Bigg Boss 9 Telugu: 'బిగ్ బాస్ సీజన్ 9'లో కామనర్సే టార్గెట్... వాళ్ళు చేస్తే మజాక్, వీళ్ళు చేస్తే రజాకా? బిగ్ బాస్ పంచతంత్రం ఇదేనా?
2 months ago 3
ARTICLE AD
'బిగ్ బాస్ సీజన్ 9'తో ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ కొత్త కాన్సెప్ట్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. 'కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు' అన్న ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో ఎవరెవరు హౌజ్ లోకి అడుగు పెట్టబోతున్నారన్న ఉత్కంఠకు తెర దించారు మెయిన్ ఎపిసోడ్ తో. ఇప్పటికే హౌజ్ లో 13 రోజులు పూర్తి కాగా, రోజురోజుకూ అక్కడ లెక్కలు మారిపోతున్నాయి. నిజానికి కామనర్స్ ముందే అగ్ని పరీక్షను ఎదుర్కొని హౌజ్ లోకి అడుగు పెట్టారు. కానీ ఆ తరువాత పరిస్థితి తలకిందులు అయ్యింది. అప్పుడే ఏం అయ్యింది? ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా ఉంది కామనర్స్ స్థితి. ఎందుకంటే రోజురోజుకూ కామనర్స్ కే నెగెటివిటీ పెరిగిపోతున్నట్టుగా అన్పిస్తోంది. బయట పరిస్థితి ఎలా ఉన్నా, శనివారం ఎపిసోడ్ చూశాక బిగ్ బాస్ పంచతంత్రం ఇదేనా? అన్పించక మానదు.
కామనర్స్ నే ఎందుకు టార్గెట్ చేశారు?
ప్రియా, శ్రీజ అంటే తెగ చిరాకు పడిపోతున్నారు ఆడియన్స్. దానికి ప్రత్యేక కారణం ఏంటి? అన్నది ఒక ప్రశ్న కాగా... గతవారం హరిత హరీష్ కు స్ట్రాంగ్ కౌంటర్ పడితే, ఈ వారం మాత్రం ప్రియ, శ్రీజ బలయ్యారు. ప్రియా సంచాలక్ గా చేసిన ప్రతీ టాస్క్ లోనూ తప్పు చేసింది అనే విధంగా నాగ్ వీడియోలు చూపించి మరీ ఆమెకు క్లాస్ పీకారు. ముందుగా "కాలచక్రం" టాస్క్ లో "పవన్ విషయంలో తనూజ మాట ఎందుకు వినలేదు ?" అంటూ మొదలెట్టారు. ప్రియా తామిద్దరం కలిసే ఆ రూల్ పెట్టామని చెప్పినా, ఆమెదే తప్పు అని నోరు మూయించారు. బొమ్మల టాస్క్ విషయంలోనూ అదే జరిగింది. సుమన్ శెట్టి టాస్క్ లో తన టాయ్స్ కాపాడుకునే క్రమంలో డిఫెండ్ చేసుకోకుండా సంజనను కొట్టాడు. అలా కొట్టినందుకే అతన్ని ఎలిమినేట్ చేసినా, తప్పు ప్రియాదే అని తేల్చారు. విచిత్రం ఏమిటంటే టాస్క్ లో రక్తమోడి ఆడుతున్నాను అంటూ తెగ బాధపడిన సంజన ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉంది.
అందరూ అందరే... తప్పు మాత్రం కామనర్స్ దే ?
ఇక రంగు పడుద్ది టాస్క్ విషయానికొస్తే... భరణి ఓనర్ అయ్యి ఉండి టెనెంట్ కి సపోర్ట్ చేశాడు. అది తప్పు అనడం కూడా తప్పేనని చెప్పేశారు. అయితే ఇక్కడ ప్రియా, శ్రీజ, భరణితో సహా అక్కడుకున్న అందరూ అది ఇండివిడ్యువల్ కెప్టెన్సీ టాస్క్ అనే విషయాన్ని మర్చిపోయారు. ఓనర్స్ లో ఒకరు కెప్టెన్ అవ్వాలని వీళ్ళు, టెనెంట్స్ లోనే ఒకరు కెప్టెన్ అవ్వాలని వాళ్ళు అనుకున్నారు. కానీ నాగార్జున మాత్రం వీకెండ్ లో "కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు" అన్నందుకు ప్రియాదే తప్పని తేల్చేశారు. ఇక తప్పంతా సంచాలక్ రీతూదే అయినా... గెలిచిన డిమాన్ పవన్ కెప్టెన్సీని రద్దు చేశారు. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అయినప్పుడు మళ్ళీ ఇదంతా ఏంటో మరి.
Also Read: బిగ్ బాస్ డే 13 రివ్యూ... ఓనర్స్ కి రంగు పడింది... ఒక్కొక్కరికీ మబ్బులు విడిపోయేలా నాగ్ కౌంటర్... కెప్టెన్సీ రద్దుతో షాక్... నేటి ఎపిసోడ్ విశేషాలివే
ఇదే బిగ్ బాస్ పంచతంత్రమా ?
కాలచక్రం టాస్క్ లో "పవన్ అవుట్ అయ్యాడని తనూజ చెప్పినప్పుడు, గేమ్ ని పాజ్ చేసి ఎందుకు డిస్కస్ చేయలేదు" అని నాగ్ అడిగారు. మరి అదే విషయం తనూజను ఎందుకు అడగలేదు అనేది కామనర్స్ ఫ్యాన్స్ ప్రశ్న. పైగా నాగ్.. తనూజ గేమ్ సూపర్ అంటూ కితాబునివ్వడమే కాకుండా, గేమ్ లో గెలవడానికి పంచతంత్రం ఉపయోగించలంటూ సలహా కూడా ఇచ్చారు. దీంతో ఈ వీక్ క్లియర్ గా ప్రియా, శ్రీజ, డిమాన్ పవన్, పవన్ కళ్యాణ్... అంటే ఓనర్స్ టార్గెట్ అయినట్టుగా అన్పించింది. కానీ చివర్లో నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ చూశాక ఆ అభిప్రాయం మార్చుకోక తప్పదు. ఎందుకంటే ఓనర్స్ ను టెనెంట్స్ గా.. టెనెంట్స్ ను ఓనర్స్ గా మార్చడానికే బిగ్ బాస్ ఈ పంచతంత్రాన్ని వాడారు. ఇక ఇప్పుడు రివేంజ్ గేమ్ మొదలవుతుంది. మరి నెక్స్ట్ నుంచి ఈ రణరంగం ఎలా ఉంటుందో చూడాలి.
Read Entire Article