BCCI Evaluates Asian Games Arrangements In Japan: జపాన్ లోని ఐచి నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఈవెంట్ కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అక్కడ క్రికెటర్ల కోసం చేసిన ఏర్పాట్లు, హోటల్ వసతులపై బీసీసీఐతో పాటు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంది. పరిస్థితులను సమీక్షించడానికి ఒక అబ్జర్వర్‌ను జపాన్ కు పంపాలని బోర్డు భావిస్తోంది. ఒకవేళ వసతులు ఏమాత్రం సరిగ్గా లేవని తేలితే ప్రధాన జట్టుకు బదులుగా 'బి' టీమ్ ను అక్కడికి పంపే అంశాన్ని బోర్డు పరిశీలిస్తోందని తెలుస్తోంది.

🔴BCCI UNHAPPY WITH ASIAN GAMES FACILITIES 🤯

- BCCI & ACC are reportedly not satisfied with the facilities in Japan for the Asian Games.

- Dressing rooms are reportedly set up in tents.

- Washrooms are around 500 metres away from the dressing rooms.

- Hotel rooms are… pic.twitter.com/3sM2WXhIAE

— Sam (@cricsam02) August 28, 2026

అసౌక‌ర్యాల పుట్ట‌..
జపాన్ లో క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై బీసీసీఐ వర్గాలు అన్ హేపీగా ఉన్నాయి. "ఏసీసీ సమావేశంలో జపాన్ ఒలింపిక్స్ నిర్వాహకులకు మా అభ్యంతరాలను తెలిపాం. క్రికెటర్ల కోసం డ్రెస్సింగ్ రూమ్ లను టెంట్లలో ఏర్పాటు చేశారు. పైగా వాష్ రూమ్స్ ఆ టెంట్ల నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఆటగాళ్లకు కేటాయించిన హోటల్ గదులు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి" అని బోర్డు ప్రతినిధి తెలిపాడు. అబ్జర్వర్ ఇచ్చే గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. మహిళల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు, పురుషుల విభాగం మ్యాచ్ లు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వ‌హిస్తారు.

Asian Games 2026 cricket fixtures are OUT! 🇮🇳

The road to gold is set as cricket returns to the Aichi-Nagoya Asian Games 2026 in the T20 format! 🏆

🇮🇳 India Men & Women will look to defend their Asian Games crowns as the battle for continental glory unfolds in Japan.

📅 Women:… pic.twitter.com/Gr0v44lRdN

— CrickBuster (@Crick_buster) August 27, 2026

బ‌ల‌మైన స్క్వాడ్..
చైనాలో చివ‌రిసారిగా జ‌రిగిన‌ ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన ఇండియా, ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకోవడానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బలమైన స్క్వాడ్ ను ప్రకటించింది. ఈ జట్టులో వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ ఉండగా, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఆడ‌తారు.

మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయ‌కత్వం..
మహిళల విభాగానికి కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ గా స్మృతి మంధాన వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, జి కమలిని, భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ జట్టులో స్థానం పొందారు. అయితే వసతులపై నెలకొన్న సందిగ్ధత తేలిన తర్వాతే సీనియర్ల ప్రయాణంపై స్పష్టత రానుంది.