పెట్రోల్ ధరలు దిగువ మధ్య తరగతి వారికే కాదు మధ్య తరగతి వారికి సైతం నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపుతాయి. దాంతో నగరాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతిరోజూ ఆఫీసు, కాలేజీ లేదా మార్కెట్‌కు వెళ్లవలసి వస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు చవకైన, సౌకర్యవంతమైన ఎంపికగా మారింది. ఈ విభాగంలో Bajaj Chetak 3001 ఎలక్ట్రిక్ స్కూటీ, టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube 2.2 kWh) అత్యంత ప్రాచుర్యం పొందిన రెండు మోడల్స్. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు స్మార్ట్ ఫీచర్లు, రేంజ్, అద్భుతమైన డిజైన్‌తో వస్తాయి. అయితే మీ కోసం ఏది బెటర్ అని సందేహాలుంటే ఇక్కడ వివరాలు తెలుసుకుంటే సరి.

బడ్జెట్‌లో ఏది బెటర్ ?0

ముందుగా ధర గురించి మాట్లాడితే, Bajaj Chetak 3001 ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 99,990. దీంతో పోలిస్తే టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube 2.2 kWh) కొంచెం చౌకగా ఉంటుంది. దీని ధర రూ. 94,434 నుంచి ప్రారంభమవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ కొంచెం తక్కువగా ఉంటే iQube మీకు మంచి ఎంపిక కావచ్చు. చాలా రాష్ట్రాల్లో EVలపై సబ్సిడీ కూడా లభిస్తుంది. ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయని గుర్తుంచుకోండి. కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ నగరం గురించి సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోండి.

రేంజ్, బ్యాటరీలో ఏది పవర్‌ఫుల్?

ఇప్పుడు కిలోమీటర్ల రేంజ్, బ్యాటరీని పరిశీలిస్తే... Chetak 3001లో 3.2 kWh బ్యాటరీ ఉంది. ఇది ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 127 కి.మీ వరకు నడుస్తుంది. ఇది పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి దాదాపు 3.5 గంటల సమయం పడుతుంది. మరోవైపు టీవీఎస్ iQubeలో 2.2 kWh బ్యాటరీ ఉంది. దీని పరిధి దాదాపు 100 కిమీ. కానీ ఇది కేవలం 2.5 గంటల్లో పూర్తి ఛార్జింగ్ అవుతుంది. సుదూర ప్రయాణాల కోసం బజాజ్ Chetak మంచిది. అయితే రోజువారీ ప్రయాణాల కోసం చెతక్, iQube రెండూ సరిపోతాయి. .

ఫీచర్లు, టెక్నాలజీ

రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు టెక్నాలజీ, ఫీచర్ల పరంగా అద్భుతంగా ఉన్నాయి. Bajaj Chetak 3001 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. OTA అప్‌డేట్‌లు, IP67 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ బ్యాటరీతో పాటు రివర్స్ మోడ్ వంటి మోడ్రన్ ఫీచర్లను కలిగి ఉంది. అదే సమయంలో టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube 2.2 kWh) పెద్ద TFT స్క్రీన్, నావిగేషన్ అసిస్ట్, కాల్ అలర్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, రైడ్ నెంబర్లు వంటి అనేక ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. బజాజ్ Chetak క్లాసిక్ డిజైన్, దృఢత్వాన్ని అందిస్తుంది. అయితే టీవీఎస్ iQube ఎల్ట్రిక్ స్కూటర్లు టెక్నాలజీని ఎక్కువ ఇష్టపడే రైడర్‌లకు మంచి చాయిస్.