూ మీరు కాదు.. మీ ఒక్కరే స్ట్రాటజీలు ప్లే చేస్తూ వేరే టీమ్‌కి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్తుంది. దీంతో ప్రోమో ముగిసింది. ఇదే డిస్కషన్లో సుమన్ శెట్టి కూడా హిప్పో నోట్లో పడ్డానంటూ తన ఆవేదన చెప్పుకొచ్చాడు.

మూడు ప్రోమోలో సంజన మాస్టర్ ప్లాన్..

సంజన తన టీమ్ సభ్యులైన సుమన్ శెట్టి, రాము రాథోడ్‌తో కళ్యాణ్, ఇమ్మూ స్ట్రాంగ్ వారిని బ్యాలెన్స్ చేయాలంటూ చెప్పుకొచ్చింది. కట్ చేస్తే అదే రెడ్ టీమ్ సభ్యుడైన ఇమ్మూతో నేను ఒక్కదానిని అయినా మీకు సపోర్ట్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. వాళ్లకి ఫేవరెటిజం చేస్తుందటంటే ఆమెను డైరక్ట్‌గా నామినేట్ చేస్తానంటూ రామురాథోడ్ సుమన్ శెట్టికి చెప్తాడు. రీతూతో మాట్లాడుతూ సుమన్ శెట్టిని బయటకు లాగకంటూ చెప్తాడు. ఒక్కసారి బయటకొచ్చి వెళ్లు అన్నా అంటూ డిమోన్ పవన్ రిప్లై ఇస్తాడు.తర్వాత తనూజ, సుమన్ శెట్టి గేమ్ ఆడగా ఇద్దరూ సరిగ్గా ఆడకపోవడంతో పవన్ ఇద్దరిని డిస్ క్వాలిఫై చేస్తాడు. దీంతో తనూజ బాత్రూమ్కి వెళ్లి ఏడ్వడంతో ప్రోమో ముగిసింది.