Naga Shaurya's Bad Boy Karthik OTT Streaming : రంగబలి తర్వాత మూడేళ్ల గ్యాప్‌తో 'బ్యాడ్ బాయ్ కార్తీక్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు యంగ్ హీరో నాగశౌర్య. ఏప్రిల్ 17న రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అసలు వచ్చిన సంగతే ఎవరికీ తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలో ప్రత్యక్షమైంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

నాగశౌర్య రీసెంట్ యాక్షన్ డ్రామా 'బ్యాడ్ బాయ్ కార్తిక్' ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. రామ్ దేశినా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్, సాయి కుమార్, నరేష్, సముద్రఖని, వెన్నెల కిశోర్ కీలకపాత్రల్లో కనిపించారు. చాలా రోజుల గ్యాప్ తీసుకుని చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Also Read : దేశవ్యాప్తంగా పెద్ది మేనియా - చరణ్ విత్ బుచ్చిబాబు డ్రైవ్... ఈ నగరాల్లో ఈవెంట్స్

స్టోరీ ఏంటంటే?

వైజాగ్ లో ఉండే కార్తిక్ (నాగశౌర్య)కు అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. లాయర్ అయిన ఆమె రాయలసీమలోని కదిరి ప్రాంతంలో భూ కబ్జాలు చేసే గోవిందప్ప (మైమ్ గోపి), వరదారెడ్డి (సముద్రఖని)లపై న్యాయపోరాటం చేస్తుంది. దీంతో ఆమెపై దాడులు చేయిస్తారు. ఈ విషయం తెలిసిన కార్తీక్ రాయలసీమకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తమ్మడిని ఎంతో ప్రేమగా చూసుకునే అక్క ఎందుకు అతనిపై కోప్పడింది? గోవిందప్ప, వరదా రెడ్డిల మధ్య వైరం ఎందుకు ఏర్పడింది? తన అక్కను కార్తీక్ ఎలా కాపాడుకున్నాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : శుక్రవారం ఓటీటీలో కొత్త మూవీస్ సందడి - ధురంధర్ 2 నుంచి కర్తవ్య... ఒకే రోజు 16 సినిమాలు

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.