Bigg Boss Telugu 9 Mid Week Eviction Promo : బిగ్‌బాస్‌లో ఇమ్మాన్యూయేల్ కెప్టెన్ అయ్యాడు. అయితే ముందు నుంచి చెప్పినట్లుగానే ఈ వారం రెండు ఎలిమినేషన్స్ ఉంటాయనే బజ్ వినిపిస్తూ ఉంది. దీనిలో భాగంగానే మిడ్ వీక్ ఎవిక్షన్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ నేపథ్యంలో రెడ్ సీడ్ వచ్చిన కంటెస్టెంట్లకు ఓ అధికారం ఇచ్చాడు. ఇంటినుంచి ఓ వ్యక్తిని బయటకి పంపే అధికారాన్ని ఇస్తూ అందరినీ షాకింగ్‌కు గురిచేశాడు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో.. ఎలిమినేట్ అయిన సంజన

బిగ్‌బాస్‌లో సంజన తనదైన ముద్ర వేసింది. ముందు నుంచి ఆమె గేమ్ స్ట్రాటజీని ప్లే చేస్తుంది. మొదటివారంలోనే ఆమె ఇంటి నుంచి బయటకెళ్లిపోతుందని భావించారు. కానీ ఆమె ఇంటికి కెప్టెన్ అయి కూర్చొంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెడుతూ చిల్ అవుతూ.. హోజ్ లోపల ఉన్నవారిని ఇరిటేట్ చేయడంలో సంజన్ మొదటి స్థానంలో ఉంటుంది. అయితే బయట ప్రేక్షకులు మాత్రం ఆమె గేమ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం కాస్త సేమ్ కంటెంట్ రిపీట్ చేస్తుంది అనిపించినా.. ఆమెకు బాగానే ఫాలోయింగ్ పెరిగింది.

ఈవారం మిడ్ వీక్ ఎవిక్షన్లో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన పవర్‌ని ఉపయోగించి ఆమెను ఇంటినుంచి బయటకు పంపేశారు కంటెస్టెంట్లు. ఓ గేమ్‌లో రెడ్ సీడ్ వచ్చిన వారికి ఈ అధికారం ఇచ్చారు. దానిలో భాగంగా మాస్క్ మ్యాన్ హరీశ్, రాము, డిమోన్ పవన్, కళ్యాణ్ వెళ్లి ఎవరిని ఎవిక్ట్ చేయాలనే డిస్కషన్ పెట్టారు. అందరూ కలిసి సంజనను బయటకు పంపాలని నిర్ణయించుకున్నారు. సెకండ్ ఆప్షన్‌గా వేరే వాళ్ల గురించి ఆలోచిద్దామన్నా సరే ఎవరూ రియాక్ట్ కూడా అవ్వలేదు. దీంతో సంజనను బయటకి పంపాలనుకుంటున్నట్లు తెలిపారు.

టార్గెట్ చేసేశారు నన్ను

బయటకు వచ్చి అందరం కలిసి సంజనను బయటకి పంపించాలనుకుంటున్నాము బిగ్‌బాస్ అంటూ చెప్పేసరికి సంజన షాక్ అవుతుంది. అంతేకాకుండా అందరూ కలిసి నన్ను టార్గెట్ చేశారంటూ ఏడుస్తుంది. తర్వాత కంటెస్టెంట్లు అంతా కలిసి ఆమెను మెయిన్ గేట్ నుంచి బయటకు పంపేస్తారు. సంజన వెళ్లిపోయిందని ఇమ్మూ ఎమోషనల్ అయ్యాడు. తనూజ కూడా ఫీల్ అవుతున్నట్లు ప్రోమోలో చూపించారు. అయితే సంజనను సీక్రెట్ రూమ్‌కి పంపించారనే బజ్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఓటింగ్‌లో మంచి ప్లేస్లోనే ఉంది. ఈ వారం కచ్చితంగా ప్రియ ఎలిమినేట్ అవుతుందని ఓటింగ్‌ని చూస్తే తెలిసిపోతుంది. మరి ఈ ట్విస్ట్ ఎంత వరకు నిజమో.. సంజన నిజంగానే ఇంటి నుంచి వెళ్లిపోతుందో వేచి చూడాలి.