పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలతో ఖర్చులు పెరిగిపోతున్నాయని మిడిల్ క్లాస్ వారు ఎలక్ట్రికల్ వాహనాలు, CNG కార్ల వైపు వెళ్ల మొగ్గు చూపుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లు ఇప్పటికీ సామాన్యుల బడ్జెట్‌కు అందుబాటులో లేవు. అయితే CNG కార్లు తీసుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా, సిటీ రోడ్లపై ట్రాఫిక్‌లో కూడా ఈ కార్లు అద్భుతమైన మైలేజీని ఇస్తున్నాయి. దీని కారణంగా సీఎన్జీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. CNG అనేది పెట్రోల్ కంటే చౌకైన ఇంధనం. ప్రత్యేక ట్యాంక్‌లో నిల్వ చేస్తారు. అవసరానికి తగినట్లుగా, కారును పెట్రోల్ లేదా CNG రెండింటిలోనూ డ్రైవ్ చేయవచ్చు. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారు అందుకే కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కనుక రద్దీ ట్రాఫిక్‌లో కూడా అత్యుత్తమ మైలేజీని అందించే CNG కార్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

మైలేజీ విషయంలో ఈ CNG కార్లు బెటర్

మారుతి సుజుకీ సెలెరియో (Maruti Suzuki Celerio)

భారత్‌లో CNG కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయిస్తోంది. కంపెనీకి చెందిన అనేక కార్లు మైలేజీ పరంగా టాప్‌లో ఉన్నాయి. అత్యధిక మైలేజీనిచ్చే కార్లలో మారుతి సుజుకి సెలెరియో మొదటి స్థానంలో ఉంది. ఈ కారు 1 కిలో CNGకి 34.43 కిలోమీటర్ల వరకు వెళ్తుందని పేర్కొంది మరియు తక్కువ బడ్జెట్‌లో మంచి ఆప్షన్‌గా భావిస్తారు. మారుతి సుజుకి సెలెరియో 1.0 లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ 56.7 hp పవర్, 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు షోరూమ్ ధర దాదాపు రూ. 6.89 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

మారుతి సుజుకీ వాగన్ ఆర్ (Maruti Suzuki WagonR)

మైలేజీ కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్.. ఇది కిలోమీటరుకు దాదాపు 34 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఈ కారు చాలా కాలంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు నమ్మకమైన, ఇష్టమైన కారుగా ఉంది. ఇది తక్కువ స్థలంలో పార్క్ చేయవచ్చు. చిన్న ఫ్యామిలీకి సౌకర్యవంతంగా ఉంటుంది. వాగన్ ఆర్ కారు ధర రూ. 6.68 లక్షలకు ప్రారంభమై రూ. 7.13 లక్షల వరకు ఉంటుంది.

మారుతి సుజుకీ ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10)

ఎంట్రీ లెవెల్ విభాగంలో మారుతి సుజుకి ఆల్టో K10 కూడా బలమైన ఎంపికగా నిలిచింది. ఈ కారు కిలోమీటరుకు దాదాపు 33.85 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది మరియు మొదటిసారి కారు కొనుగోలు చేసేవారికి ఇది సరైనదిగా పరిగణించబడుతుంది. ఈ కారు ధర రూ. 5.90 లక్షల నుండి ప్రారంభమై రూ. 6.21 లక్షల వరకు ఉంటుంది.

మారుతి సుజుకీ డిజైర్ (Maruti Suzuki Dzire)

అదేవిధంగా, సెడాన్ విభాగంలో మారుతి సుజుకి డిజైర్ CNG లో మంచి మైలేజీ కార్లలో ఒకటి. ఇది దాదాపు 33 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. డిజైర్ కారు ధర దాదాపు రూ. 8.3 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఇతర ఫీచర్‌లు ఉన్నాయి.

మారుతి సుజుకీ స్విఫ్ట్ (Maruti Suzuki Swift)

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్ మంచి ఆప్షన్లో ఒకటి. మారుతి స్విఫ్ట్ కారు కిలోమీటరుకు దాదాపు 32 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుంది. ఈ కారు ధర రూ. 8.20 లక్షలకు ప్రారంభమై రూ. 9.20 లక్షల వరకు ఉంటుంది. ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ ధరలలో వ్యత్యాసం ఉంటుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రీమియం-క్వాలిటీ ఫీచర్‌లు ఉన్నాయి.