Nivin Pauly's Bethlehem Kudumba Unit OTT Platform Locked : బెత్లెహోమ్ కుటుంబ యూనిట్... ఓనమ్ సందర్భంగా మలయాళంలో ఆగస్ట్ 21న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇదే జోష్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా ఈ మూవీ శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ (Jio Hotstar) సొంతం చేసుకోగా... 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగుతో పాటు మలయాళంలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీ‌క్‌లో మూవీ స్ట్రీమ్ అవుతుందని టాక్.

'ప్రేమలు'తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన డైరెక్టర్ గిరీష్ ఏడీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రేమమ్ ఫేమ్ నివిన్ పౌలీ, ప్రేమలు, విశ్వనాథ్ అండ్ సన్స్ ఫేమ్ మమితా బైజు జంటగా నటించారు. వీరితో పాటు సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దిలీష్ పోతన్, ఫహాద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ తదితరులు నిర్మించారు.

Also Read : Ramba Oorvasi Menaka Movie Review - 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ: 'అల్లరి' నరేష్ సినిమా హిట్టా? ఫట్టా? ఫాంటసీ కామెడీ ఎలా ఉందంటే?