Beer in Summer : వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

1 month ago 5
ARTICLE AD

Beer Side Effects in Heavy Heat : చాలామంది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బీర్ తాగితే.. భలే చల్లగా ఉంటాది అని చెప్తారు. కానీ అది నిజంగా శరీరాన్ని చల్లబరుస్తుందా? లేదా కేవలం అలా అనిపిస్తుందా? దీనికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు నిపుణులు. అదేంటంటే.. వేసవిలో బీర్ తాగితే అది శరీరాన్ని చల్లబరచదట.. నిజం చెప్పాలంటే అది మిమ్మల్ని మరింత వేడిగా చేస్తుందట. అలా ఎందుకు జరుగుతుందో.. మరి బీర్ తాగితే కూల్ ఫీలింగ్ ఎందుకు వస్తుందో.. ఇప్పడు తెలుసుకుందాం.

బీర్ తాగినప్పుడు బాడీలో ఏమి జరుగుతుంది?

బీర్ చర్మంలోని రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. దీంతో రక్తం చర్మం వైపు వచ్చి.. స్కిన్ వెచ్చగా అనిపిస్తుంది. మెదడు దీన్ని చల్లగా ఉన్నట్టు చెప్తుంది. కానీ శరీరం వేడిని బయటకు వదిలేస్తుంది. అందుకే బీర్ తాగితే చల్లగా ఉంది అనుకుంటారు. కానీ చర్మం నుంచి వేడి వెళ్లిపోతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గదు. ఇంకా హీట్ జెనరేట్ అవుతుంది.

అలాగే ఆల్కహాల్ పిట్యూటరీ గ్రంధి నుంచి ADH (anti-diuretic hormone) విడుదలను నిరోధిస్తుంది. దీనివల్ల కిడ్నీ ఎక్కువగా నీళ్లు బయటకు పంపిస్తుంది. దీనివల్ల డీహైడ్రేట్ అవుతారు. వేడి పెరగడంతో శరీరం చెమట ద్వారా చల్లగా అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ చెమట మరింత ఎక్కువై డీహైడ్రేషన్​కు దారితీస్తుంది. హీట్ స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుంది.

అధ్యయనాలు ఏమి చెప్తున్నాయంటే..

బీర్ తాగిన తర్వాత మొదటి 20 నిమిషాలు చల్లగా అనిపిస్తుంది. కానీ తర్వాత శరీరపు ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. వేసవిలో ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందంట. అవేంటంటే..

వేసవిలో బీర్ తాగితే వచ్చే నష్టాలు

సమ్మర్లో బీర్ తాగితే డీహైడ్రేషన్​కి గురి అవుతారు. దీనివల్ల తల నొప్పి, నోరు ఎండిపోవడం జరుగుతాయి. తల తిరగడం, వికారం, అలసట వేగంగా వస్తాయి. బాడీ హీట్ పెరుగుతుంది. సన్​స్ట్రోక్ ప్రమాదం రెండింతలు అవుతుంది. గుండెపై ఒత్తిడి పెరిగి.. బీపీలో మార్పులు వస్తాయి. శరీరం వేగంగా అలసిపోతుంది. వాంతులు కావచ్చు. అలాగే శరీరం ఎక్కువగా ఆల్కహాల్​ అబ్జార్బ్ చేసుకుంటుంది. దీంతో తక్కువ తాగినా.. కిక్ ఎక్కువగా ఎక్కేస్తుంది.

బీర్ తాగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మరి సమ్మర్లో బీర్ తాగాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. అదేంటంటే.. మీరు ప్రతి బీర్​కి ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఇది డీహైడ్రేట్ సమస్యలను తగ్గిస్తుంది. డ్రింక్ చేస్తూ మధ్యలో నీళ్లు తాగితే హ్యాంగోవర్ కూడా ఉండదు. ఖాళీ కడుపుతో బీర్ తాగకపోవడమే మంచిది. ఏదైనా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుని.. తర్వాత తాగితే బెటర్. ఎండలో కాకుండా ఏసీ లేదా నీడ ఉన్న ప్రదేశంలోనే తాగండి. ఎండలో తాగితే హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరగవచ్చు.

మీ స్టామినా కంటే తక్కువ తాగితే మంచిది. అలాగే బీర్ తాగిన వెంటనే బయటకు వెళ్లకండి. కనీసం 30 నుంచి 45 నిమిషాలు తర్వాత వెళ్లండి. బీర్ తాగిన తర్వాత నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు, లేదా ORS తాగితే శరీరం కోల్పోయిన్ ఎలక్ట్రోలైట్స్ తిరిగి వస్తాయి. అలాగే తాగిన తర్వాత డ్రైవ్ చేయడం అత్యంత ప్రమాదకరం. కాబట్టి బయటకు వెళ్లాల్సి వస్తే క్యాబ్ బుక్ చేసుకోండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Read Entire Article