కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ (Bandi Bhagirath Case Latest Update) మీద నమోదైన పోక్సో కేసు వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. మంత్రిగా అధికార, రాజకీయ పలుకుబడి ఉపయోగించి తన కుమారుడిని బండి సంజయ్ రక్షిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇంటి పేరు ఉన్న నటుడు సరోజ్ కుమార్ సైతం విమర్శించారు (Bandi Saroj Kumar Tweet On Bandi Bhagirath).

పోక్సో కేసుపై ప్రజలు రెండు వర్గాలు చీలిపోయారు. బండి భగీరథను సపోర్ట్ చేస్తున్న జనాలు ఉన్నారు. విమర్శిస్తున్న వాళ్ళూ ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎక్కువ మంది మౌనం వహించారు. బండి బగీరథపై మంచు మనోజ్ ఒక్కరే స్పందించారు. ఇప్పుడు ఆ లిస్టులో పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ చేరారు. బండి భగీరథపై పరోక్షంగా ఆయన ట్వీట్ చేశారు.

అమ్మాయి బాగుంది... మూసుకొని పెళ్లి చేసుకో!
''అమ్మాయి బాగుంది... మూసుకొని నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకో. వాళ్ల పేరెంట్స్ గురించి లైట్ తీస్కో. అన్నీ సెట్ అయిపోయి హ్యాపీ ఎండింగ్ ఉంటది. ఈ సొసైటీకి ఒక ఎగ్జైటింగ్ రివేంజ్ లవ్ స్టోరీ'' అని బండి సరోజ్ కుమార్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. లవ్ సింబల్ ఎమోజీతో పాటు రెండు చేతులు పైకి లేపుతూ అంగీకారాన్ని తెలిపే మరొక ఎమోజీ కూడా జోడించారు.

Also Read: Suriya Hit Movies On OTT: సూర్య టాప్ 10 హిట్ సినిమాలు... ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ & స్ట్రీమింగ్ డీటెయిల్స్

అమ్మాయి బాగుంది... మూసుకొని నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకో. వాళ్ల పేరెంట్స్ గురించి లైట్ తీస్కో. అన్నీ సెట్ అయిపోయి happy ending ఉంటది, with an exciting revenge Love Story ❤️🙌🏻 for this society.

— Bandi Saroj Kumar (@publicstar_bsk) May 14, 2026

మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావా ఏంటి?
బండి సరోజ్ కుమార్ చేసిన ట్వీటులో భగీరథ పేరు ఎక్కడా లేదు. కానీ, అతను ఉద్దేశం ఏమిటో నెటిజనులకు అర్థమైంది. దాంతో మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నావా? అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. మరొక నెటిజన్ అయితే 'మూసుకో లత్కోర్' అని తిట్టారు.

Also Read: కమల్‌ వల్ల కాలేదు... రజనీ రాలేదు... 60 ఏళ్ళ ద్రావిడ ప్రభుత్వాలను విజయ్ ఎలా ఓడించాడు? సక్సెస్ ఫార్ములా ఏంటి?

Ammayi istam tho panileda? Ammayi ki kastam edo vachindi ane kada case varaku vellindi.. Etla shame chestunaro chusav Etla character assassination chestunaro chusav ga pics share chesi.. mind unda?

— Seeker (@drwatson_sh) May 14, 2026

'అమ్మాయి ఇష్టంతో పని లేదా? అమ్మాయికి కష్టం వచ్చిందనే కదా కేసు వరకూ వెళ్ళింది. అమ్మాయి వ్యక్తిత్వ హననానికి ఎలా పాల్పడుతున్నారో చూశావా? అసలు నీకు మైండ్ ఉందా? అని సరోజ్ కుమార్ బండిని మరొక నెటిజన్ ప్రశ్నించాడు. వ్యంగ్యంగా చేసిన ట్వీట్ అయితే ఓకే కానీ అంతకు మించి అయితే ఇంకో ఎడ్డి పాయింట్ ఉండదని మరొకరు తెలిపారు. ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోమని మరొకరు సలహా ఇచ్చారు. బండి భగీరథ కేసు నేపథ్యంలో అతనిపై వర్మ గతం చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు బండి భగీరథ పోక్సో కేసుపై ఎవరు స్పందిస్తారో చూడాలి.

బండి సరోజ్ కుమార్ విషయానికి వస్తే... ఆయన చేసిన ఇండిపెండెంట్ ఫిల్మ్ 'మాంగల్యం'కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా నటించిన 'మోగ్లీ'లో (సినిమా రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి) విలన్ రోల్ చేశారు. అందులో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. నెక్స్ట్ ఏ సినిమాలో నటిస్తారో చూడాలి.

Also Read: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి