Bigg Boss Telugu Day 79 Promo : బిగ్​బాస్ ఎక్స్ కంటెస్టెంట్ గౌతమ్​తో కెప్టెన్సీ టాస్క్.. కూతురు మాట భరణి నిలబెడతాడా?

1 week ago 2
ARTICLE AD

Bigg Boss 9 Telugu Captiancy Task Promo : బిగ్​బాస్​ ఇంట్లో 12వ వారానికి కెప్టెన్సీ టాస్క్​లు మొదలయ్యాయి. నామినేషన్స్​లో హీటెడ్ ఆర్గూమెంట్స్ తర్వాత ఈ టాస్క్​లు పెట్టాడు బిగ్​బాస్. అయితే ఈ కెప్టెన్సీలో ఎవరికి ఎవరి సపోర్ట్ ఉంటుందో తెలియదు. అది పక్కన పెడితే.. టాస్క్​ల కోసం మరో కొత్త ట్విస్ట్ పెట్టాడు బిగ్​బాస్. ఈసారి కెప్టెన్సీ టాస్క్​ గెలవాలంటే బిగ్​బాస్ పంపే వ్యక్తులతో ఆడి గెలవాల్సి ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ కెప్టెన్సీ టాస్క్ ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.

బిగ్​బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రోమో హైలెట్స్..

బిగ్​బాస్ చివరి కెప్టెన్సీ కంటెండర్ యుద్ధం ప్రారంభమైంది అనడంతో ప్రోమో స్టార్ట్ అయింది.  ఇప్పటివరకు కెప్టెన్సీ కంటెండర్స్​గా నిలవడానికి మీలో మీరు యుద్ధం చేశారు. ఫర్ ఏ ఛేంజ్ ఈసారి పరిస్థితి మీ ఊహలకు అందని విధంగా ఉండబోతుందని చెప్పాడు. దాంతో కంటెస్టెంట్లు షాక్ అయ్యారు. ఈసారి మీరు చేసే యుద్ధంలో బయట నుంచి ఇంట్లోకి వచ్చే యోధులను ఓడించాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్​బాస్.

గౌతమ్ ఎంట్రీ..

బిగ్​బాస్ అలా అనౌన్స్ చేసిన వెంటనే.. ఎక్స్ కంటెస్టెంట్, హీరో, డాక్టర్ గౌతమ్ ఇంట్లోకి వచ్చాడు. అందరికీ హాయ్ చెప్పిన గౌతమ్.. సుమన్ శెట్టితో ఎంటర్​టైన్మెంట్​కి ఎంటర్​టైన్మెంట్​ అసలు ఇచ్చిపడేస్తున్నారు మీరు అంటూ చెప్పాడు. కొన్ని కొన్ని సిచ్యూవేషన్స్​లో ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో మీరు అరుస్తుంటే ఎక్కడ బీపీ వచ్చి పోతారేమో అని భయం వేస్తుందని చెప్పాడు. మన తెలుగు ప్రేక్షకులు మీ అందరినీ గుండెల్లో పెట్టేసుకున్నారు. ఒక్కోక్కరికి ఒక్కో ఫ్యాన్ బేస్ ఉందంటూ చెప్పుకొచ్చాడు.

భరణితో కెప్టెన్సీ టాస్క్..

భరణి కెప్టెన్సీ టాస్క్​లో గెలవాలని చూస్తున్నాడు. అయితే ముందుగా వచ్చిన గౌతమ్​తో భరణికి పోటి జరిగింది. త్వరగా, సరిగా అనే టాస్క్​ పెట్టి.. గేమ్ ఆడించాడు. ఓ బోర్డ్​లో ఉన్న కలర్స్ గుర్తు పెట్టుకుని.. మరో బోర్డ్​లో అదే ఆర్డర్​లో అమర్చాలని చెప్పాడు బిగ్​బాస్. అది పూర్తి అయిన తర్వాత స్వింగింగ్ స్లీప్​పై ల్యాండ్ అయ్యేలా బ్యాగ్స్ విసరాలని చెప్పాడు. అయితే ప్రోమో ప్రకారం భరణి గెలిచినట్లే కనిపిస్తుంది. కానీ లైవ్ ప్రకారం భరణి గెలవలేకపోయినట్లు తెలుస్తుంది. ప్రియాంక, ప్రేరణ కూడా బిగ్​బాస్ ఇంట్లోకి రానున్నారు. అయితే వారు ఎవరితో గేమస్​ ఆడనున్నారో.. ఎవరు గెలుస్తారో.. ప్రోమోలు వచ్చేవరకు, పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Read Entire Article