Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10లో 5వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి ఎలాంటి టాస్క్‌లు ఇచ్చారో బిగ్‌బాస్ హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

ఝాన్సీ అందుకే వాళ్లతో ఉంది..

చరణ్ మిడ్‌ వీక్ ఎలిమినేట్ అయ్యాడని సృష్టి చాలా బాధ పడుతుంది. రాత్రి అమన్, రోహిత్, సృష్టి, షాలిని నలుగురి కలిసి ఝాన్సీ గేమ్ గురించి మాట్లాడుకుంటారు. మనతో ఉంటే వాళ్లు టార్గెట్ చేస్తారు అని తెలివిగా వాళ్ల వైపు వెళ్లిపోయింది అని అనుకుంటారు. ఇక ఉదయం రోహిత్ త్రిగుణ్ గురించి షాలిని, సృష్టితో అందరికి కమాండ్ చేయాలి అనుకుంటున్నాడు అని చెప్తాడు. ఇక త్రిగుణ్ అమన్‌తో అగ్రిపరీక్షలో రోహిత్ నీతో ఆడిన ఒక్క గేమ్ వల్ల అది కూడా ఆ రోజు వాడు గట్టిగా అరవడం వల్ల హైలెట్ అయ్యాడు. అంతే కానీ వాడు లీడర్ కాదు.. నువ్వు చాలా సత్తా ఉన్నవాడిని వాడి కింద నువ్వు అనేలా ఉండొద్దు.. వాడి కంటే నువ్వే గొప్ప అన్నట్లు ఉండు అని చెప్తాడు.

టాస్క్ ఇదే..

బిగ్‌బాస్ కంటెస్టెంట్ అందరిలో ఈజీ ఆట ఆడటానికి ఏడుగురు, కష్టమైన టాస్క్ కోసం 2 ని సెలక్ట్ చేసుకోమని చెప్తారు. ఈ గేమ్‌లో త్రిగుణ్, కృష్ణుడు, ముఖేశ్ వాలంటీర్‌గా ఆడమని చెప్పేస్తారు. చైత్ర హై రిస్క్‌లో ఉండటం వల్ల ఆడొద్దని బిగ్ బాస్ అంటారు. ఇక మిగతా వాళ్లతో సుధీర్, వర్షిణిలను కష్టమైన టాస్క్ ఆడటానికి ఎంచుకుంటారు. రాంప్రసాద్, ఝాన్సీ, నరేశ్, సృష్టి, అమన్, షాలిని, దేబ్‌జానీ సింపుల్ టాస్క్‌కి సెలక్ట్ అవుతారు.

ఏడ్చేసిన దేబ్‌జానీ..

దేబ్‌జానీ తనని కష్టమైన టాస్క్‌లో సెలక్ట్ చేయకుండా సింపుల్ టాస్క్‌లో సెలక్ట్ చేసినందుకు ఏడుస్తుంది. సుధీర్ వెళ్లి మాట్లాడి ధైర్యం చెప్తాడు. తర్వాత రోహిత్, షాలిని వచ్చి ఏమైంది అంటే అమ్మ గుర్తొచ్చింది అని దేబ్‌జానీ అంటుంది. తర్వాత రాంప్రసాద్‌, నరేశ్ నవ్విస్తారు.

ట్రయాంగిల్ అవుతుందా..

సృష్టి రోహిత్ తనతో ఎక్కువ మాట్లడటం లేదు అని అమన్‌కి చెప్పి బాధ పడుతుంది. దాంతో అమన్ రోహిత్‌కి చెప్పడంతో రోహిత్ సృష్టితో మాట్లాడుతాడు. తర్వాత షాలిని తన వల్లే సృష్టికి రోహిత్ దూరం అయిపోతున్నాడేమో అని ఫీలై బాధతో వచ్చేస్తుంది. తర్వాత రోహిత్ వెళ్లి షాలినితో మాట్లాడుతాడు. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ నాకు ఆ అర్హత లేదు అని నేను ఎవరిని అడగటం లేదు అని చెప్తుంది.

గేమ్‌లో గెలిచిన రాంప్రసాద్..

సింపుల్ టాస్క్ తీసుకున్న ఏడుగురికి బిగ్‌బాస్ రన్ రాజా రన్ అనే టాస్క‌‌ ఇస్తారు. ఈ టాస్క్‌కి త్రిగుణ్ సంచాలకుడు. ఇందులో ఓ సర్కిల్ చుట్టూ రుమాలు పట్టుకొని ఒకరు పరుగు పెట్టి సర్కిల్ చుట్టూ కూర్చొని ఒకరి దగ్గర పడేసి వాళ్లు స్థానం కోసం పరుగు పెట్టాలి.. ఈ టైంలో రుమాలు పట్టుకున్న వాళ్లు అవతల వాళ్లని ముడితే వాళ్లు అవుటే లేదంటే కూర్చొన్న వాళ్లే గెలిచినట్లు.. ఈ గేమ్‌లో ముందు ఝాన్సీ, తర్వాత షాలిని, దేబ్‌జానీ, సృష్టి, అమన్ అవుట్ అవుతారు. తర్వాత రాం ప్రసాద్, నరేశ్‌లలో రాం ప్రసాద్‌ విన్ అయి పర్మినెంట్ హౌస్‌మ్మెట్ అవుతాడు. ఈ టాస్క్‌ తర్వాత బిగ్‌ బాస్ ఒకరికి హైరిస్క్‌లో పెట్టమని రాం ప్రసాద్‌కి చెప్తే రాం ప్రసాద్ అమన్‌ని సెలక్ట్ చేస్తాడు.

అమన్‌కి ఎక్కించిన సెలబ్రిటీలు..

అమన్‌ని రాంప్రసాద్‌ హైరిస్క్‌లో పెట్టినందుకు రోహిత్ మంచి నిర్ణయం అన్నాడు అని చైత్ర కామనర్స్ మధ్యలో అమన్‌కి చెప్తుంది. రోహిత్‌ షాలినికే సపోర్ట్ చేస్తున్నాడు.. నీకు చేయడం లేదు అని చైత్ర అమన్‌కి చెప్తుంది. నిజానికి రోహిత్ రాంప్రసాద్ దగ్గరకు వెళ్లి అమన్‌కి ఎందుకు హైరిస్క్‌లో పెట్టావని అడుగుతాడు. దానికి రాంప్రసాద్ మీరు నాకు ఓటు వేయలేదు కదా అని అంటాడు. రోహిత్ అమన్ దగ్గరకు వచ్చి పర్సనల్ గ్రజ్ పెట్టుకొని నిన్ను సెలక్ట్ చేశాడు అని చెప్తే నువ్వు నా గురించి చైత్ర వాళ్ల దగ్గర ఏదో అన్నావ్ అని అడుగుతాడు. దానికి రోహిత్ ఇప్పుడు కూడా నేను నీ గురించే మాట్లాడాను అని రోహిత్ అంటాడు.

సృష్టి మీద నాకు నమ్మకం లేదు..

సృష్టి గేమ్‌లో షాలినికి రుమాలు ఇచ్చిందని షాలిని హర్ట్ అయిపోతుంది. రోహిత్ ఇద్దరు అమ్మాయిలతో మీటింగ్ పెడతాడు. వాళ్లు వాళ్లకి సపోర్ట్ చేసుకుంటే మనం ఎందుకు ఇలా అని రోహిత్ అడుగుతాడు. అది నా తప్పే అని సృష్టి అంటుంది. దానికి షాలిని నేను రోహిత్‌ని నమ్ముతా, అమన్ని నమ్ముతా కానీ రోహిత్‌ని నమ్మను అని అంటుంది. సృష్టి షాలినికి సారీ చెప్పి కన్నీరు పెట్టుకొని వెళ్లిపోతుంది.

సుధీర్, వర్షిణి టాస్క్..

కష్టమైన టాస్క్ ఆడటానికి కంటెస్టెంట్స్ ఎంచుకున్న సుధీర్, వర్షిణిలను బిగ్‌బాస్ యాక్టివిటీ ఏరియాకు పిలిచి ముందు ఓ కేక్ పెట్టి కేక్లో ఎన్ని కేలరీలు ఉంటాయి .. ఎంత సేపులో తింటారు. ఇలా ప్రశ్నిస్తారు. తర్వాత పాట పెట్టి డ్యాన్స్ చేయమని అంటారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి కేక్ స్మాష్ చేస్తారు. మరో కేక్ చేతిలో పెట్టి ఇంటిలోపలికి తీసుకెళ్లి కేక్ ఒకరంటే ఒకరు పాడు చేశారు అని ఇంట్లో వాళ్లని నమ్మించాలని చెప్పి ఎక్కువ మంది సపోర్ట్ ఎవరు దక్కించుకుంటే వాళ్లే గెలుస్తారు అని చెప్తారు. ఇద్దరూ కేక్ బయటకు తీసుకొచ్చి నువ్వు తోసేశావ్ అంటే నువ్వు తోసేశావ్ అని నవ్వుతూ అనుకుంటారు. దాంతో ఇద్దరూ ఏదో టాస్క్ చేస్తున్నారు అని అందరికీ అర్థమైపోతుంది. ఇక ఇద్దరూ మేం పర్మినెంట్ హౌస్మెట్స్ అయ్యాం అని చెప్తారు. ఇక లోపల జరిగిన విషయం బయట ఎవరికీ చెప్పొద్దు అని బిగ్‌బాస్ చెప్పినప్పటికీ వర్షిణ ముఖేశ్‌కి చెప్పేయడంతో సుధీర్, వర్షిణి టాస్క్ ఫెయిల్ అయి హైరిస్క్‌కి వెళ్లారని బిగ్‌బాస్ చెప్తారు.

చైత్ర ఎలిమినేట్

మహాపరీక్షలో భాగంగా.. చైత్ర, వర్షణి, అమన్, సుధీర్‌లో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి నలుగురిని గార్డెన్ ఏరియాలోకి పిలుస్తారు. నలుగురికి ఒక్కొక్కరిని ఓటు వేయమని అంటారు. దాంతో వర్షిణి చైత్ర ఎలిమినేట్ అవ్వాలని అంటుంది. అమన్ కూడా చైత్ర పేరు చెప్తాడు. సుధీర్ కూడా చైత్ర అని చెప్తాడు. అమన్, సుధీర్ ఇద్దరూ చైత్ర నిన్న గివ్ అప్ ఇచ్చిందని కారణం చెప్తారు. ఇక చైత్ర సుధీర్‌ ఎలిమినేట్ అవ్వాలని చెప్తుంది. ఇక బిగ్‌బాస్ చైత్రకి మూడు ఓట్లు వచ్చినందుకు చైత్ర ఎలిమినేట్ అని చెప్తారు. అందరికీ గుడ్ బాయ్ చెప్పి రెడీగా ఉండమని అంటారు. తర్వాత చైత్రని శవపేటికలో నిల్చొపెట్టి రెడ్ లైట్ వేసి సేమ్ చరణ్‌ని ఎలిమినేట్ చేసినట్లే దూతల్లా వచ్చి చైత్రని తీసుకెళ్లిపోతారు. ఏంటి బిగ్‌బాస్ ఇది నాలుగు రోజుల్లో ఇద్దరినీ తీసుకెళ్లిపోతారా అని రాం ప్రసాద్ నవ్వుతూ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title=" ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self"> ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.