Bajaj Chetak 3501 vs River Indie comparison: పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవడానికి సగటు భారతీయ వినియోగదారులు వేగంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు షిప్టు అవుతున్నారు. దీన్ని గమనించిన కంపెనీలు భారీగా సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. అలాంటి వాటిలో బజాజ్‌ నుంచి చేతక్‌, రివర్ కంపెనీ నుంచి ఇండీ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఈ రెండింటిలో ఏది మీ డబ్బుకు సరైన విలువను ఇస్తుందో లోతుగా పరిశీలిద్దాం.

భారత్‌ ఆటోమొబైల్ మార్కెట్‌లో నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. పెట్రోల్ సంక్షోభం సామాన్యుడి ఆలోచనలు మార్చేస్తోంది. ఆ సెగ నుంచి తప్పించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపుతున్నాడు. దీన్ని గమనించిన కంపెనీలు భారీగానే మోడల్స్‌ను మార్కెట్‌లోకి డంప్ చేస్తున్నాయి. ఈ డంప్‌లో ఏది ఎంచుకోవాలో అనేది చాలా మందికి అంతుపట్టడం లేదు. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్లో ఒక మోడల్‌ పిక్ చేయాలంటే మాత్రం చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. భారీగా అందుబాటులో ఉన్న మోడల్స్‌లో బజాజ్ చేతక్ 3501, రివర్ ఇండి గట్టి పోటీ ఇస్తున్నాయి. అయితే ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవాలంటే మాత్రం చాలా రివ్యూలు చూడాల్సి వస్తోంది.

బజాజ్ చేతక్ అంటే నేటి తరానికి పెద్దగా పరిచయం లేదు కానీ నాటి తరం వారికి ఇదో ఎమోషన్. దశాబ్దాల కాలంగా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో నియో-రెట్రో స్టైల్‌తో మార్కెట్‌లోకి పునఃప్రవేశం చేసింది. రివర్ అనే స్టార్టప్ తన ఇండీ మోడల్‌ రోడ్లపైకి తీసుకొచ్చింది. ఇది వచ్చీరాగానే స్కూటర్లలో SUVగా పేరు తెచ్చుకుంది. ఈ రెండు ఈవీలు కూడా ఒకే ధర మోడ్‌లోకి వస్తాయి. కానీ వినియోగదారులు, ఒకటి స్టైల్‌గా కనిపిస్తే, మరొకటి యుటిలటీపై ఫోకస్ చేసింది. మీరు ముందుగా వ్యత్యాసాలు అర్థం చేసుకుంటే డబ్బుకు సరైన విలువనిచ్చే వాహనాన్ని మీరు ఎంచుకోవచ్చు.

ధరలో వ్యత్యాసం ఎంత

బజాజ్ చేతక్ 3501ధర రూ. 1,44,305, రివర్ ఇండీ రూ.1,52,399లకు లభిస్తుంది. రివర్ ఇండీతో పోలిస్తే బజాజ్ చేతక్ సుమారు రూ. 8,000 తక్కువ ధరకే లభిస్తోంది. వారంటీ విషయానికి వస్తే చేతక్ 3 ఏళ్లు లేదా 50,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తోంది. రివర్ 3 ఏళ్లు లేదా 30,000 కిలోమీటర్లకే వారంటీ ఇస్తోంది. అంతేకాకుండా తన వినియోగదారుల కోసం 8 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు పొడిగించిన వారంటీ ప్లాన్ ఒకటి రివర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

డిజైన్, నిర్మాణంలో ఉన్న తేడాలు

బజాజ్ చేతక్ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మెటల్ బాడీతో బజాజ్ చేతక్ 3501ను తీసుకొచ్చింది. అంతే కాకుండా లేటెస్ట్ ఫినిషింగ్‌ను కూడా అందిస్తోంది. ఈ బండి సీటు ఎత్తు 775mm. పొట్టిగా ఉన్న వాళ్లకి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.

రివర్ ఇండీ పూర్తిగా భిన్నమైన బాక్సీ డిజైన్‌తో ఉంటుంది. దీనిని రగ్గడ్ లుక్ యూత్‌ను ఆకట్టుకుంటుంది. 14-అంగుళాల పెద్ద చక్రాలు, విశాలమైన బాడీతో ఇది ఒక SUV మాదిరి ఫీలింగ్ ఇస్తుంది. దీని బరువు 143 కేజీలు కాగా, చేతక్ 134 కేజీలే. అంటే ట్రాఫిక్‌లో చేతక్ సులభంగా నడపవచ్చు. హైవేలపై మాత్రం రివర్ ఇండీ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తోంది.

పర్ఫార్మెన్స్ -బ్యాటరీ సామర్థ్యం

టెక్నాలజీ విషయానికి వస్తే రివర్ ఇండీ ముందంజలో ఉంటుంది. ఇది 6.7kW పీక్ పవర్‌ను ఉత్పత్తి చేసే ఇంజిన్‌కు కలిగి ఉంది. చేతక్ 3501 కేవలం 4.2kW వరకు మాత్రమే వెళ్లగలదు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాలంటే మాత్రం ఇండీని మీ ఇంటికి తెచ్చుకోవాలి. చేతక్ వేగం కేవలం గంటకు 80 కిలోమీటర్లే. రివర్ ఇండీలోని 4kWh బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే 163కిలోమీటర్లు ఆగకుండా సాగిపోవచ్చు. చేతక్ 3.5kWh బ్యాటరీతో వస్తోంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 153 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు.

ఛార్జింగ్ పరంగా చూస్తే చేతక్ చాసా స్పీడ్ చార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంది. ఇది ఇంట్లో 3 గంటల్లో 0-80% ఛార్జ్ అవుతుంది. రివర్ ఇండీ DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది లాంగ్ జర్నీలో ఉపయోగకరంగా ఉంటుంది. బజాజ్ చేతక్ 3501లో TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంది. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. స్టోరేజీ విషయంలో రివర్ ఇండీ ముందంజలో ఉంది. దీని స్టోరేజ్ 43 లీటర్లు, ముందు భాగంలో మరో 12 లీటర్ల గ్లోవ్‌బాక్స్ ఉంది. చేతక్‌లో స్టోరేజ్ కేవలం 35 లీటర్లే. రివర్ ఇండీ డిస్క్ బ్రేకులతో వస్తుంది. చేతక్‌లో వెనుక చక్రాలకే డ్రమ్ బ్రేక్స్‌ ఉన్నాయి.

ఎవరికి ఏది సెట్ అవుతుంది?

రోజూ ఆఫీసుకి వెళ్లేవాళ్లకు, సిటీ ట్రాఫిక్‌లో సులభంగా వెళ్లేందుకు ఒక స్టైలిష్, మెటల్ బాడీ స్కూటర్ కావాలనుకుంటే బజాజ్ చేతక్ 3501 సరైన ఎంపిక అవుతుంది. ఎక్కువ సామాన్లు మోయాల్సి ఉన్నా, రఫ్ అండ్ టఫ్ రోడ్లపై ప్రయాణించేందుకు పవర్‌ఫుల్ స్కూటర్ కావాలంటే రివర్ ఇండీ సరిపోతుంది.