Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 76 రివ్యూ... తనూజ - దివ్య గొడవ తప్పెవరిదో తేల్చిన నాగ్... తల్లికిచ్చిన మాటను నిలబెట్టుకున్న రీతూ... దివ్యపై భరణి తల్లి షాకింగ్ కామెంట్
1 week ago 2
ARTICLE AD
బిగ్ బాస్ డే 76 ఎపిసోడ్ లో ముందుగా శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో చూపించారు. మాన్స్టర్ టాస్క్ నుంచి తప్పించుకున్న రీతూ - సుమన్ శెట్టిలకి 'కొన్ని అడుగులు దూరం' అనే కెప్టెన్సీ టాస్క్ పెట్టారు. చివరికి రీతూ కెప్టెన్ అయ్యింది. అదే రోజు సాయంత్రం పెయింట్ ను రీ క్రియేట్ చేసే టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇమ్మూ - తనూజా టీం విన్ అయ్యింది. మరోవైపు "జీవితంలో ఆ మనిషిని చూడను. వాల్యూ లేని మనిషి. ఇష్టం లేకపోయినా వెంట పడుతుంది అనే మాట అన్నది నన్ను. నేను వెళ్తే మీరు ఎవరితో గొడవ పడొద్దు" అని భరణి దగ్గర ఎమోషనల్ అయ్యింది దివ్య.
తనూజా - దివ్యలకు నాగ్ వార్నింగ్
ముందుగా నాగార్జున కెప్టెన్ రీతూను అభినందించారు. తరువాత "ఒక్క వారమే ఉంది ఆరతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకో" అని భరణితో  చెప్పారు. దివ్య - తనూజా గొడవలో తప్పు దివ్యాదే అని వీడియోను ప్లే చేసి మరీ చెప్పారు హోస్ట్. అలాగే తనూజా కూడా తన తీరు మార్చుకోకపోతే నష్టపోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఎట్టకేలకు దివ్య తన తప్పు ఒప్పుకుని సారీ చెప్పేసింది.
హ్యాపీ వీక్ లో కుళాయి కొట్లాటలు
"ఇది హ్యాపీ వీక్. కొళాయి లాంటి గొడవలు ఎందుకు?" అంటూ హౌస్ మేట్స్ ఫ్యామిలీలను ఒక్కొక్కరిగా హౌస్ లోకి పంపారు బిగ్ బాస్. భరణి అమ్మా, గురువు నాగబాబు ఎంట్రీ ఇవ్వడం చూసి... భరణి సాష్టాంగ నమస్కారం చేశాడు. "ఇది చాలు. బెస్ట్ మూమెంట్. జీవితాంతం రుణపడి ఉంటాను" అని చెప్పాడు. "భరణి కోసం బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేసి మీకు ఫ్యాన్ అయిపోయా" అంటూ నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించారు నాగబాబు. "అతనేదో ఊరికే గురువు అని గోల చేస్తాడు. మేమిద్దరం ఒక సీరియల్ చేశాం. అప్పుడు భరణి అగ్రెసివ్ గా ఉండేవాడు. బాక్సింగ్ ప్రాక్టిస్ చేసేవాడు. అతను మెగా ఫ్యాన్. ఎవరైనా తప్పుగా మాట్లాడితే కొట్టి మాట్లాడేవాడు. ఇప్పుడు గంగిగోవులా తయారయ్యాడు. గబుక్కున ఎవరిమీద చెయ్యి ఎత్తొద్దు అని షోకి వచ్చేముందు చెప్పాను. దాన్ని సీరియస్ గా తీసుకున్నాడేమో. ఇది నాకు నచ్చలేదు. బిగ్ బాస్ లో ఒకవేళ నేను ఉండి ఉంటే 24వ గంటలోనే బయటకు వచ్చేవాడిని.అక్కడున్న వాళ్ళందరూ బాగా ఆడుతున్నారు. కానీ భరణి అక్కడున్న వాళ్ళతో ఎమోషన్స్ ఎంత ఉన్నాయో ఆట కూడా అలాగే ఆడాలి. నీ కన్న కూతురు ఉన్నా కూడా అంతే టఫ్ గా మాట్లాడాలి. ఎదుటి వాళ్ళు గట్టిగా మాట్లాడినప్పుడు నువ్వు సైలంట్ గా ఉండకూడదు" అని హింట్స్ ఇచ్చారు నాగబాబు. హౌస్ లో టాప్ 5 భరణి, తనూజా, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, సంజనాకు ఇచ్చారు నాగబాబు. కట్ ఔట్ తీసి బొమ్మరిల్లు హాసిని రీతూ, గజిని భరణికి ఇచ్చారు.
గర్వంగా ఫీల్ అయిన కళ్యాణ్ ఫాదర్
తరువాత "హాస్టల్ లో చూడడానికి రాలేదు అన్నావ్ కదా" అంటూ కళ్యాణ్ తండ్రి లక్ష్మణరావు పడాల, బ్రదర్ బాలు భాస్కర్ ను స్టేజ్ పైకి ఆహ్వానించారు. "మారు మూల గ్రామంలో ఏదో పని చేసుకున్నా. అలాంటి నన్ను ఇక్కడికి తీసుకొస్తాడని అనుకోలేదు. మా పరిస్థితుల వల్ల వాడిని ఏ రోజూ లాలించలేదు, తినిపించలేదు" అంటూ ఎమోషనల్ అయ్యాడు కళ్యాణ్ తండ్రి. అలాగే గేమ్ కోసం ఎవ్వరినీ వెన్నుపోటు పొడవొద్దని, కప్పు - డబ్బు కంటే జనాల మెప్పు ముఖ్యమని చెప్పారు. ఇక టాప్ 5లో కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజా, రీతూ, డెమోన్ లకు ఇచ్చారు. క్యారెక్టర్ ను తీసి షెకావత్ ను డెమోన్ కు, కిక్కు కళ్యాణ్ ను కళ్యాణ్ కు ఇచ్చారు. "నా లైఫ్ లోనే స్ట్రాంగ్ పర్సన్. జీరో నుంచి హీరో అయ్యాడు. ఎన్ని వచ్చినా తట్టుకుని నిలబడ్డ ఆయనే నా హీరో" అని చెప్పాడు కళ్యాణ్.
ఈ క్రమంలోనే "మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అర్థం చేసుకోవట్లేదు. మిమ్మల్ని అన్నయ్య అని ట్రీట్ చేశాను. నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ప్రాబ్లం?" అంటూ దివ్య కన్నీళ్లు పెట్టుకుంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయేల్ బ్రదర్, ముక్కు అవినాష్ తో కలిసి వచ్చారు. "ఇమ్మాన్యుయేల్ నువ్వు జనం మెచ్చిన మనిషివి. నా టీంలోకి కమెడియన్ గా తెచ్చుకున్నా. నేను రెండు సీజన్లలో చేసింది అతను ఒక్క సీజన్ లో చేశాడు" అని చెప్పాడు అవినాష్. "నేను ప్రౌడ్ గా చెప్పుకుంటా అవినాష్ నా గురువు" అని ఇమ్మూ చెప్పాడు. టాప్ 5 లో ఇమ్మాన్యుయేల్, తనూజా, కళ్యాణ్, డెమోన్, రీతుకి ఇచ్చాడు. "ఈ పొజిషన్ ను దృష్టిలో పెట్టుకుని ఎవరితో పోటీ, ఎవరితో ఫైట్ చేస్తే ముందుకు వెళ్తావు అనేది చూసుకో. ఇమ్యూనిటీ అని భయపడుతున్నావ్. అది అక్కర్లేదు. కమెడియన్ పంచ్ తో పాటు కప్పు కూడా కొడతాడు. కప్పుతో రా" అని మోటివేట్ చేశాడు. 'మహానటి' క్యారెక్టర్ ను తనూజాకు, 'కట్టప్ప'ను కూడా తనుజకు ఇచ్చాడు.
చివరగా దివ్య తాత వారణాసి రామశర్మ, ఫ్రెండ్ సలోని వచ్చారు. "గేమ్ బాగా ఆడుతున్నావ్. బాండింగ్ బానే ఉంటాయి. కానీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. జాగ్రత్త" అని చెప్పారు. ఇమ్మూ, తనూజా, భరణి, సుమన్ శెట్టి, దివ్యలను టాప్ 5లో పెట్టారు. 'ఎఫ్ 2' హనీని తనూజా, పెదరాయుడు దివ్యకి ఇచ్చారు.
Read Entire Article