Bigg Boss Telugu Day 78 Promo : ఓపెన్ నామినేషన్స్​లో మూడు పెద్ద గొడవలు, కొట్టుకోబోయిన కంటెస్టెంట్లు.. అరాచకమైన ఎపిసోడ్ లోడ్ చేసిన బిగ్​బాస్

1 week ago 2
ARTICLE AD

Bigg Boss 9 Week Wildfire Nominations Promo : బిగ్​బాస్ సీజన్ 9 తెలుగు 12వ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి. ఉదయం సీక్రెట్ నామినేషన్స్ ఇచ్చిన బిగ్​బాస్ ఇప్పుడు ఓపెన్ నామినేషన్స్ ఇచ్చాడు. Wildfire Nominations పేరుతో దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఇప్పటివరకు ఈ సీజన్​లో అతి పెద్ద గొడవలకు సంబంధించిన ప్రోమోను స్టార్​ మా విడుదల చేసింది. అసలు ప్రోమోలో ఏముంది? లైవ్​లో ఏమి జరిగాయి? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..

బిగ్​బాస్​ లేటెస్ట్ ప్రోమో ఓపెన్ నామినేషన్స్​కి సంబంధించింది వచ్చింది. ఈ నామినేషన్స్​లోని రెండో దశ మీలోని ధైర్యాన్ని సూచిస్తుందంటూ బిగ్​బాస్ చెప్పడంతో ప్రోమో స్టార్ట్ అయింది. మీరు నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి ఫోటో తీసి.. ఫైర్​లో వేసి నామినేట్ చేయండి అంటూ సూచించాడు. ముందుగా సంజన వచ్చి.. తనూజ ఫోటో నిప్పులో వేసినట్లు చూపించారు. తర్వాత వచ్చిన ఇమ్మాన్యుయేల్ తనూజను నామినేట్ చేశాడు. ఇమ్మూన్యుయేల్ కెప్టెన్సీ త్యాగం చేసేస్తాడు. దాని విలువ తెలియదంటూ మాట్లాడవు. ఆ పాయింట్ నాకు నచ్చలేదని చెప్పగా.. నేను చేసిందే కదా చెప్పాను అంటూ తనూజ చెప్పింది.

అయితే తనూజను నామినేట్ చేయడంపై మరో పాయింట్ కూడా చెప్పాడు. నిన్ను ఆరుగురు నామినేట్ చేసినప్పుడు దివ్యతోనే ఆర్గ్యూ చేశావు. భరణి, సుమన్ చేసినప్పుడు చేయలేదు. మళ్లీ నేను చేస్తే గొడవ పెట్టుకున్నావు అని అడగ్గా.. పెడితే పాయింట్స్ సరిగ్గా పెట్టూ అంటూ తనూజ సీరియస్ అయింది. నీకు ఎవరు సపోర్ట్ చేసుకుంటూ వస్తారో.. వాళ్ల వెనుక వెళ్లిపోతావని ఇమ్మూని అన్నది. నువ్వు ఆడుతున్న సేఫ్​ గేమ్​ని బ్రేక్​ చేయమని అన్నది. దీనిపై వాళ్లిద్దరికీ పెద్ద గొడవే జరిగింది.

రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు..

భరణిని తన నామినేషన్ దివ్యపై వేశాడు. మనం ఎంత మంచిగా ఉన్నా.. మన వాయిస్ అనేది ఆ మంచితనాన్ని కప్పేస్తాది అని చెప్పగా.. మీలాగా నేను సాఫ్ట్​గా డీల్ చేయలేను అంటూ దివ్య చెప్పింది. నా పాయింట్​లో నేను వాయిస్ రైజ్ చేయాలి.. మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడతాను అంటూ చెప్పింది. ఆ సమయంలో వేలు చూపించగా.. వేలు దించు అంటూ భరణి సీరియస్ అయ్యాడు. అలాగే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటూ గట్టిగా అరిచాడు.

పవన్ vs కళ్యాణ్...

కెప్టెన్సీ రేస్​ నుంచి తీసేస్తే.. నవ్వుకుంటూ వచ్చావంటూ పవన్​ని నామినేట్ చేశాడు. నీకేమైనా ప్రాబ్లమా అంటే.. ప్రాబ్లమేరా అంటూ సీరియస్ అయ్యాడు. అయితే ఈ నామినేషన్​లో కళ్యాణ్, డిమోన్ మధ్య పెద్ద గొడవే జరిగిందట. దాదాపు కొట్టుకునే స్టేజ్​కి వెళ్లిపోయారని లైవ్ చూస్తే తెలుస్తుంది. తర్వాత వచ్చిన ఇమ్మూ తనూజని నామినేట్ చేశాడు. నీవల్లే కెప్టెన్సీ పోయిందని చెప్పగా.. మీరు ఇక మారరా.. మీకు నేను సపోర్ట్ చేశానంటూ చెప్పింది. అయితే ఈ వారం నామినేషన్స్​ తనూజకే ఎక్కువ పడ్డాయట. అంతేకాదు దివ్య, తనూజ మధ్య కూడా గట్టి గొడవే జరిగింది. పూర్తి ఎపిసోడ్ మాత్రం అరాచకంగా రాబోతుంది.

Read Entire Article