Shooters Spark Medal Rush Alongside Solid Combat And Team Wins: జపాన్‌లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 రెండో రోజు పోటీల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో స‌త్తా చాటారు. షూటింగ్ విభాగంలో ఏకంగా మూడు పతకాలను కొల్లగొట్టడంతో పాటు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) పోటీల్లో ఒక కాంస్యం సాధించి దేశ పతకాల సంఖ్యను గణనీయంగా పెంచారు. ముఖ్యంగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్లు డబుల్ పోడియం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. హిమాన్షు ధిల్లాన్ అద్భుతమైన గురితో రజత పతకాన్ని సొంతం చేసుకోగా, రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకాన్ని సాధించాడు. అంతకుముందు ఇదే విభాగం టీమ్ ఈవెంట్‌లో హిమాన్షు, రుద్రాంక్ష్‌లతో కలిసి పార్థ్ మానే రజత పతకాన్ని సాధించి షూటింగ్‌లో పతకాల ఖాతాను మరింత పటిష్టం చేశారు.

🚨 DOUBLE MEDAL ALERT FOR INDIA IN MEN 10M AIR RIFLE AT ASIAN GAMES 2026!

Himanshu Dhillon 🥈
Rudrankksh Patil 🥉

China’s Sheng Lihao broke Games Record!

5th & 6th Medal for India at Asian Games

WELL DONE BOYS! 💪 pic.twitter.com/jeRNQfsOQ1

— The Khel India (@TheKhelIndia) September 21, 2026

సూచికకు కాంస్యం.. వివాదాస్పద సెమీస్ ఫలితం
మహిళల ట్రెడిషనల్ 60 కేజీల ఎంఎంఏ విభాగంలో భారత ఫైటర్ సూచిక తరియాల్ కాంస్య పతకాన్ని ద‌క్కించుకుంది. సింగపూర్‌కు చెందిన విక్టోరియా హుయ్ హూన్ టియోతో జరిగిన హోరాహోరీ సెమీఫైనల్ బౌట్‌లో ఆమె స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ రెఫరీ నిర్ణయంపై భారత బృందం అధికారికంగా అప్పీల్ చేసినప్పటికీ ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆమె కాంస్య పతకంతో సంతృప్తి పడింది.

Read Also: NZ Tour Workload Crisis Alert: కివీస్ టూర్‌లో షెడ్యూల్ రచ్చతో భారత్‌కు తలనొప్పి.. చివరి రెండు వన్డేలకు స్టార్లకు రెస్ట్ ఇచ్చే యోచన

పాక్‌పై టేబుల్ టెన్నిస్ క్లీన్ స్వీప్.. కబడ్డీలో జపాన్‌పై ఘన విజయం
ఇతర క్రీడా విభాగాల్లోనూ భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మహిళల టేబుల్ టెన్నిస్ గ్రూప్-ఎఫ్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత జట్టు 3-0తో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పురుషుల కబడ్డీ గ్రూప్-ఎ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌ను 49-24 తేడాతో భారత్ మట్టికరిపించి టోర్నమెంట్‌లో అదిరిపోయే శుభారంభాన్ని నమోదు చేసింది. సాఫ్ట్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆధ్య తివారీ, జై మీనా జోడీ కంబోడియాపై 5-0తో ఘన విజయం సాధించినా, తర్వాత మ్యాచ్‌లో దక్షిణ కొరియా చేతిలో 1-5తో ఓటమి చవిచూసింది.

స్విమ్మింగ్‌లో శ్రీహరి ముందంజ.. సెపక్‌తక్రాలో నిరాశ
ఈత పోటీల్లో స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. రిషభ్ దాస్ రిజర్వ్‌గా మిగిలాడు. 50 మీటర్ల ఫ్రీస్టైల్, 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగాల్లో ఆకాష్ మణి, గితేష్ షా, ధనుష్ సురేష్‌లు ఫైనల్ చేరలేకపోయారు. ఉషు ఫైనల్లో నైమాన్ వాంగ్సు 15వ స్థానంలో నిలవగా, సెపక్‌తక్రా గ్రూప్-బి పోరులో జపాన్ 2-1తో భారత్‌ను ఓడించింది. ఇక క‌డ‌ప‌టి వార్త‌లందేసరికి, నాలుగు ర‌జ‌తారు, రెండు కాంస్యాల‌తో క‌లిపి మొత్తం ఆరు మెడ‌ల్స్ తో భారత్ పాయింట్ల ప‌ట్టిక‌లో ప‌దో స్థానంలో కొనసాగుతోంది.