Best Hatchback Cars Under 10 Lakh: భారత్‌లో ఒక కారు కొనాలనుకునే సగటు వినియోగదారుడికి హ్యాచ్‌బ్యాక్ అనేది మొదటి ప్రాధాన్యత. ప్రస్తుతం మార్కెట్‌లో పది లక్షల లోపు ధరలో దాదాపు 18 రకాల హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేవలం పెట్రోల్‌ మాత్రమే కాకుండా, సీఎన్జీ, ఎలక్ట్రికక్ వేరియంట్లు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాప్ హ్యాచ్‌బ్యాక్ మోడల్స్

మార్కెట్‌ లీడర్లుగా ఉన్న కొన్ని కార్ల వివరాలు ఇలా ఉన్నాయి.

మారుతి సుజుకీ స్విఫ్ట్‌ :- ఇది రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షల మధ్య లభిస్తోంది. దీని మైలేజీ లీటరుు 24. 8 నుంచి 32. 9 కిలోమీటర్ల వరకు ఉండటం వల్ల ఇది అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది.

టాటా ఆల్ట్రోజ్‌ :- భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే వారి కోసం ఇది ఒక అద్భుతమైన ఎంపిక. దీని ధర 6. 30 లక్షల నుంచి 10.51 లక్షల వరకు ఉంది. పెట్రోల్, సీఎన్జీ, డీజిల్‌ వేరియంట్లలో లభించే ఏకైక కారు ఇది.

టయోటా గ్లాంజా అండ్‌ మారుతీ సుజుకి బాలెనో: -ఈ రెండు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు రూ. 5.99 లక్షల నుంచి 9.44లక్షల ధర పరిధిలో ఉన్నాయి. ఇవి 22.4 నుంచి 30.6కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తాయి.

హ్యూందాయ్‌ i20: టెక్నాలజీ, ఫీచర్లు కోరుకునే వారికి ఐ 20 సరైన ఎంపిక. దీని ధర రూ. 5.99 లక్షల నుంచి 11.53 లక్షల వరకు ఉంటుంది.

ఎలక్ట్రిక్‌ ఎంపికలు: బడ్జెట్‌ ధరలో ఎలక్ట్రిక్‌ కారు కావాలనుకునే వారి కోసం టాటా టియాగో ఈవీ , ఎంజీ కామెట్‌ అందుబాటులో ఉన్నాయి.

వినియోగదారులు వీటిని ఎందుకు ఎంచుకోవాలి?

హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు మూడు ఉన్నాయి. ఒకటి పొదుపు, భద్రత, సౌకర్యం.

మారుతి సెలెరియో గరిష్టంగా 34.4 కిలోమీటర్ల ఆల్టో కే 10 ౩౩. 9 కిలోమీటర్లు మైలేజీని ఇస్తున్నాయి. ఇది మధ్యతరగతి వినియగదారులకు ప్రధాన ఆకర్షణ.

నేటి కార్లలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న 11 హ్యాచ్‌బ్యాక్‌ మోడల్స్‌ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్నాయి. అలాగే ఏబీఎస్‌,సెంట్రల్‌ లాకింగ్ వంటివి దాదాపు అన్ని మోడల్స్‌లోనూ ఉన్నాయి.

ఆధునిక ఫీచర్లు: పది లక్షల లోపు ధరలోనే నేడు సన్‌రూఫ్‌, 360 డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్‌ ఆటో/ ఆపిల్‌ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్‌్ ఛార్జింగ్‌ వంటి విలాసవంతమైన ఫీచర్లు లభిస్తున్నాయి.

కొత్తగా రాబోతున్న మోడల్స్‌

మీరు కొద్ది రోజులు ఎదురు చూస్తే మరిన్ని ఆసక్తికరమైన మోడల్స్‌ మార్కెట్‌లోకి రానున్నాయి.

టాటా టియాగో ఈవీ ఫేస్‌లిప్ట్‌:- ఇది 2026 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని అంచనా ధర 8.10 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు. లీప్‌ మోటర్‌ టీ 03: 2027 సరికొత్త ఎలక్ట్రిక్‌ హ్యాచ్‌బ్యాక్‌ లీప్‌మోటర్ నుంచి రాబోతోంది.

సరైన కారును ఎలా ఎంచుకోవాలి?

మీకు అధిక మైలేజీ కావాలంటే మారుతి సుజుకి సెలెరియో లేదా వాగన్ ఆర్‌ సరైనవి. మీ ప్రాధాన్యత భద్రత అయితే టాటా ఆల్ట్రోజ్‌ లేదా టియాగోను పరిశీలించండి. ప్రీమియం ఫీచర్లు, విశాలమైన క్యాబిన్ కావాలంటే హ్యూందాయ్‌ ఐ20 లేదా బ్యాలెనోను ఎంచుకోవచ్చు.