Bandla Ganesh Launches New Banner BG Blockbusters : ఇండస్ట్రీలో నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ హీరోస్‌తో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తీశారు బండ్ల గణేష్. కొద్ది రోజులు పాలిటిక్స్‌పై ఫోకస్ చేసి సినిమాలకు కాస్త దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత నిర్మాతగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

న్యూ బ్యానర్

'బిజి బ్లాక్ బస్టర్స్' (BG Blockbusters) పేరిట న్యూ బ్యానర్‌ను స్టార్ట్ చేశారు బండ్ల గణేష్. ఈ విషయాన్ని ఆయన ఆన్ లైన్ వేదికగా షేర్ చేసుకున్నారు. స్టోరీ చెప్పడంలో డెడికేషన్, నిజాయితీ ఉండే వారికి ఈ బ్యానర్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి, డిఫరెంట్ స్టోరీస్ స్వీకరించేందుకు ఈ బ్యానర్ కట్టుబడి ఉందని అన్నారు ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కొత్త బ్యానర్‌లో ఫస్ట్ మూవీ స్టార్ హీరోతో తీస్తారా లేక కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Also Read : 'సితార'తో స్టార్ బాయ్ సిద్ధూ హ్యాట్రిక్ - ఆ రెండూ పక్కన పెట్టి కొత్త మూవీ

స్టార్ హీరోస్... బిగ్గెస్ట్ హిట్స్

నటన తర్వాత 'పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్' బ్యానర్‌ను ప్రారంభించిన బండ్ల గణేష్... మాస్ మహారాజ రవితేజ 'ఆంజనేయులు' మూవీతో నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ ఓ మాదిరి విజయం సాధించినా రవితేజ, బ్రహ్మానందం కామెడీ అదిరిపోయింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' తీశారు.

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీతో ఆయన సక్సెస్ ఫుల్ నిర్మాతగా మారారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో 'బాద్‌షా', 'టెంపర్', అల్లు అర్జున్‌తో 'ఇద్దరమ్మాయిలతో' మూవీలు నిర్మించారు. కాస్త బ్రేక్ తీసుకుని మళ్లీ ఇప్పుడు మరో న్యూ బ్యానర్‌తో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. 'బిజి బ్లాక్ బస్టర్స్' బ్యానర్‌లో ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ లాక్ అయ్యిందని... త్వరలోనే దీనిపై అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.