Bhagavad Gita: మీకు దైవభక్తి ఉంది సరే..మరి దేవుడు మీ గురించి ఆలోచిస్తాడా? ఎలా తెలుస్తుంది?

18 hours ago 1
ARTICLE AD

నిత్యం పూజల్లో మునిగితేలేవారున్నారు..

రోజూ పూజలు చేయకపోయినా భగవంతుడిని మనసులో ధ్యానించేవారున్నారు..

అసలు భగవంతుడిని నమ్మనివారూ ఉన్నారు..

మరి ఆ దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తాడు?

పూజలు చేసేవారినే పట్టించుకుంటాడా - తనకు నమస్కరించని వారి గురించి ఆలోచనే చేయడా?

ఈ ప్రశ్నలకు సమాధానం భగవద్గీతలో ఉంది...

మైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః"

ఈ జీవులంతా నా అంశలే..ఎప్పటికీ నావాళ్లే అని అర్థం. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆలోచించడానికి ప్రత్యేకమైన సమయం పెట్టుకుంటారా? బిడ్డే వారిలో భాగం అయినప్పుడు ఆలోచన నిరంతరం సాగుతూనే ఉంటుంది కదా.. అలానే భగవంతుడికి అంతా పిల్లలే అయినప్పుడు ఆయన ఎందుకు ఆలోచించరు?. పిల్లలు మంచి చేస్తే పొగుడుతారు, తప్పుచేస్తే దండిస్తారు కానీ చేయి విడిచిపెట్టని తల్లిదండ్రుల్లానే..దేవుడు కూడా తన పిల్లల చేయి వదలడు..

మృత్యు పంచకం ఎప్పుడు? ఈ తేదీల్లో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలో మరో ఐదుగురికి మరణ భయం తప్పదా?

ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః

నా ఆత్మ ఈ శరీరంలో సాక్షిగా ఉంటుంది..అనుమతిస్తుంది, పోషిస్తుంది, అనుభవిస్తుంది. అంటే నీలో ఉన్నది ఆ దేవుడే. అలాంటప్పుడు నువ్వు ఏం చేసినా ఆయన గమనించకుండా ఉంటాడా? నాకెవరూ లేరని మీరనుకుంటే అయిపోదు..నీకు నేనున్నానంటూ నడిపించేవాడు ఆయనే..

సర్వస్య చాహం హృది సన్నివిష్టః

అర్థం ఏంటంటే.. నేను అందరి హృదయాల్లో ఉన్నాను. అంటే నీ గుండె చప్పుడు ఆయన వింటున్నాడు, నీ కళ్లలో ఆనందం బాధ అన్నీ చూడగలడు, నువ్వు నోటితో చెప్పకపోయినా నీ మనసులో మాట ఆయనకు తెలుసు అనే కదా అర్థం. కష్టంలో ఉన్నప్పుడు దేవుడా ఎక్కడున్నావ్ అనొద్దు..నాలో ఉన్నావ్ కదా నువ్వే చూసుకో అని నమ్మకంగా కోరుకో.

భగవద్గీత For GenZ, ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్

నిరంతరం నన్ను తలుచుకునేవాళ్ల రక్షణ నేను చూసుకుంటా అని అర్థం. అంటే ముందు భగవంతుడు ఉన్నాడని నువ్వు నమ్మనప్పుడు ఆయన నీకు చేసిన మంచి ఎలా గుర్తించగలవ్. ముందు ఆ దేవుడు ఉన్నాడని నమ్మి పిలిస్తేనే కదా వచ్చాడో లేదో నీకు అర్థమయ్యేది. నువ్వు భక్తి అనే తలుపు తెరిచి ఆహ్వానిస్తేనే వస్తాడు.

సూర్యుడు లోకమంతా వెలుగు ప్రసరింపచేస్తాడు కానీ..వద్దు అని నువ్వు తలుపు మూసేస్తే మిగిలేది చీకటే.. అక్కడ లోపం సూర్యుడిదా? నీదా?

నీకు ఏం కావాలో నిర్ణయించుకోవడమే కర్మఫలం. నువ్వు ఆచరించిన కర్మలకు తగిన ఫలం పొందుతావ్. దేవుడు పరీక్ష పెట్టేది నిన్ను బలపర్చేందుకు, జీవితంలో విజయం సాధించేందుకే.

అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః

అంటే.. నీ పాపాల నుంచి నేనే నిన్ను విడిపిస్తాను దిగులు పడొద్దు..

దేవుడు నిన్ను మర్చిపోలేదు..నువ్వు గుర్తుచేసుకుంటే నీతో ఉన్నట్టే లేదంటే నువ్వు ఒంటరివే..ఇదీ ఆధ్యాత్మికవేత్తల సందేశం

బాధలో, కష్టంలో ఉన్నప్పుడు 'భగవద్గీత' ఎందుకు చదవమంటారు!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

Read Entire Article