Bigg Boss 9 Telugu Thanuja vs Demon Promo : బిగ్‌బాస్ 100వ రోజు ప్రోమో వచ్చింది. అయితే నాలుగైదు రోజుల్లో విన్నర్ ఎవరో తెలియాల్సిన సమయంలో ఇంట్లోవారితో గేమ్స్ ఆడిస్తూ.. గొడవలు పెట్టిస్తున్నాడు బిగ్‌బాస్. గతంలో ఆడిన ఆటలే మళ్లీ ఆడిస్తూ స్టార్స్ ఇస్తున్నాడు. కానీ వాటిని ఆడేందుకు ఒకరికొకరి మధ్య చిచ్చు పెడుతున్నాడు. తాజాగా తనూజ, పవన్ మధ్య ఆర్గ్యూమెంట్ జరిగింది. ఇంతకీ వాళ్లు ఆడిన ఆట ఏంటి? ఎవరు గేమ్ ఆడారు?

బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో

బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో.. ఒన్స్ మోర్.. ఒన్ లాస్ట్ టైమ్‌లో భాగంగా బిగ్‌బాస్ మీకు ఇస్తోన్న టాస్క్.. Save it to Win it అంటూ చెప్పాడు. గతంలో వీళ్లు ఓవర్ స్మార్ట్‌గా ఆడిన గేమ్ ఇచ్చాడు. దాని గురించి ఫన్ చేశాడు బిగ్‌బాస్. ఈ ఆట మీకు గుర్తుందా? అని అడిగాడు. ఎస్ బిగ్‌బాస్ అంటే చాలా బాగా ఆడారు కదా అంటూ ఫన్ చేశాడు. మళ్లీ తెలివి ఉపయోగిస్తారా ? అంటే.. లేదు బిగ్‌బాస్ ఇప్పుడు ఆ తెలివి తేటలు లేవు అన్నాడు కళ్యాణ్. ఈసారైనా సరిగ్గా అర్థం చేసుకుని ఆడమని చెప్పాడు. అంతేకాకుండా ఇప్పుడు కపుల్‌గా ఆడేది ఎవరు? సంచాలకుడిగా చేసే ఎవరో తేల్చుకోండి అంటూ స్టార్ట్ చేశాడు.

డిమోన్ vs తనూజ

డిమోన్ పవన్ ఇప్పటికే గెలిచి రెండు స్టార్లు పొందగా.. అతనిని పక్కన పెట్టి మిగిలిన వాళ్లు గేమ్ ఆడాలని చూశారు. అయితే డిమోన్ మాత్రం నేను ఇప్పుడు ఆడవద్దంటే పర్లేదు.. కానీ రేపన్న రోజు నన్ను పక్కన పెడతాను అంటే ఒప్పుకోను అని చెప్పాడు. లేదు నీకు రెండు స్టార్లు వచ్చాయి.. మాకు రావాలి కదా అంటే.. నాకు కూడా కావాలి కదా.. అసలే నాకు ఓట్ అప్పీల్ కూడా రాలేదని చెప్తాడు. దాంతో తనూజ.. అవి ఇప్పుడు తీసుకురాకు అంటుంది. దానికి పవన్‌కి కూడా కోపం వచ్చి లేదు నేను ఆడతాను.. ఇంక మీ ఇష్టం అంటాడు.

తర్వాత ఎట్టకేలకు డిమోన్ ఒప్పుకుంటాడు. తానే సంచాలకుడిగా చేస్తానంటూ చెప్తాడు. సంజన, ఇమ్మూ ఒక టీమ్.. కళ్యాణ్ తనూజ ఒక టీమ్. సంజన, కళ్యాణ్ బెలూన్ సేవ్ చేయాలి. ఇమ్మూ, తనూజ బెలూన్ ఊది డబ్బాలోపల వేయాలి. అయితే ఇక్కడ ఇమ్మూ, సంజనకి మూడు బెలూన్స్ పోయాయి. ఎక్కువసేపు ఆపలేకపోయింది. కానీ కళ్యాణ్ కాసేపు ఓ బెలూన్ ఆపినా.. తనూజ లేట్‌గా గంట కొట్టింది. దీంతో ఇమ్మూ.. కాస్త గొడవ చేశాడు. దాంతో ఈ ప్రోమో ముగిసింది. అయితే ఈరోజు నుంచి కంటెస్టెంట్లకు సంబంధించిన స్పెషల్ ప్రోమోలు బిగ్‌బాస్ ప్లే చేయనున్నాడు. పూర్తి ఎపిసోడ్ కోసం రాత్రి 10 వరకు వేచి చూడాల్సిందే.