Bigg Boss Telugu Day 81 Promo : గేమ్ ఆడేందుకు లోపలికి వెళ్లి బిగ్​బాస్​ని రిక్వెస్ట్ చేసిన సోహెల్.. ఇజ్జత్ క సవాల్ అంటే ఇదేనేమో

1 week ago 1
ARTICLE AD

Bigg Boss 9 Telugu Today Task with Sohel Promo : లాస్ట్ వీక్ పూర్తిగా ఫ్యామిలీ వీక్​గా మార్చిన బిగ్​బాస్.. ఈ వారం ఎక్స్ కంటెస్టెంట్లను పంపించి టాస్క్​లు ఆడిస్తున్నాడు. ఒక్కొక్కరితో ఒక్కో గేమ్.. ఒక్కో ఎక్స్ కంటెస్టెంట్ అనే రేంజ్​లో ప్లాన్ చేశారు టీమ్. దీనిలో భాగంగా లోపలికి వచ్చి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్​లు ఆడుతున్నారు. ఇప్పటివరకు కళ్యాణ్, డిమోన్ పవన్ మాత్రమే కంటెండర్స్​ అయ్యారు. తనూజ, భరణి, సుమన్ శెట్టి కంటెండర్స్ నుంచి తప్పుకున్నారు. మిగిలినవాళ్లతో ఆడేందుకు సోహెల్ ఇంట్లోకి వచ్చాడు. దానికి సంబంధించిన హైలెట్స్ చూసేద్దాం.

బిగ్​బాస్ ప్రోమో హైలెట్స్ ఇవే..

బిగ్​బాస్ ఇంట్లోకి డీజే టిల్లు సాంగ్​తో ఎంట్రీ ఇచ్చాడు సోహెల్. బిగ్​బాస్​ సీజన్ 4 టాప్​ 5లో సోహెల్ ఒకరు. అయితే అందరూ మెయిన్ గేట్​ దగ్గర డ్యాన్స్ వేస్తుంటే.. లోపలి నుంచి ఎంట్రీ ఇచ్చి అందరితో కలిసి డ్యాన్స్ వేశాడు సోహెల్. ఇటు వచ్చి అటు వెళ్లిపోయినా.. లేకపోతే అందరూ అక్కడ కూర్చొని ఉన్నారంటూ ఫన్ చేశాడు. ఆరు వారాలు మీకు చికెన్ పెట్టలేదంట.. అలా ఎలా ఉన్నారు. నేను అయితే గోడ దూకి బయటకు వెళ్లిపోతుండే అని చెప్పాడు.

సోహెల్​తో ఆడుకున్న బిగ్​బాస్..

ఇంట్లోకి వచ్చిన వారికి బిగ్​బాస్ వెల్కమ్ చెప్తాడు. కానీ సోహెల్​కి చెప్పనట్లు కనిపిస్తుంది. బిగ్​బాస్ మాట్లాడండి బిగ్​బాస్. ఇజ్జత్ పోతాది అన్నా సరే రెస్పాండ్ అవ్వాలేదు. తర్వాత కిచెన్​లోకి వెళ్లి బిగ్​బాస్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు పాల పాకెట్లు, కిలో చికెన్, ఓ కాఫీ పౌడర్ డబ్బా పంపించండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. అందరి ముందు సీరియస్​గా అడిగినట్లు చేసి.. వాళ్లు వెళ్లిపోయాక.. ప్లీజ్ బిగ్​బాస్ ఇజ్జత్ పోతాది. పంపించండి అని ఆల్మోస్ట్ అడుక్కున్నట్లు కామెడీ చేశాడు. బిగ్​బాస్ స్టోర్​ రూమ్ బెల్ రింగ్ అవ్వగానే నాకు తెలుసు బిగ్​బాస్ మీరు పంపిస్తారని చూడగానే.. పాల ప్యాకెట్లు, కాఫీ ప్యాకెట్, చికెన్ బొమ్మలు ఉన్నాయి.

టాస్క్ ఎవరితో ఆడాడు అంటే..

తర్వాత మరోసారి స్టోర్ రూమ్ బెల్ మోగగా.. నిజంగానే పాలు, చికెన్, కాఫీ పంపించాడు బిగ్​బాస్. దీంతో ఇంట్లో అందరూ హ్యాపీగా డ్యాన్స్ వేశారు. అయితే గేమ్ విషయానికొస్తే.. లైవ్ ప్రకారం.. సోహెల్.. రీతూ, సంజనతో కలిపి టాస్క్ ఆడాడు. వాళ్లిద్దరు గెలిచారు. సోహెల్ ఓడిపోవడంతో రీతూ, సంజన కూడా కంటెండర్స్​ అయ్యారు. పూర్తి ఎపిసోడ్​లో టాస్క్​కి సంబంధించిన ఫీడ్ వస్తుంది. అయితే రీతూ, సంజనకు పెద్ద గొడవ అయినా వాళ్లు ఎలా కలిసి ఆడారనేది కూడా ఆడియన్స్​లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.

Read Entire Article