Bigg Boss 9 Telugu: సెలబ్రిటీలతో దద్దరిల్లిన బిగ్‌బాస్9 దసరా ఎపిసోడ్... కిరణ్ అబ్బవరానికి స్వీట్ పనిష్మెంట్... లేడీ డైరెక్టర్‌కు నాగ్ ఆఫర్
2 months ago 3
ARTICLE AD
ఈరోజు జరిగిన బిగ్ బాస్ దసరా డబుల్ ధమాఖా ఎపిసోడ్లో సెలబ్రిటీల సందడితో ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు బిగ్ బాస్. ఆటపాటలతో వాళ్ళు చేసిన హడావిడి ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచింది. "తెలుసు కదా" టీం సిద్ధూ జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.
శ్రీనిధి సెంటిమెంట్... రాశికి వార్నింగ్
"తెలుగు ప్రేక్షకులకు స్క్రీన్ పై శ్రీనిధి కన్పిస్తే ఆ సినిమా హిట్టు" అనే సెంటిమెంట్ ఉందని నాగార్జున చెప్పారు. అయితే నాగార్జున స్వయంగా పిలిస్తే గానీ రాశి ఖన్నా వేదికపైకి రాలేదు. దీంతో "ఈ ఒక్కరోజే బిగ్ బాస్" అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు సిద్ధూ. నవ్వుతూనే రాశి ఆయనకు "సారీ" చెప్పింది. "ప్రతీ 4-5 ఏళ్లకు ఓ స్టోరీ వస్తుంది. ఏం మాయ చేశావే మూవీ లవ్ స్టోరి వైబ్ నే మార్చింది. ఈ మూవీ కూడా అలాగే అవుతుంది" అంటూ సినిమా గురించి వివరించారు.
షూటింగ్ లోనే రాశి ఖన్నా రచ్చ
"స్టార్ బాయ్ సిద్ధూ ఇక జెంటిల్ మెన్ గా మారావా?" అని నాగ్ అడగ్గా... "ఈ సినిమానే ఆ మార్పు" అని చెప్పాడు సిద్ధూ. "క్లైమాక్స్ షూటింగ్ లో నా బాయ్ ఫ్రెండ్ ఇలా చేస్తే కొట్టేసి, వెళ్లిపోతాను అంటూ రాశి ట్రిగ్గర్ అయ్యింది. దీంతో షూటింగ్ ను పక్కన పెట్టి సర్ది చెప్పాల్సి వచ్చింది" అంటూ సినిమా షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు సిద్ధూ. "రాశి లేడీ ఓషో, ఆమెకు బాయ్ ఫ్రెండ్ కావాలంటే అతనికి డిసిప్లిన్ ఉండాలి. విజిల్ కొట్టగానే నవ్వాలి, విజిల్ కొట్టగానే ఆపాలి. శ్రీనిధికి కాబోయే వాడు జెన్యూన్, స్పిరిచ్యువల్ గా ఉండాలి. నా విషయానికొస్తే పొసెసివ్ గా ఉంటాను" అంటూ సిద్ధూ చెప్పిన విషయాలు ఈ ఎపిసోడ్ లో హైలెట్ అయ్యాయి.
లేడీ డైరెక్టర్ కు నాగ్ ఆఫర్
"తెలుసు కదా" మూవీ డైరెక్టర్ నీరజ కోనను కూడా నాగ్ హౌస్ మేట్స్ కు పరిచయం చేశారు. ఆమె గతంలో తన స్టైలిస్ట్ గా ఉండేదని, ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ అయిపోందని ఆప్యాయంగా చెప్పుకొచ్చారు. అలాగే "ఇప్పుడు బంగార్రాజు లాగే ఇంకో సినిమా మొదలు పెడుతున్నాను. దానికి నువ్వే నా స్టైలిస్ట్ గా రావాలి" అని లేడి డైరెక్టర్ నీరజ కోనకు మరో ఆఫర్ కూడా ఇచ్చారు. నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమాను తమిళ డైరెక్టర్ రా కార్తీక్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: మళ్ళీ మెగా పవర్ స్టారే... గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసిన రామ్ చరణ్!
K-ramp టైటిల్ కు కొత్త అర్థం
K-ramp మూవీ హీరోహీరోయిన్లు కిరణ్ అబ్బవరం, యుక్తి మరో స్పెషల్ గెస్ట్ గా బిగ్ బాస్ వేదికపై అలరించారు. "K ramp మీనింగ్ ఏంటంటే హీరో పేరు కిరణ్ అబ్బవరం. మూవీ ఫుల్ ర్యాంప్ మోడ్ లో ఉంటుంది కాబట్టి ఈ టైటిల్" అని చెప్పారు కిరణ్. దీంతో నాగ్ "సినిమా కేరళ స్టైల్ లో ఉంటుంది కాబట్టి కేరళ ర్యాంప్ అని కూడా అనొచ్చు" అంటూ కొత్త అర్థం చెప్పారు. ఇక 'విందుతో పాటు వినోదం' అనే టాస్క్ లో పాల్గొన్నారు కిరణ్ అబ్బవరం అండ్ టీం. ఇందులో హీరో టీం ఓడిపోవడంతో, కిరణ్ అబ్బవరంకు పనిష్మెంట్ గా బూరెలు తినిపించారు.
పర్ఫార్మెన్స్ తో దుమ్మురేపిన ఇతర సెలబ్రిటీలు
'మిరాయ్' హీరోయిన్ రీతూ నాయక్ "వైబ్ ఉంది బేబీ"తో పాటు మరో సాంగ్ కు డ్యాన్స్ చేసింది. అలాగే సింగర్స్ శృతి రంజని, సింగర్ అనిరుధ్, ధనంజయ, సాహితీ "హైలెస్సా, కుర్చీ మడతబెట్టి, ఓజాస్ గంభీర, దేవర" సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేశారు. "కోర్టు" మూవీ హీరో హీరోయిన్లు రోషన్, శ్రీదేవి కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ హారిక అలేఖ్య "వైరల్ వయ్యారి", "కోయిల", "దావూది" పాటలకు స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అదరగొట్టింది.
Read Entire Article