Bajaj Freedom 125 CNG Bike: భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. నిత్యం కార్యాలయాలకు వెళ్లేవారు, డెలివరీ ఏజెంట్లు, మధ్యతరగతి ప్రజలు తక్కువ ఖర్చు(Best mileage bikes in India)తో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో ఒక వినూత్న పరిష్కారం చూపింది. అదే బజాజ్ ఫ్రీడమ్‌ 125(Bajaj Freedom 125 CNG Bike). ఇది భారత్‌లోనే మొదటి ఏకైక సీఎన్జీ ఆధారిత మోటార్ బైక్(India's first CNG motorcycle).

దేశంలోనే తొలి సీఎన్జీ బైక్

బజాజ్ ఫ్రీడమ్‌ 125 అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డ్యూయల్‌ ఫ్యూయల్‌(Dual fuel bike) సాంకేతికతతో రూపొందించిన మోటార్ సైకిల్. అంటే ఈ బైక్‌ సీఎన్జీతోపాటు పెట్రోల్‌తో కూడా నడుస్తుంది. సాధారణంగా మనం కార్లలో సీఎన్జీ కిట్లను చూస్తుంటాం. కానీ టూ వీలర్‌ రంగంలో ఈ తరహా ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేసిన ఘనత బజాజ్‌కు దక్కింది. ఈ బైక్ ప్రధానంగా సీఎన్జీ మోడల్‌లో స్టార్ట్ అవుతుంది. ఇది వినియోగదారుడికి ఇంధన ఖర్చులను గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

Also Read: టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ ఏఎంటీ కారు కొనాల‌నుకుంటున్నారా..? ఈఎమ్ఐ వివరాలు ఇవే.!

ట్యాంక్ ఫుల్ చేస్తే 330 కిలోమీటర్లు దూసుకెళ్లడమే

ఈ బైక్ అతి పెద్ద ప్రత్యేకత దాని ఇంధన సామర్థ్యం(CNG bike mileage). సీఎన్జీ మోడ్‌లో ప్రయాణించేటప్పుడు ఈ బైక్‌ 102 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇక పెట్రోల్ విషయానికి వస్తే లీటర్‌ 65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సీఎన్జీ, పెట్రోల్ రెండూ కలిసి ఉపయోగిస్తే ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే సుమారు 330 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్(Bajaj Freedom features)

బైక్ నడుపుతున్నప్పుడు పెట్రోల్ నుంచి సీఎన్జీకి లేదా సీఎన్జీ నుంచి పెట్రోల్‌కు మారడం చాలా సులభం. దీని కోసం హ్యాండిల్‌బార్‌పైనే ఒక ప్రత్యేక స్విచ్ ఏర్పాటు చేశారు. ప్రయాణంలో సీఎన్జీ అయిపోయినా, పెట్రోల్ బ్యాకప్‌ ఉండటం వల్ల ప్రయాణికులు ఎక్కడైనా ఆగిపోతామనే భయం లేకుండా ట్రావెల్ చేయవచ్చు.

Also Read: కారు మైలేజ్ పెంచుకోవడానికి బెస్ట్ టిప్స్ - ఈ చిన్న మెయింటెనెన్స్ జాగ్రత్తలతో ఫ్యూయెల్ ఆదా చేసుకోండి

టాప్ నాచ్ టెక్నాలజీ

బజాజ్ ఫ్రీడమ్ 125 కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా పని తీరులో కూడా రాజీ పడకుండా రూపొందించామని కంపెనీ చెబుతోంది. ఇందులో 124.58cc ఇంజిన్ అమర్చారు. ఇది 9.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సులభమైన ప్రయాణం కోసం దీనికి 5 స్పీడ్ గేర్ బాక్స్‌ను జత చేశారు. ఈ బైక్ హై ఎండ్‌ వేరియంట్లలో ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, డిజిట్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు లభిస్తాయి. నగరం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా నడపడానికి వీలుగా, స్పోర్టీగా, ప్రాక్టికల్‌గా ఉండేలా డిజైన్ చేశారు.

సెక్యూరిటీలోనూ తగ్గేదేలే

భద్రతపై కూడా బజాజ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎన్జీ ట్యాంక్‌ను అత్యంత పటిష్టమైన ట్రెల్లిస్ ఫ్రేమ్ లోపల అమర్చారు. దీని వల్ల ఏదైనా ప్రమాదం జరిగినా, ట్యాంక్‌కు ఎలాంటి హాని జరగదు. ఈ బైక్, ట్యాంక్‌కు అనేక పరీక్షలు పెట్టారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో మోనోషాక్ సెటప్‌ అందించారు. మెరుగైన నియంత్రణ కోసం డిస్క్ బ్రేక్‌ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

Also Read: బీవైడీ నుంచి సరికొత్త ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ - లాంచ్‌కు ముందే రోడ్లపై ప్రత్యక్షం!

బజాజ్‌ ఫ్రీడమ్ 125 వివిధ వేరిటయంట్లలో లభిస్తుంది. దీనిప్రారంభ ధర(Bajaj Freedom 125 price in India) సుమారు 95వేల నుంచి ఉంటుంది. ఆఫీసులకు వెళ్లే వారు, తక్కువ బడ్జెట్‌లో బైక్ కొనాలనుకునే వారు, డెలివరీ వ్యాపారం చేసే వారికి ఇది మంచి ఎంపిక కానుంది.