Axar Patel Car Collection 2026: టీమ్ ఇండియా నమ్మదగ్గ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటారో, ఆయన కార్ల ఎంపిక కూడా అంతే హుందాగా ఉంటుంది. హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా కంఫర్ట్, పర్ఫార్మెన్స్ ఇచ్చే లగ్జరీ ఎస్‌యూవీలను ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. ప్రస్తుతం అక్షర్ పటేల్ గ్యారేజీలో ఉన్న వాహనాలు ఆయన అభిరుచికి అద్దం పడుతున్నాయి. వివిధ రిపోర్టుల ప్రకారం అక్షర్ వద్ద ఉన్న టాప్ 3 కార్ల విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (Range Rover Autobiography)

అక్షర్ పటేల్ కార్ల కలెక్షన్‌లో అత్యంత ఖరీదైనది, విలాసవంతమైనది రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ. దీని ధర సుమారు రూ. 3.5 కోట్లు పైమాటే. రాజసం ఉట్టిపడే ఈ కారు ప్రయాణంలో అద్భుతమైన సౌకర్యాన్ని అందిస్తుంది. ఆఫ్-రోడ్ సామర్థ్యంతో పాటు అత్యున్నత స్థాయి లగ్జరీ ఫీచర్లు ఈ ఎస్‌యూవీ ప్రత్యేకత. సెలిబ్రిటీల ఫేవరెట్ ఛాయిస్ అయిన ఈ కారు అక్షర్ కలెక్షన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

ల్యాండ్ రోవర్ డిస్కవరీ (Land Rover Discovery)

అక్షర్ పటేల్ కొనుగోలు చేసిన మొట్టమొదటి లగ్జరీ ఎస్‌యూవీలలో ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఒకటి. ఇది ఇప్పటికీ ఆయన గ్యారేజీలో కీలకమైన వాహనంగా ఉంది. విశాలమైన క్యాబిన్, ఏ రకమైన రోడ్డుపైనైనా సునాయాసంగా ప్రయాణించే శక్తి దీని సొంతం. ప్రాక్టికాలిటీ, లగ్జరీ కలబోతగా ఉన్న ఈ కారు ఫ్యామిలీ ట్రిప్స్ కోసం అక్షర్ ఎక్కువగా వాడుతుంటారు.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ జీఎల్ఏ35 (Mercedes-Benz AMG GLA35)

లగ్జరీతో పాటు కాస్త స్పోర్టీ లుక్ కోసం అక్షర్ ఈ మెర్సిడెస్ ఏఎమ్‌జీ మోడల్‌ను ఎంచుకున్నారు. ఇతర ఎస్‌యూవీలు సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తే, ఈ ఏఎమ్‌జీ వెర్షన్ మాత్రం స్పీడ్, థ్రిల్ అందిస్తుంది. పవర్‌ఫుల్ ఇంజిన్, అగ్రెసివ్ లుక్‌తో ఉండే ఈ కారును అక్షర్ స్వయంగా డ్రైవ్ చేయడానికి ఇష్టపడతారు. దీని పెర్ఫార్మెన్స్ యువ క్రికెటర్ వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోతుంది. అక్షర్ పటేల్ వద్ద ఉన్న కార్ల సంఖ్య తక్కువే కావొచ్చు, కానీ ప్రతీ కారు ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో కొన్నట్లు కనిపిస్తుంది. రగ్గడ్ డిస్కవరీ, లగ్జరీ ఆటోబయోగ్రఫీ, స్పోర్టీ ఏఎమ్‌జీ కార్లు ఆయన అభిరుచిని చాటుతున్నాయని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.