Balka Suman arrest: క్యాతన్ పల్లిలో తీవ్ర ఉద్రిక్తత - బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

2 months ago 5
ARTICLE AD
<p>Police arrest Balka Suman: మంచిర్యాల జిల్లా క్యాతన్&zwnj;పల్లిలో గత రెండు రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింతగా విషమించాయి. &nbsp;బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్&zwnj;ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. క్యాతన్&zwnj;పల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణలు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం , స్థానిక ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. బాల్క సుమన్&zwnj;తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రామకృష్ణాపూర్ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.</p> <p>క్యాతన్&zwnj;పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక &nbsp;విషయంలో రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి వినోద్ కారుపైనా దాడి చేశారు. &nbsp;ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. &nbsp;ప్రస్తుతం బాల్క సుమన్&zwnj;ను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. &nbsp;అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలతో మంచిర్యాల జిల్లా రాజకీయాల్లో వేడి పెరిగింది. &nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/amravati/this-government-school-in-amaravati-is-of-international-range-238382" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article