BCCI Reviews Team India Performance And Injuries: టీమిండియా ఇటీవల కనబరిచిన ప్రదర్శనలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముంబైలోని తమ ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీకి టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు. వీరితో పాటు బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్, సెక్రటరీ దేవజిత్ సైకియా, ట్రెజరర్ ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, తాత్కాలిక సీఈవో హేమాంగ్ అమీన్ అటెండ్ అయ్యారు. వాస్తవానికి ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఎదురైన సిరీస్ ఓటములను సమీక్షించేందుకు ఈ మీటింగ్ జూలైలోనే జరగాల్సి ఉండగా, జింబాబ్వే, శ్రీలంక టూర్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

Read Also: BCCI Fitness Mandate: అఫ్గాన్ సిరీస్ స్క్వాడ్‌లో ఆ నలుగురి ఎంపిక‌పై డౌట్.. బీసీసీఐ కొత్త రూల్‌తో సరికొత్త మార్పు

స‌మ‌గ్ర విశ్లేష‌ణ‌..
గత కొన్ని నెలలుగా జట్టు సాధించిన ఫలితాలు, లోపాలను సరిదిద్దుకునే అంశాలపై సమావేశంలో సమగ్రంగా చ‌ర్చ‌లు చేశారు. సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనలను బేరీజు వేస్తూనే, రాబోయే సవాళ్లకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయడంపై బోర్డు పెద్దలు దృష్టి సారించారు. న్యూజిలాండ్ మల్టీ-ఫార్మాట్ టూర్, స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, 2027 మెన్స్ వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలకు సంబంధించిన బ్లూప్రింట్ ను ఈ భేటీలో రెడీ చేశారు. టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనలు, కోచ్ గంభీర్ వ్యూహాలను బోర్డు అడిగి తెలుసుకుంది.

Read Also: Krunal Comeback Hope: అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు

అదే ప్ర‌ధాన అజెండా..
అగ్రశ్రేణి క్రికెటర్ల వరుస గాయాల బెడద ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా చ‌ర్చించారు. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్ జట్టును ప్రకటించినప్పుడు జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాల పేర్లను కేవలం ప్రొవిజనల్‌గా ఎంపిక చేయడం ఫిట్‌నెస్ సంక్షోభాన్ని స్పష్టం చేసింది. మ్యాచ్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే వీరిని బరిలోకి దించనున్నారు. ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని సీవోఈ హెడ్ లక్ష్మణ్‌ను బోర్డు ఆదేశించింది.

పాండ్యాపై చర్చ..
స్వదేశంలో భారత్ 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టడంపై సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్ విస్తృతంగా సమీక్షించారు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో హార్దిక్ కీలక పాత్ర పోషించాల్సి ఉన్నప్పటికీ, అతడిని తరచూ వేధిస్తున్న గాయాలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ఇటీవల పిక్క కండరాల గాయంతో ఇబ్బంది పడటం వల్ల 50 ఓవర్ల ఫార్మాట్‌లో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా అతడు పూర్తి కోటా ఓవర్లు వేయగలడా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే సిరీస్‌ల కోసం జట్టు సమతుల్యతను కాపాడుతూ ముందడుగు వేయాలని యాజమాన్యం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.