Teachings Of The Gita: మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు సమాధానం<a title=" భగవద్గీత" href="https://telugu.abplive.com/search?s=%E0%B0%AD%E0%B0%97%E0%B0%B5%E0%B0%A6%E0%B1%8D%E0%B0%97%E0%B1%80%E0%B0%A4" target="_self"> భగవద్గీతలో ఉంటుందని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. అందుకే భగవద్గీతను వైద్యుడితో సమానంగా పోలుస్తారు. అయితే ఉన్న ఒక్క వ్యత్యాసం ఏంటంటే.. వైద్యుడు శరీరంలో వ్యాధులు నయం చేస్తే..గీతమాత్రం మనసులో వ్యాధులు నయం చేసి..వాటి విముక్తి మార్గాన్ని చూపిస్తుంది.

బాధలో, కష్టంలో ఉన్నప్పుడు 'భగవద్గీత' ఎందుకు చదవమంటారు!

గీతా బోధనలు జీవన ప్రవాహానికి దారి దీపాల్లాంటివి. ఎందుకంటే అంతర్లీనంగా జీవిత సత్యాలుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వాటికి కారణాలు, నివారణ మార్గాలు మొత్తం అన్నింటినీ విపులంగా వివరించారు. అందుకే గీతా బోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అన్ని వర్గాలను ప్రభావితం చేశాయి. వైద్యుడు వ్యాధిని తగ్గించడమే కాదు..అందుకు కారణం ఏంటో కూడా వివరిస్తాడు. అలాగే భగవద్గీతను లోతుగా అధ్యయనం చేస్తే మనసులో రోగాలకు కారణాలు, వాటి నివారణ మార్గాలు స్పష్టంగా అర్థమవుతాయ.అందుకే మనోవికారాలు తొలగించగల శక్తివంతమైన సాధనం భగవద్గీత.

మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉందా! ఎందుకు?

మనోవికారాన్ని మాత్రమే కాదు..మోహాన్ని కూడా సులభంగా తొలగించగలదు భగవద్గీత. జీవితాలను నాశనం చేసేది మోహమే, దుఃఖాలకు ప్రధాన కారణం మోహమే. జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నా, మోహ బంధాల నుంచి విముక్తి పొందాలన్నా భగవద్గీతను ఆశ్రయించాలి. ఎవరైతే గీతా జ్ఞానాన్ని పొందుతారో వారు మోక్షం సాధిస్తారు. ఆత్మ అమరమైనదని చెబుతూనే..తన కర్తవ్యాలను సంపూర్ణ నిష్టతో నిర్వర్తించడానికి మనిషిని ప్రేరేపిస్తుంది. శరీరాన్ని భోగాల కోసం మాత్రమే కాదు..మోక్ష సాధన కోసం కూడా వినియోగించాలని ఉపదేశించింది భగవద్గీత

సాధువులు, నదులు ఎప్పుడూ ఒకే తోట ఆగిపోకుండా నిరంతరం ముందుకు సాగుతాయి..అవి అనేత ప్రాంతాలకు చేరి జ్ఞానాన్ని పంచుతాయి, ప్రజలకు మేలు చేస్తాయి, ఆనందపరుస్తాయి. ప్రతి మనిషి సంపూర్ణ శ్రద్ధ, నిష్ఠలతో పరులకు ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉండాలి. తన జ్ఞానంలో ప్రపంచానికి వెలుగు పంచేందుకు ఎప్పుడూ కృషి చేయాలి. ఇదే నిజమైన మానవధర్మం..

శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సారాంశం మొత్తం 10 పాయింట్స్ లో!

భగవద్గీతను నిత్యం అధ్యయనం చేసేవారు..అందులో కొత్తగా ఏం చెప్పలేదని, ఈ ప్రపంచం స్వరూపం ఎలా ఉందో అర్థమయ్యేలా చెప్పిందని గ్రహిస్తారు. ఇలా ఉండాలి, అలా ఉండాలని గీత బోధించలేదు..కానీ..మీరు ఎలాంటి ఆలోచనలు, ప్రవర్తన, కర్మలను ఆచరిస్తే..ప్రతిష్ఠను పెంచుకుంటారో మాత్రం స్పష్టంగా చెప్పింది. భగవద్గీత చదివినవారు కొత్తగా ఏమీ నేర్చుకోరు కానీ జీవితాన్ని సాధారణంగా, సమతుల్యంగా గడపగల మార్గాన్ని తెలుసుకుంటాడు. 'గుణాలే గుణాలను ఆచరిస్తాయి' అని చెప్పినట్టు..మన సంకల్పాలు, ఆలోచనలు, కర్మలే మనలో స్వభావాలను నిర్మిస్తాయి. ప్రేమ, అహింస లాంటి సద్గుణాలు ఎలా వికసిస్తాయో గీత వివరిస్తుంది. కేవలం చదవడం, బోధించడం కాదు.. ఆ తత్వాన్ని గ్రహించాలి.

భగవద్గీత For GenZ, ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!

భగవద్గీత ప్రకారం ప్రేమికులు నాలుగు రకాలు

ఆర్తుడు

అర్ధార్థి

జిజ్ఞాసువు

జ్ఞాని

మొదటి మూడు రకాలవారి ప్రేమ తాత్కాలికం. జ్ఞానితో కూడిన ప్రేమ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. మీకు తత్వజ్ఞానం ఉంటే మీపై ప్రేమను వ్యక్తం చేసేవారి నిజస్వరూపాన్ని గుర్తించగలరు.