How Much Does Nagarjuna Charge For Bigg Boss Telugu Season 10: తెలుగు టీవీ హిస్టరీలో అత్యంత వీక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో 'బిగ్ బాస్' తెలుగు (Bigg Boss Telugu) ఒకటి. రీసెంట్‌గా 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 స్టార్ట్ అయ్యింది. దీనికి కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హోస్ట్ చేస్తున్నారు. 'బిగ్ బాస్ 3' నుంచి ఈ షోకి ఆయనే హోస్ట్. కొత్త సీజన్ ప్రారంభం కావడంతో వీక్షకులతో పాటు పరిశ్రమ వర్గాల దృష్టి ఆయనపై పడింది. ఈసారి ఎంత కొత్తగా హోస్ట్ చేస్తారని చూస్తున్నారు. ఈ తరుణంలో ఆయన రెమ్యూనరేషన్ గురించి కూడా డిస్కషన్ జరుగుతోంది. 'బిగ్ బాస్ 10'కు ఆయన ఎంత తీసుకుంటున్నారో తెలుసా?

నాగార్జునకు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
టాలీవుడ్ సినిమా, టీవీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం... కింగ్ అక్కినేని నాగార్జునకు స్టార్ మా ఛానల్ కోట్లలో పారితోషికాన్ని ఇస్తున్నారట. 10వ సీజన్ కోసం సుమారు 40 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని కింగ్ తన ఖాతాలో వేసుకోబోతున్నట్లు సమాచారం.

లాస్ట్ సీజన్ (బిగ్ బాస్ తెలుగు 9)కు నాగార్జున దాదాపు 35 కోట్ల రూపాయల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు తెలిసింది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి 10వ 'బిగ్ బాస్' తెలుగు సీజన్‌కు ఆయన రెమ్యూనరేషన్ 5 కోట్ల రూపాయలు పెరిగిందని సమాచారం. అయితే... ఇటు స్టార్ మా వర్గాలు గానీ, అటు అక్కినేని వర్గాలు గానీ పారితోషికం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

Also Read: Samantha Visits Isha Foundation With Baby Bump - పెళ్ళి చేసుకున్న గుడికి బేబీ బంప్‌తో వెళ్ళిన సమంత... 'సద్గురు'తో స్టార్ హీరోయిన్

'బిగ్ బాస్ 9' విషయంలో నాగార్జునపై విమర్శలు
'బిగ్ బాస్'ను విజయవంతంగా నడిపిస్తున్న హోస్టులలో నాగార్జున ఒకరు. అయితే గత సీజన్ సమయంలో ఆయన హోస్టింగ్ శైలిపై కొంతమంది వీక్షకులు చాలా అంటే చాలా విమర్శలు చేశారు. వీకెండ్ ఎపిసోడ్స్ నిర్వహించే సమయంలో ఆ షోకి కావాల్సినంత ఎనర్జీతో చేయలేదన్నారు. ఆయన హోస్ట్ ఇంపాక్ట్ చూపించడంలో ఫెయిల్ అయ్యిందన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అయితే కొంత మంది పనికట్టుకుని కావాలని విమర్శలు చేసినట్టు అభిమానులు తెలిపారు.

Also Read: Mandaadi OTT - నెట్‌ఫ్లిక్స్ చేతికి 'మందాడి... రిలీజుకు ముందే సుహాస్ సినిమాకు భారీ డీల్

'బిగ్ బాస్' 10వ సీజన్ ద్వారా ఆ విమర్శలు అన్నింటికీ నాగార్జున సమాధానం చెబుతారా? లేదా? అని అభిమానులు, వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి వీకెండ్ ఎపిసోడ్స్‌లో మరింత ఉత్సాహం, వినోదం, జోష్ తీసుకు వస్తారని వీక్షకులు భావిస్తున్నారు. సీజన్ లాంచింగ్ ఎపిసోడ్ లో ఆయన ఎనర్జీ అదిరింది. తనదైన శైలిలో కింగ్ హోస్ట్ చేశారు.

Also Read: Nandamuri Mokshagna Debut Movie Officiallu Announced - సింహంలా వస్తున్న బాలయ్య వారసుడు... వశిష్ఠ దర్శకత్వంలో అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మైత్రి