Bigg Boss 9 Telugu Captiancy Task Promo : బిగ్‌బాస్‌లో 13వ వారానికి కెప్టెన్సీ పోటీలు జరుగుతున్నాయి. కెప్టెన్సీ కంటెండర్స్ కావాలి అంటే.. బిగ్‌బాస్ పంపించే యోధులతో ఫైట్ చేయాలని చెప్పాడు. దీనిలో భాగంగా ఉదయం గౌతమ్‌ని పంపిస్తే.. తర్వాత ప్రియాంక జైన్‌ని పంపించాడు. టిల్లులోని రాధిక సాంగ్ వేసి.. ప్రియాంకను లోపలికి తీసుకువచ్చాడు. దానికి సంబంధించిన ప్రోమోలో ఏముంది? బిగ్‌బాస్ ఏ టాస్క్ ఇచ్చాడు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం.

బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో..

బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోలో ప్రియాంక ఇంట్లోకి వచ్చింది. ఏంటి ఇమ్మూ తెగ ఏడ్చేస్తున్నావు అంటే.. నువ్వే గుర్తొచ్చావు ప్రియాంక అందుకే ఏడ్చేశాను అంటూ ఫ్లర్ట్ చేశాడు. అబ్బా ప్రతి ఒక్కరికి ఇదే చెప్తావా అంటూ ప్రియాంక కూడా ఫన్ చేసింది. తర్వాత ఇంటి సభ్యులకు మీరు మాట్లాడుకునే గుసగుసలు చెప్తే మీ గురించి నేను చెప్తాను అన్నది. రీతూ అందుకుని.. నేను తనూజ నీ స్కిన్ గురించే మాట్లాడుకున్నాము ఎంత బాగుంటుందో కదా అని.. కామెడీ చేసింది. ఈ యోధురాలిని చూడగానే.. మాలో ఉన్న యోధులంతా బయటకు వచ్చేస్తున్నారంటూ ఇమ్మూ కామెడీ చేయగా అందరూ నవ్వేశారు.

టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్.. కళ్యాణ్‌తో..

ప్రియాంకతో యుద్ధంలో గెలవడానికి, చివరి కెప్టెన్సీకి చేరువ అవ్వడానికి ఇస్తోన్న ఛాలెంజ్.. సమ్‌థింగ్ ఫిష్షీ. ఈ టాస్క్‌ని ప్రియాంక కళ్యాణ్‌తో ఆడింది. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా.. సాగ్స్ని పట్టుకుని.. ఫిష్ స్కెలెటిన్ దగ్గరికి వచ్చి.. సాగ్స్లోని ఫిష్ బోన్స్ని నెంబర్స్ ప్రకారం ప్లేస్ చేయాలని చెప్పాడు బిగ్‌బాస్. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉందని చెప్పాడు. అదేంటంటే.. దీనిలో భాగంగా ఒక చేయిని మాత్రమే వినియోగించాలని సూచించాడు.

కళ్యాణ్ గెలిచాడా? ప్రియాంకనా?

కళ్యాణ్, ప్రియాంక గేమ్ స్టార్ట్ చేశారు. ఇమ్మాన్యుయేల్ సంచాలకుడిగా చేసినట్లు తెలుస్తుంది. కళ్యాణ్‌ని కాలుతో పట్టుకోవద్దని.. నోటి సహాయం తీసుకోవద్దని చెప్తూ కనిపించాడు. అయితే కళ్యాణ్ ఈ ఆటలో విజయం సాధించినట్లు లైవ్‌లో చూస్తే తెలుస్తుంది. లాస్ట్ కెప్టెన్సీకి మొదటి కంటెండర్ కళ్యాణ్ అయ్యాడు. మరి ఇంకెవరు కంటెండర్స్ అయ్యారు. ఎపిసోడ్లో ప్రియాంక ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటో.. పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.